వృశ్చిక రాశివారు తమలో చాలా రహస్యాలు దాచుకుంటూ ఉంటారు.  అందరితోనూ విశ్వాసపాత్రంగా ఉంటారు. మరి వీరి ప్రేమ జీవితం ఎలా ఉండనుందో ఇప్పుడు  చూద్దాం.. 

మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మరి ఈ నూతన సంవత్సరంలో.. వృశ్చిక రాశివారి ప్రేమ జీవితం ఏలా సాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

 వృశ్చిక రాశివారు తమలో చాలా రహస్యాలు దాచుకుంటూ ఉంటారు. అందరితోనూ విశ్వాసపాత్రంగా ఉంటారు. మరి వీరి ప్రేమ జీవితం ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..

ఒంటరిగా ఉన్న వృశ్చిక రాశివారికి ఈ 2022లో వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. గత కొంతకాలంగా.. ఈ రాశివారు ఎవరైనా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నట్లయితే... వారికి కచ్చితంగా ఈ ఏడాది పెళ్లి జరిగే అవకాశం ఉంది.

ఒకవేళ.. మీరు నిశ్చితార్థం చేసుకొని ఉంటే.. ఈ సంవత్సరం మీకు వివాహం అవుతుంది. ఒకేవళ ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటే.., మీ బంధం బలంగా మారుతుంది. గతంలో మీ వివాహ బంధంలో.. ఏవైనా గొడవలు ఉంటే... అవి సద్దుమణిగి.. ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మీ తల్లిదండ్రుల కారణంగా.. ఏవైనా సమస్యలు ఉంటే... ఈ ఏడాది ఆ సమస్యలు పరిష్కారమైపోతాయి. అయితే.. ఆ దిశగా.. కొన్ని కసరత్తులు చేయాలి. చాలా వరకు.. మీ తల్లిదండ్రుల వైవాహిక జీవితం.. మీ జీవితంపై కూడా ఆధారపడి ఉంటుంది. వారి మధ్య గొడవలు జరుగుతూ ఉంటే.. అది మీ జీవితం పై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి.. అలాంటి సమస్యలు ఉంటే.. కౌన్సిలర్ సహాయం తీసుకోవాలి.