డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

నవంబరు 28 శనివారం నాడు బుధుడు కుజుడి రాశైన విశాఖ నక్షత్రం నాల్గవ పాదం, వృశ్చికలోకి ఉదయం 7:04 నిమిషాలకు ప్రవేశం చేస్తున్నాడు. మిథున రాశికి అధిపతి అయిన బుధుడు. వృశ్చికలోకి ప్రవేశం చేయడం వలన "బుధాత్యయోగం" గా జ్యోతిష పరిభాషలో పిలవబడుతుంది. ఈ ప్రవేశం వలన కొన్ని రాశులపై ప్రతికూలం ప్రభావం ఉంటుంది. గ్రహం ప్రతికూలంగా ఉన్న జాతకులు ఈ మార్పు వలన తమపై చెడు ప్రభావాలను తొలగించడానికి వ్యక్తిగత జాతక ఆధారంగా రేమిడిస్ ఫాలో అవుతే శుభాలు కలుగుతాయి. ఆరోగ్యకరమైన శరీరంతో దీర్ఘాయువు పొందుతారు.

బుధుడిని జ్యోతిషశాస్త్ర ప్రకారం గ్రహాల యువరాజుగా పరిగణిస్తారు. బుధుడు వ్యాపారం, గౌరవం, కీర్తి, విశ్లేషణ కారకమైన గ్రహం పరిగణిస్తారు.  బుధుడు అందరికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. బుధుడు శుభ దృష్టి వలన తెలివితేటల పెరుగుదలకు దారితీస్తుంది. ఎవరి జాతకంలోనైనా శుభ గ్రహంతో బుధుడు ఉన్నప్పుడు శుభ ఫలితాలను కలిగిస్తాడు. ఒకవేళ ప్రతికూల గ్రహాలతో కానీ స్థానాలలో కానీ ఉంటే చెడు ప్రభావాలను ఇస్తాడు. బుధుడు శుభాకరంగా లేకుంటే జీవితంలో చాలా సమస్యలను సృష్టిస్తాడు. మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాడు, బుద్దిమాంద్యం కలిగిస్తాడు. వృశ్చికరాశిలోకి బుధుడు ప్రవేశించడం వలన బుధుడు ప్రతికూల ప్రభావ ఫలితాలను ఇచ్చే రాశులేమిటో గమనిద్దాం. బుధుడి వలన హానికరమైన ప్రభావాలను తొలగించడానికి వ్యక్తిగత జాతక ఆధారంగా రేమిడిస్ ఫాలో అవుతే శుభాలు కలుగుతాయి.

​మేషరాశి వారిపై బుధుడి ప్రభావం :- బుధుడు ప్రవేశం వలన శుభఫలితాలను ఇవ్వలేడు. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. బుధుడు ప్రయాణం సరైన దిశలో లేకపోయినట్లయితే మానసిక ఒత్తిడి తలెత్తుతుంది. ఈ సమయంలో మీరు మాటలను జాగ్రత్తగా అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే కుటుంబ వాతావరణం చెడిపోయే అవకాశం ఉంటుంది. వృత్తి వ్యవహారాలలో పనిపై దృష్టి పెట్టండి. వీలైనంత వరకు రాజకీయాలకు దూరంగా ఉండండి. లేకపోతే సమస్యలకు ఉండవచ్చు. ప్రయాణాలకు దూరంగా ఉండండి. 

​మిథునరాశి వారిపై బుధుడి ప్రభావం :- బుధుడు ప్రవేశం వలన మిథునరాశి వారికి అనుకూలంగా లేదు. తోబుట్టువుల జీవితాల్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు అపార్థానికి బలైపోవచ్చు. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు హాని కలిగించవచ్చు. జీవిత భాగస్వామిపై పెద్ద వివాదం ఉండవచ్చు. ఈ సమయంలో భాగస్వామ్యం వ్యాపారం హానికరంగా ఉంటాయి. మీరు మీ శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి తప్పుడు ప్రణాళికలో పాల్గొనకండి. ఆర్థిక లావాదేవీలకు సమయం సరిపడదు. 

కర్కాటకరాశి వారిపై బుధుడి ప్రభావం :- బుధుడు ప్రయాణం మీ స్వభావంలో కొద్దిగా దూకుడు పెంచుతుంది. ఇది సంబంధంలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది. అహం మీ నిర్ణయం తీసుకునే శక్తిని ఆధిపత్యం చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యం కోసం చాలా కష్టపడాలి. అలాగే నూతన ప్రణాళికను రూపొందించడానికి సహోద్యోగులతో కలిసి ఉండరు. వ్యాపారంలో మీ ప్రణాళిక విజయవంతం కాదు. అధిక ఆశయాలు దెబ్బతింటాయి. ఈ సమయంలో అదికారులు కేటాయించిన పనులు మాత్రమే చేస్తారు.

ధనస్సురాశి వారిపై బుధుడి ప్రభావం :- వృశ్చికంలోకి బుధుడు ప్రవేశం వలన ధనస్సు రాశి వారికి కొంత వరకు ఆందోళన ఉంటుంది. మిమ్మల్ని మరియు మీ కుటుంబ ఆరోగ్యాన్ని పూర్తిగా చూసుకోండి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండండి. అవసరం లేకపోతే ఇంటిని వదిలివేయవద్దు. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. విజయాన్ని అందుకోవడానికి విద్యార్థులు మరింత కష్టపడాలి స్నేహితులతో చిన్నగా మాట్లాడటం, ఘర్షణలు విడిపోయే పరిస్థితులకు దారితీస్తుంది.

​మీనరాశి వారిపై బుధుడి ప్రభావం :- బుధుడి ప్రవేశం వలన కొత్త ఆలోచనలను సృష్టిస్తుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి నడవండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వారిని పరిగణించండి. కోపం, అహంకారంతో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని బాధిస్తాయి. ఈ కారణంగా కార్యాలయంలో సహోద్యోగులతో సంబంధం అంతగా ఉండకపోవచ్చు. ఏదైనా పనిచేసే ముందు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. మహిళా సహోద్యోగులతో బాగా వ్యవహరించండి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి.