పర్యావరణ పరిరక్షణకు మొక్కలు జీవనాధారం. ఈ మొక్కలు మాత్రమే ప్రపంచంలో మానవులు చేసే కలుషితాలు, మానవులు విడుదలచేసే వ్యర్థ పదార్థాలనుంచి కాపాడగలుగుతాయి. మనకు తెలిసినా తెలియకపోయినా ప్రతి మొక్క మన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక పరిధులను ప్రభావితం చేస్తుంది. సూర్యుని కాంతి వృక్షాల ఎదుగుదలకు దోహదపడతాయి. కాంతి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా వృక్షంగా మారుతుంది. వృక్షాలు మనకు స్వచ్ఛమైన గాలిని, ఆహార పదార్థాలను, కలపను నీడను, రోగనిరోధక శక్తిని అందించి మరెన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

వృక్షో రక్షతి రక్షితః

వృక్షాలను రక్షిస్తే, అవి మనల్ని రక్షిస్తాయి. వృక్షాల గొప్పదనం తెలుసుకున్న మన మహర్షులు, పూర్వికులు, మన సంసృతి సంప్రదాయంలో వ్యవహారంలో మిళితం చేశారు. జ్యోతిషశాస్త్రరీత్యా, మనకున్న 27 నక్షత్రాల్లో, వారి జన్మ నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని పెంచి, ఆరాధించడం ద్వారా జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. వృక్షాలను పెంచడం ద్వారా ఆరోగ్యం, ఆనందంతో పాటు పర్యావరణాన్ని కూడా రక్షించుకున్నవాళ్ళం అవుతాం. జన్మ నక్షత్రానికి చెందిన వృక్షాలను పెంచి, వాటినుంచి వచ్చే గాలిని పీల్చడం ద్వారా సూక్ష్మీకృతమైన ఆ వృక్ష శక్తి మానవునికి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతిని అందిస్తుంది. జన్మనక్షత్రానికి చెందిన వృక్షాలు ఇప్పుడు చూద్దాం.

1. అశ్విని - అడ్డసరం విషముష్టి : అడ్డసరం ఒక విధమైన ఔషధమొక్క. దీనిపండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. దగ్గు, ఆయాసం ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు సుఖవ్యాధుల  నివారణకు ఉపయోగపడుతుంది. వాంతులు, విరోచనాలు, విషజ్వరాలు, చర్మదోషాలను నివారిస్తుంది.

2. భరణి - దేవదారు, ఉసరిక : ఉసిరి ఔషధ గుణాలు : విటమిన్‌ సి అత్యధికంగా ఉంటుంది., చలువ చేస్తుంది. జుట్టుకి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎసిడిటీ, అల్సర్లను మాన్పుతుంది., నీరసం, నిస్సత్తువను మాన్పుతుంది. అరుగుదలను పెంచుతుంది. ముఖ్యంగా దీన్ని నిత్యం వాడేవారికి ముసలితనాన్ని దరిచేరనివ్వదు. యవ్వనవంతులుగా ఉంచుతుంది.

పురాణ ప్రస్తావన : భూమిపైన మొట్టమొదట ఆవిర్భవించింది. కాబ్టి దీనికి అధిరోహ, ఆదిఫలపేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. ఈ చెట్టును చూసినా లేదా కేవలం తలచినంతమాత్రాన గోవును దాన మిచ్చిన దానికి ర్టిెంపు ఫలితాన్నిస్తుంది.

ఈ చెట్టు క్రింద పూజ, జపం, తపస్సు, అన్నదానం, పిండప్రదానం ఉత్తమమైన ఫలితాలనిస్తుంది. ఉసిరి లక్ష్మీప్రదం. ఇవి ఉన్న ప్రదేశాలు, దేవాలయాలు, ఇళ్ళు సిరిసంపదలతో ఆలరారుతుటాంయి.

3. కృత్తిక - అత్తి లేదా మేడి చెట్టు : మేడి చెట్టును త్రిమూర్తి స్వరూపుడైన, దత్తాత్రేయ స్వరూపంగా భావిస్తారు. మేడి చెట్టు కొమ్మలు శుక్రునకు సమిధలుగా చెప్పబడినవి. ఇవి యజ్ఞాది పవిత్ర కర్మలందు ఉపయోగిస్తారు. జఠరాగ్నిని వృద్ధి చేయును. ఇది రక్త పిత్తము, మూర్ఛ దాహం, పోగొట్టును. దీనికి గర్భధారణ శక్తి కలదు. గుండె సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. సంకల్పం నెరవేరుతుంది.

4. రోహిణి - నేరేడు : నేరేడు చెట్టు చాలా వేగంగా పెరిగే గుణాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 30 మీటర్ల ఎత్తు పెరిగే అవకాశం. నేరేడు చెట్టు వందేళ్ళకు పైగా జీవించగలవు. నేరేడు పండు పోషకాలగని. అనారోగ్యాల నివారిణి. ఒక్క పండే కాదు. ఆకులు, బెరడు, కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. జిగట విరోచనాలు, కాలేయ సంబంధిత ఇబ్బందులు, అధిక బరువు, మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. చిగుళ్ళవాపులు, పుండ్లు నోటి దుర్వాసన తగ్గుతుంది.

రామాయణంలో శ్రీరాముడు పద్నాలుగేళ్ళు వనవానం చేసినప్పుడు ఎక్కువభాగం ఈ పండ్లతోనే కాలం గడిపాడని భారతీయుల విశ్వాసం. అందుకే దీనిని దేవతాఫలంగా భావిస్తారు.

కనీసం ప్రతీ ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎవరి నక్షత్రానికి తగిన మొక్కలు వాళ్ళు నాటుకునే ప్రయత్నం చేయాలి. ఆ చెట్టుక్రింద ప్రతీరోజు కొంచెం సమయం కేయించే ప్రయత్నం చేయాలి. దానికి నీరు పోయడం, ఆ గాలిని పీల్చడం కూడా చేయాలి. వీలైతే అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకోవడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ