Asianet News TeluguAsianet News Telugu

మిథునరాశిలో బుధుడు ప్రవేశం: ఈ రాశులవారు బూరెల బుట్టలో పడ్డట్లే

మిథునం, కన్యా రాశులకు బుధుడిని అధిపతిగా పరిగణిస్తారు. ఈ సారి తన స్వంత రాశైన మిథునంలో ప్రవేశం చేస్తున్నాడు. మిథునంలో బుధుడి ప్రవేశం మే 26 ఉదయం 7.50 గంటలకు జరగనుంది. బుధుడు జూన్ 3వరకు మిథునంలో సంచరించనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. 
 

Mercury entry into Gemini is favorable for any zodiac sign
Author
Hyderabad, First Published May 26, 2021, 8:27 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Mercury entry into Gemini is favorable for any zodiac sign

మిథునరాశిలో బుధుడు ప్రవేశం 26 మే ఉదయం 7.50 గంటలకు ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు జూన్ 3 వరకు మిధునరాశిలోనే ఉంటాడు. ఈ వ్యవధిలో కొన్ని రాశుల వారికి అనునుకూల ఫలితాలను పొందుతారు. ఆ అనుకులతలు పొందే రాశులేంటో గమనిద్దాం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడిని నవగ్రహాలకు యువరాజుగా పరిగణిస్తారు. ఇతడిని కమ్యూనికేషన్ స్కిల్స్, విద్య, నాలెడ్జ్ లాంటి అంశాల్లో కారకుడిగా భావిస్తారు. బుధుడు రాశి పరివర్తనం చెందడ వల్ల ఈ విషయాలన్ని ప్రభావితమవుతాయి. తోబట్టువులతో సంబంధం బుధుడి స్థితిపైనే ఆధారపడి ఉంటుంది. శాస్త్ర ప్రకారం ఈ గ్రహం చాలా సానుకూల ఫలితాలు ఇస్తుంది. స్వభావరీత్యా ప్రశాంతమైందిగా పరిగణిస్తారు. 

మిథునం, కన్యా రాశులకు బుధుడిని అధిపతిగా పరిగణిస్తారు. ఈ సారి తన స్వంత రాశైన మిథునంలో ప్రవేశం చేస్తున్నాడు. మిథునంలో బుధుడి ప్రవేశం మే 26 ఉదయం 7.50 గంటలకు జరగనుంది. బుధుడు జూన్ 3వరకు మిథునంలో సంచరించనున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. 

మిథునరాశి ( Gemini ) వారికి:- మిథునరాశిలో మొదటి, నాలుగో పాదాలకు యజమానిగా బుధుడిని పరిగణిస్తారు. ఈ రాశిలో ప్రయాణం చేయడం వలన ఈ సమయంలో ఈ రాశి వారికి శుభ ప్రభావాన్ని చూపుతుంది. మానసికంగా బలంగా ఉంటారు. ఎలాంటి ప్రతికూల విషయం మిమ్మల్ని ప్రభావితం చేయదు. మీరు స్పష్టంగా మాట్లాడే విధానం ప్రజలను చాలా ప్రభావితం చేస్తుంది. కెరీర్, రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అమ్మకాల రంగంలో ఉండే వారికి ఈ సమయంలో ప్రయోజనం పొందుతారు. 

సింహరాశి ( Leo ) వారికి :- ఈ సమయంలో బుధుడు లాభాదాయకంగా ఉంటాడు, ఆదాయానికి సంబంధించిని లాభాస్తానంలో సంచరించదం వలన సింహరాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. జీవిత ప్రాధాన్యతలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. సంబంధాలను మెరుగుపరచుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రభావం కారణంగా ఈ సమయంలో ఆగిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. పెండింగ్ లో పడిన పనులను తిరిగి  ప్రారంభిస్తారు. సామాజిక మాధ్యమాల్లో ఉండే వారికి అనుకూలం. ఈ సమయంలో ఏ ప్రయోజనమైనా పొందవచ్చును. 


కన్యారాశి ( Virgo ) వారికి :-  బుధుడు కన్యారాశిలోని 1, 10వ భావాలకు అధిపతి. కెరీర్ పరంగా ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలు అందుకుంటారు. ఈ సమయంలో అభిరుచులకు సంబంధించిన కార్యాలను చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు. తండ్రితో సంబంధం మెరుగుపడుతుంది.  ప్రభుత్వ సంబంధిత పనులలో విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా ఈ సమయంలో విజయవంతమవుతాయి. రచయితలు, జర్నలిస్టులు,  సాఫ్ట్ వేర్ డెవలపర్లకు ఈ సమయంలో విజయం అందుకుంటారు. ఈ సమయంలో ఖర్చులు కూడా తగ్గుతాయి. కొంతమేర డబ్బు ఆదా చేయగలుగుతారు. కెరీర్ పరంగా ఈ సమయంలో కొన్ని శుభవార్తలు అందుకుంటారు.

తులారాశి ( Libra ) వారికి :- తులారాశి వారికి  బుధుడు 9, 12వ భావాలకు అధిపతిగా పరిగణిస్తారు. బుధుడు మీ రాశి నుంచి 9వ భావంలో సంచరించనున్నాడు. ఇది సెంటిమెంట్, అదృష్టం, ఆధ్యాత్మికత, ఉన్నత విద్యను సూచిస్తుంది. ఈ ప్రభావం ఆలోచనను విస్తరించేలా చేస్తుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు ప్రయత్నించే వారికి ఈ సమయంలో విజయం లభిస్తుంది. భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. కెరీర్ కు సంబంధించి ఆర్థికంగా ఆశించిన విజయాలను పొందుతారు. ఆరోగ్య విషయంలో కొంచెం నిరాశ చెందుతారు.

మకరరాశి ( Capricorn ) వారికి :- ఈ రాశివారికి బుధుడిని 6, 9వ భావాలకుకు అధిపతిగా పరిగణిస్తారు. ఈ సమయంలో పనిప్రదేశంల కొన్ని సంఘర్షణలు ఎదుర్కోవాలి. న్యాయవాదులు, ఆర్థిక రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ సమయంలో విజయవంతమవుతారు. మకరరాశి ప్రజలు ప్రస్తుతం ఉద్యోగ పరంగా విజయం సాధించగలరు. ఆస్తి విషయంలో మీరు పెట్టుబడులు పెడితే విజయం వరిస్తుంది. బహుమతులు, ప్రయోజనాలు పొందవచ్చు. సంబంధంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది. ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఈ కాలంలో విజయం సాధించగలరు. 

మీనరాశి ( Pices ) వారికి :- ఈ రాశివారికి బుధుడిని 4, 7వ భావాలకు అధిపతిగా భావిస్తారు.  మీనరాశి నుంచి నాలుగో భావంలో బుధుడు సంచరించనున్నాడు. ఇది తల్లి, ఇల్లు, లగ్జరీ జీవితాన్ని సూచిస్తుంది. ఆర్థిక విషయాల్లో మీకు ప్రత్యేక ప్రయోజనం లభిస్తుంది. సోమరితనం విస్మరించాల్సి ఉంటుంది. ఈ రవాణా సమయంలో మీరు ఆస్తి విషయంలో ప్రయోజనం పొందుతారు. దాంపత్య జీవితంలో మీకు సమయం విజయం లభిస్తుంది. పనిప్రదేశంలో ఏ పని చేసినా మీకు విజయం వరిస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios