పాము అనేది విద్యుదయస్కాంత శక్తి. ఇది ఎనర్జీకి సంకేతం. ఎనర్జీ ఎక్కడైనా ఉంటేనే ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. ప్రత్యుత్పత్తి జరిగితేనే జీవనం మనుగడ సాగించగలదు. తన వారసత్వం నిలబడాలంటే అందరికీ ఎనర్జీ అవసరం. ఆ ఎనర్జీనే మనవారు పాము ఆకారంగా గుర్తించారు. ఈ ఎనర్జీ సర్పిలాకృతిగా ఉంటుంది. సర్పిలాకృతమైన శక్తిని పాడుచేస్తే సంతానానికి నష్టం కలుగుతుంది.

ఆకాశం నుంచి కిందికి వచ్చే తరంగాలు అన్నీ కూడా వంకరుతిరుగుతూ సర్ప ఆకారంలో మాత్రమే వస్తాయి. అలా వచ్చే కణాలకు మాత్రమే శక్తి ఎక్కువగా ఉంటుంది. స్ర్‌ైగా వచ్చే కణాలకు శరీరంలో క్యాన్సర్‌ని  ప్రేరేపిస్తాయి. ఇవి చాలా ఇబ్బందికరమైన కణాలు.

ఈ 4,5 నెలల పాటు ప్రకృతిలో శక్తులు విజృంభించే సమయం అధికంగా ఉంటుంది.పర్యావరణ పరిరక్షణ అనేవి సమయం. వాటిని కాపాడుకోవడానికి ఈ సమయంలో ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో చేసే అన్ని పూజలు ఆరాధనలు ఎక్కువగా ప్రకృతిని కాపాడుకునేందుకు మాత్రమే ఉన్నాయి.

మన పెద్దలు చేసిన ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ కూడా ప్రకృతిని అనుసరించి మాత్రమే ఏర్పాటు చేసారు. ప్రకృతిలో ఉండే అసంతులిత స్థితిని శరీరానికి అనుగుణంగా మార్చుకోవడానికి కొన్ని పద్దతులను ఏర్పాటు చేసారు. ఆ ఏర్పాటు చేసిన విధానంలోనే నాగుల చవితి, నాగుల పంచమి కూడా ముఖ్యమైనవే.

ఈ సమయంలో వర్షాలు ఎక్కువగా పండుతాయి. పంటలు పండడానికి అనువైన సమయం. పంటలు పండడానికి కావలసిన శ్రమ అధికంగా చేయాలి. అన్ని రోజులు ఏమీ చేయకుండా ఉంటే పంటలు పండవు కావున కనీసం ఈ ఒక్క రోజైనా భూమిని దున్నకుండా ఉండాలనిపెట్టారు. పాములు భూమి లోపల బొఱిలలో నివసిస్తాయి.

కావున పూర్వకాలంలో భూమి దున్నడానికి పూర్వం భూమిని పూజించాలనే ఉద్దేశంతో ఈ నాగుల చవితి, పంచమి పూజలు ఆరాధనగా చెప్పారు.  ఎవరైతే ఎనర్జీని నాశనం చేస్తారో వారికి సంతానం కలుగదు అని ప్రతీక. ప్రస్తుత కాలంలో సంతానం వల్ల ఇబ్బందులు పడుతున్నవారు, సంతానం మాట వినకుండా ఉన్నవారు ప్రకృతిని కాపాడే పనులు అధికంగా చేయాలి. ఈ ప్రకృతిని కాపాడే పనులలో ఒక భాగం మాత్రమే ఈ నాగుల చవితి, నాగుల పంచమి పండుగలు.

ఈ రోజులో తీసుకునే ఆహార పదార్థాలు కూడా వేపుడు, నూనె ఎక్కువగా ఉపయోగించే పదార్థాలు వాడకూడదు ఈ రకమైన ఆహార పదార్థాలు వాడడం వల్ల జీర్ణశక్తి తొందరగా కాదు.  కావున ఉడబ్టెటిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని చెప్తారు. అందులో భాగంగానే కనీసం సర్పం ఆకృతిలో ఉండే కొన్ని కాయలు, లాటివి మాత్రమే తీసుకోవాలిని ఈ రోజు ఆహార పదార్థాలు తీసుకోవాలి. నివారధాన్యం తీసుకోవాలని చెప్పేవారు. అంటే భూమిని దున్నకుండా దానంతల అవే పండే పంటల ధాన్యాలు మాత్రమే స్వీకరించాలి అని. ప్రస్తుతం అవి అందరికీ అందుబాటులో ఉండవు కావున ఉడికించిన కొన్ని పదార్థాలు మాత్రే స్వీకరించాలని చెప్తారు.

ప్రతీ ఒక్కరూ100 పైగా రావి, వేప మారేడు మొదలైన వృక్షాలను నాటుతూ ప్రకృతి సంపదను కాపాడుతూ ఉండాలి. ఈ ప్రకృతిని కాపాడుతూ ఉంటేనే ఎవరికి కావలసిన సంపద వారికి లభిస్తుంది. ఈ చెట్లను నాటడం వల్ల ప్రకృతిలో ఆక్సిజన్‌ శాతం ఎక్కువగా పెరుగుతుంది. ఏ పనులు చేసినా పరోపకారం చేయడమే ముఖ్యవిషయంగా మనవారు చెప్పారు. వాటిని ఏవో మూఢనమ్మకాలని కొట్టి పారేయకుండా జాగ్రత్తగా పాటించే ప్రయత్నం చేద్దాం... ఈనెల 4వ తేదీన నాగుల చవితి, 5వ తేదీన నాగుల పంచమి. ఈ రోజునుంచైనా మంచి పనులు ప్రకృతిని కాపాడే పనులు చేయడానికి పూనుకుందాం అందరం కలిసి..... సర్వేజనాః సుఖినోభవంతు.... శ్రీమాత్రేనమః