Asianet News TeluguAsianet News Telugu

శనిత్రయోదశి.. శివ కేశవుల ప్రీతి కరమైన రోజు

పనిలో సేవ చేసుకుంటూ శనికి ఇష్టమైన రంగు వస్త్రాలు దానం చేయడం లాటి పనులు చేయాలి. శనిగ్రహానికి ఇష్టమైన రంగు నలుపు, నీలి రంగులు. వాహనం కాకి. నువ్వులు, జిల్లేడు ఆకులు. శివునికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వులతో అభిషేకం చేయాలి.

sani trayodasi special article
Author
Hyderabad, First Published Jun 1, 2019, 8:03 AM IST

శని త్రయోదశి. అనగా శనివారం త్రయోదశి వచ్చేదానిని శని త్రయోదశి అంటారు. ఈ రోజు సూర్యోదయం నుండి ఒక గంటపాటు రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం వీలుకాని వారు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అనగా 5.30 నుంచి 6.30 మధ్యలో చేయాలి. శని వారం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు త్రయోదశి శివునికి ప్రీతికరమైనది. కావున ఈ రోజున అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా వృషభ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల వారికి వరుసగా అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనితో బాధపడుతుటాంరు. వీరు తప్పనిసరిగా చేయాలి.

శనిగ్రహం ఒక్కోరాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలపాటు సంచరిస్తూ ఉంటాడు. 12రాశులను చుట్టి రావడానికి  దాదాపు 30 సం||లు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కావున ఈ గ్రహానికి మందగమనుడు అని పేరు ఉన్నది.

ఈ గ్రహం రాశిచక్రంలో ఉండే స్థానాన్ని బ్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు. ఈ 5 రాశులవారు శని గ్రహానికి లోబడినవారే. దీనివల్ల ఏదో ఇబ్బంది అవుతది అని కాదు. వీరు ఎక్కువ శ్రమ పడతారు. తక్కువ లాభాలు పొందుతారు. కావున ఆ లోప నివారణకు కృషి చేయాలి. ఇప్పుడు ఈ రాశులవారు ఏ పని చేసినా కూడా సేవాదృక్పథంతో చేయాలి. చేసిన పనికి ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి. అప్పుడు మాత్రమే తాము అనుకున్న పనులు సాధిస్తారు. చేసే పనిలో లాభాలు ఆర్జించారంటే వీరికి ఫలితం దక్కదు. పైగా అధికంగా బాధపడుతుటాంరు.

పనిలో సేవ చేసుకుంటూ శనికి ఇష్టమైన రంగు వస్త్రాలు దానం చేయడం లాటి పనులు చేయాలి. శనిగ్రహానికి ఇష్టమైన రంగు నలుపు, నీలి రంగులు. వాహనం కాకి. నువ్వులు, జిల్లేడు ఆకులు. శివునికి నువ్వుల నూనెతో అభిషేకం, నువ్వులతో అభిషేకం చేయాలి. అలాగే నువ్వులతో చేసిన చిమిలి ఆహారంగా స్వీకరించాలి. శని వాయుతత్వ గ్రహం. నువ్వుల శరీరంలో వేడిని ప్టుటిస్తాయి. కావున ఈ పైన చెప్పిన రాశులవారు తప్పనిసరిగా ప్రతీరోజు ఆహారంలో నువ్వులు ఉండే విధంగా చూసుకోవాలి.

ప్రతి శనిత్రయోదశికి శివారాధన మంచిది. అలాగే ఈ రాశులవారు యోగా ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి. వీరికి గాలి పీల్చుకోవడం కూడా కొంత బద్ధకంగానే ఉంటుంది కావున ప్రాణాయామం తప్పనిసరిగా చేసుకోవాలి. శరీరాన్ని కదిలిచ్చాలంటే వీరికి తొందరగా ఇష్టముండదు. శరీరంలో విసర్జక వ్యవస్థకు శని కారకుడు అవుతాడు. అసలు సమస్య మొదలవడం విసర్జక వ్యవస్థతో ప్రారంభం అవుతుంది. తరువాత శరీరంలో అన్ని భాగాలకు చేరుతుంది. కావున వదిలించు కునే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. చెమట బాగా వచ్చేరకంగా శ్రమ పడాలి.

అయితే అందరిలో ఒక అపోహ ఉన్నది. శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని కాని అది తప్పు భావన. శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించినఫలితం వస్తుంది. శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి.    అన్ని గ్రహాల్లోకి ఒక్క శనిగ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు.

ఒకసారి కష్టపడడం అలవాటు అయిన వారికి సుఖపడడం చాలా తేలిక అవుతుంది. సుఖపడినవారికి కష్టపడడం తెలియదు. అది బాధాకరంగా ఉంటుంది. కాని శనిగ్రహం అలా కాదు. కష్టాన్ని ఇచ్చి తరువాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరివారే అనుభవించాలి. అది ఒకరు చెప్పేది కాదు. కావున వృషభ, కన్య, వృశ్చిక, ధనుస్సు, మకర రాశుల వారు తప్పనిసరిగా యోగా ప్రాణాయామాలు చేసి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రులు కాకగలరు.

నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్తాండ సంభూతం తనం నమామి శనైశ్చరమ్‌. ఈ శ్లోకాన్ని పఠించుకోవడం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios