నూనెతో వండిన పదార్థాలు, ఉసిరికాయ పనికిరావు. పితృతర్పణాలు చేయాలి, దానం శక్తికి ఉన్నంత. అష్టవసువులు, పితృదేవతల పూజ, ఓం అమృతాయ స్వాహా, పితృదేవతాభ్యోనమః మంత్ర జపం మంచిది, దీని వలన ఆత్మరక్షణ, సంతాన రక్షక కలుగుతుంది.

మొది రోజు : ఉల్లిఉసిరిచద్దిఎంగిలిచల్లని వస్తువులు వదిలి వేయాలి. నెయ్యిబంగారం దానం చేయాలి. పూజించే దేవత : స్వథా అగ్నిజపించాల్సిన మంత్రం: ఓం జాతవేదసే స్వథాపతే స్వాహాఇవి చేయడం వలన తేజో వర్ధనం కలుగుతుంది.

రెండవరోజు : తరిగిన కూరగాయలు వదిలివేయాలి. కలువపూలునూనెఉప్పు దానం చేయాలి. బ్రహ్మను పూజించాలి. ఓం గీప్పతయే విరించియే స్వాహా మంత్రం జపించాలి. దీని వలన మనస్సు స్థిమితం ఏర్పడుతుంది.

మూడవరోజు : ఉప్పు కలిసిన పదార్థాలుఉసిరికాయ వదిలివేయాలి. ఉప్పు దానం చేయాలి. పార్వతిదేవిని ఆరాధించాలి. ఓం పార్వత్యై పరమేశ్వర్యై స్వాహా మంత్రం జపించాలి. దీని వలన శక్తి సౌభాగ్యం లభిస్తాయి.

నాల్గవరోజు : వంకాయఉసిరికాయ పనికిరావు. నూనెపెసరపప్పు దానం చేయాలి. విఘ్నేశ్వర ఆరాధనఓం గం గణపతయే స్వాహా మంత్ర జపం చేయాలి. దీనివలన సద్బుద్ధికార్యసిద్ధి కలుగుతాయి.

ఐదవరోజు : పులుపుతో ఉన్న వస్తువులు పనికిరావు. స్వయంపాకంవిసనకర్ర దానం ఇవ్వాలి. ఆదిశేషుడిని పూజించాలి. ప్రాణాయామం చేయాలి. దీని వలన కీర్తి కలుగుతుంది.

6వ రోజు : ఇష్టమైన పదార్థాలుఉసిరి పనికిరాదు. చిమ్మిలి దానం చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధనఓం సుంబ్రం. సుబ్రహ్మణ్యాయ స్వాహా మంత్ర జపం చేయాలి. దీని వలన సర్వకార్యసిద్ధిసత్సంతానంజ్ఞానలబ్ధి కలుగుతాయి.

7వ రోజు : పింతో తినే వస్తువులుఉసిరి పనికిరావు. పట్టుబట్టలుగోధుమలబంగారం దానం చేయాలి. రవిని పూజించాలి. ఓం భాంభానవే స్వాహా జపం చేయాలి. తేజస్సుమంచి ఆరోగ్యం కలుగుతాయి.

8వ రోజు : ఉల్లిఉసిరిమద్యంమాసం పనికిరావు. ఎవరి శక్తికి తగినంత వారు దానం చేయవచ్చు.దుర్గాదేవి ఆరాధనఓం చాముండాయై విచ్చే స్వాహా జపం చేయాలి. దీనివలన చేసే పనుల్లో ధైర్యంఅన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

9వరోజు : నూనెతో వండిన పదార్థాలుఉసిరికాయ పనికిరావు. పితృతర్పణాలు చేయాలిదానం శక్తికి ఉన్నంత. అష్టవసువులుపితృదేవతల పూజఓం అమృతాయ స్వాహాపితృదేవతాభ్యోనమః మంత్ర జపం మంచిదిదీని వలన ఆత్మరక్షణసంతాన రక్షక కలుగుతుంది.

10వరోజు : గుమ్మడికాయనూనెఉసిరి పనికిరావు. గుమ్మడికాయస్వయంపాకంనూనె దానం చేయాలి. దిగ్గజాలను పూజించాలి.

11వరోజు : పులుపు పదార్థాలు ఉసిరికాయ తినకూడదు. విభూదిపండ్లు దానం చేయాలి. ఓం రుద్రాయస్వాహా ఓం నమశ్శివాయ జపం చేయాలి. దీని వలన ధనప్రాప్తిపదవులు ఏమైనా ఆశిస్తే అవి లభిస్తాయి.

12వ రోజు. ఉప్పుపులుపుకారంఉసిరికాయ పనికిరావు. పరిమళ ద్రవ్యాలుస్వయం పాకం దానం ఇవ్వాలి. భూదేవీ సహిత విష్ణుమూర్తి లేకపోతే కార్తీక దామోదరుని పూజఓం భూర్భువర్విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహా జపం అవసరం. దీని వలన బంధ విముక్తి కలుగుతుంది. ధన ధాన్యాలు కలుగుతాయి.

13వ రోజు : రాత్రిభోజనం చేయకూడదు. ఉసిరికాయ పనికిరావు. మల్లెపూలుజాజిపూలుఅన్నదానం చేయాలి. మన్మథ పూజఓం శ్రీ విరిశరాయ నమఃస్వాహా జపం చేయాలి. దీనివలన వీర్యవృద్ధి సౌందర్యం కలుగుతాయి.

14వ రోజు : ఇష్టమైన వస్తువులు ఉసిరికాయ వదిలాలి. నువ్వులుఇనుముదున్నపోతు దానం చేయాలి. యముడిని పూజించాలి. ఓం తలప్రియాయ సర్వ సంహారహేతినే స్వాహా జపం. దీనివలన అకాల మృత్యువు తొలగుతుంది.

15వ రోజు : తరబడిన వస్తువులు వదిలివేయాలి. కలువపూలునూనె ఉప్పు దానం చేయాలి. ఓం తులసిథాత్రీ కార్తీక దామోదర స్వాహా జపం చేయాలి. దీనివలన సర్వకార్యసిద్ధిపనుల్లో జయం చేకూరుతాయి.

డా.ఎస్.ప్రతిభ