Asianet News TeluguAsianet News Telugu

మాస ఫలాలు: మార్చినెలలో ఓ రాశివారి సమస్యలకు పరిష్కారం

మార్చి నెలలో రాశిఫలాలు ఇలా ఉండనున్నాయి. ఓ రాశివారు ఈ నెలలో చిన్న చిన్న అవకాశాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు.  వాహనాల యందు జాగ్రత్త అవసరము. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.

March 2023 monthly Horoscope
Author
First Published Mar 2, 2023, 9:34 AM IST

 
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ మాసం రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి.

 
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ ఆది గురు శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9
గృహముంలో శుభకార్యాలు జరిపించడం వలన అధిక ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. కులదేవతారాధన దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల  ఆదరణ తో అనుకూలమైన ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది.  అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సత్సంబంధాలు మెరుగుపడతాయి. సమస్యలు వలన  జీవిత భాగస్వామి తో విభేదాలు ఏర్పడతాయి. అకారణంగా అధిక ధనాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది. కుటుంబం ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతానం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిభ కనపరుస్తారు.  కొంతకాలంగా పరిష్కారం కానీ సమస్యలు పరిష్కారం అవుతాయి. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. మాసాంతంలో వృత్తి వ్యాపారంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో కలహాలుఏర్పడతాయి. ఉద్యోగుల స్థానచలనం అధికారులతో కలహాలు ఏర్పడవచ్చు. మిత్రులతోటి సఖ్యతగా ఉండవలెను. ఈ మాసం ఈ రాశి వారు ఆదిత్య హృదయం, అష్టలక్ష్మి స్తోత్రాలు పారాయణ చేయండి శుభ ఫలితాలు


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ ఆది -గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-9-12
ప్రభుత్వ సంబంధించిన పనులు సకాలంలో పూర్తగును. బంధుమిత్రులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలు గూరించి చర్చిస్తారు. ఉద్యోగములో అధికారుల  ఆదరణ పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. మీ మనసు లో ఉన్న కోరికలు నిజమౌతాయి. చిన్న చిన్న అవకాశాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు.  వాహనాల యందు జాగ్రత్త అవసరము. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ధనాన్ని ఇచ్చి పుచ్చుకునే వ్యవహారములలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమాజము లో మీరంటే కొంతమందికి ఈర్ష పుట్టువచ్చు ను. వృత్తి వ్యాపారములు అనుకూలించను. అకారణ కోపం వలన తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోవును. ఇతరుల  సహాయ సహకారాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. మాసాంతంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రావచ్చును. శారీరక శ్రమ పెరిగి సౌఖ్యం తగ్గును. అనవసరమైన ఖర్చులు పెరగడం వలన మానసిక ఆందోళన పెరుగుతుంది. ఈ మాసం ఈ రాశి వారు దుర్గా స్తోత్రం మరియు గణపతి స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ ఆది- గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 5-6-9
అకారణంగా విరోధాలు కలహాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన నష్టం కలుగుతుంది. శారీరకంగా మానసికంగా బలహీనపడతారు. భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనుల్లో ప్రతికూలంగా ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులు పట్టుదలతోటి చదవాలి. సమాజములో  అపవాదములు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులకు మంచి చేయాలని ఆలోచనలు తప్ప అపకారం చేయాలని ఆలోచనలు పక్కన పెట్టాలి. చిన్న చిన్న అవకాశాలను కూడా వదలకుండా సద్వినియోగం చేసుకోవాలి. వాహన ప్రయాణాలయందు జాగ్రత్తలు పాటించవలెను. అనుకోని సంఘటన వలన మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. ఉద్యోగములో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్న ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి. బంధువుల తోటి ఎడబాటుగా ఉండవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలి. మాసాంతంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగమనందు అధికారుల  ఆదర అభిమానాలు పొందుతారు. ఈ మాసం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్తోత్రం,  మహాలక్ష్మి స్తోత్రాలు పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 1-2-4-7
ఆర్థిక సమస్యలు ఏర్పడి నిల్వచేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఊహించను ఖర్చులు ఎదురయి మానసిక ఆందోళన కలిగిస్తాయి. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతోటి వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగమనందు అధికారుల  ఒత్తిడిలు ఎక్కువుగా ఉంటాయి. ఆరోగ్యం ఇబ్బందులు గురవుతారు. సోదర సహోదరుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. కీలకమైన సమస్యల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ అభివృద్ధి కొరకు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా సాధిస్తారు. మాసాంతంలో అనుకోని విధంగా ధన నష్టం కలుగుతుంది. సమాజములో ప్రతికూలత లు. వాహన ప్రయాణాలు జాగ్రత్త అవసరం. అధికారులతోటి విరోధాలు ఏర్పడవచ్చు. ఈ మాసం ఈ రాశి వారు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-4-7
చేయ పనులలో నిరోత్సాహం ఉండును. సంతానమునకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమాజములో అవమానాలు జరుగవచ్చు. ఉదర సంబంధిత వ్యాధులు వలన బాధపడవలసి వస్తుంది. ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. జీవిత భాగస్వామి తో కలహాలు ఏర్పడి మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం కష్టముగా ఉండును. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. కేసులు తీర్పులు ప్రతికూలంగా ఉండును. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో కలహాలు  ఏర్పడి చికాకు పుట్టించును. మాసాంతంలో నిరుద్యోగులు శుభవార్త వింటారు. అన్నదమ్ముల సహాయ సహకారాలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారమునందు ఊహించని ధన లాభం కలుగుతుంది. మిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. గృహంలో శాంతి నెలకొని ప్రశాంతత లభిస్తుంది. ఈ మాసం ఈ రాశి వారు దుర్గా స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
అనుకూలమైన తేదీలు      ॥ 3-5-9
గత కొంతకాలంగా వాయిదా పడిన పనులు పునః ప్రారంభమవుతాయి. భూ గృహ నిర్మాణ క్రయవిక్రయాలు అనుకూలించగలరు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజములో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించిన ధనలాభం కలుగుతుంది. రాజకీయ నాయకులు ప్రజాభిమానం కీలకమైన సమస్యలను మనోధైర్యం తో పరిష్కారిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేయువారు ప్రయత్నాలు ఫలించును. విద్యార్థిని విద్యార్థులు చదువు  ప్రతిభ కనపరుస్తారు. వివాహ ప్రయత్నాలు చేయవారు పట్టుదల తో చేసిన ఫలితం కలుగుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు.. మాసాంతంలో బంధుమిత్రుల  కలయిక. ప్రభుత్వ సంబంధిత అధికారులు, పెద్దలను కలిసి వారి సహాయ సహకారాలు పొందుతారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఏర్పడతాయి. ఈ మాసం ఈ రాశి వారు నారాయణ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-9-12
ఆర్థికంగా బలంగా ఉన్నా ఎంతో కొంత రుణాలు చేయవలసి వస్తుంది. చేసే పనుల్లో పట్టుదల అవసరము.  మిత్రులతోటి సఖ్యతగా ఉంటూ సహాయ సహకారాలు అందుకొనవలెను. భూ గృహ క్రయవిక్రయాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబములో కలహాలు లేకుండా జాగ్రత్త పడవలెను. వృత్తి వ్యాపారము లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. సమాజం లో అపవాదములు ఏర్పడతాయి. పిల్లలు  ఆరోగ్య విషయంలో తగజాగ్రత్తలు తీసుకొనవలెను. శత్రు బాధలు రుణ బాధలుంటాయి. ఉద్యోగ సంబంధిత విషయాలు ప్రతికూలంగా ఉండను. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అగును.  బంధు మిత్రుల  కలయిక. మాసాంతంలో శారీరక శ్రమ తగ్గి శరీర సౌకర్యం లభిస్తుంది. ధన ధాన్య లాభం కలుగును. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తల పట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవును. ఈ మాసం ఈ రాశి వారు దుర్గా స్తోత్రం, దుర్గా అర్చన చేయండి శుభ ఫలితాలు పొందండి.


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9
కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎదుర్కొని ముందుకు సాగుతారు. గృహముంలో చికాకులు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగును. చేయ పనులలో బుద్ధిబలం చూపిస్తారు. ప్రారంభించిన పనులన్నీ సకాలంలో సాధిస్తారు. సమాజములో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.  శత్రురుణ బాధలు తీరి ప్రశాంతత లభిస్తుంది. విద్యార్థిని విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యమునందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయ మార్గాలను, వచ్చిన అవకాశాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. పెద్దల  ఆదరభిమానాలు పొందగలరు. మాసాంతంలో ఎలాంటి విపత్తులు ఎదురైన ఉపాయంతోటి ఎదుర్కొనవలెను. చేయ వ్యవహారంలో చిక్కులు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. రుణ శత్రు బాధలు పెరగవచ్చు. ఈ మాసం ఈ రాశి వారు రుద్రార్చన మరియు శివ స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
అనుకూలమైన తేదీలు      ॥ 3-6-9-12
 ఎంతటి కఠినమైన సమస్యలైనా పరిష్కారం చేస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి  వినోదయాత్రలు చేస్తారు. బంధుమిత్రులతో అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఉద్యోగంలో అధికార వృద్ధితో అనుకూలమైన మార్పులు రావచ్చును. శారీరకంగా మానసికంగా బలపడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉండను. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రుణాలు తీరి ప్రశాంత లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు గారి రూపం దాలుస్తాయి. కోర్టు తీర్పులు కేసులు అనుకూలంగా ఉండును. విద్యార్థిని విద్యార్థులు ప్రోత్సాహానికి తగిన బహుమతులు పొందుతారు. సామాజిక సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవును. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. కుటుంబవనందు ప్రశాంతత వాతావరణ ఏర్పడుతుంది. మీ ప్రత్యర్ధులపై పై చేయి సాధిస్తారు. కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలని. సంతానం కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. మాసాంతంలో  అనవసరమైన ప్రయాణాలు చేయవలసిన వస్తుంది. గృహవనందు చికాకులు. ఈ మాసం ఈ రాశి వారు రాఘవేంద్ర స్తోత్రం మరియు దత్తాత్రేయ స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-3-6-7
ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు.  వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలోచించి పెట్టడం మంచిది. నా అన్నవారే అపకారం చేయాలని చూస్తారు. తలపెట్టిన పనులలో కష్టాలు ఎదురైనా పట్టుదలతోటి చేసినట్లయితే విజయం సాధిస్తారు. కుటుంబంలో మాట పట్టింపులు రాగలవు. బంధువులతోటి భిన్నాభిప్రాయాలు ఏర్పడగలవు. వ్యవహారంలో ఆత్రుత తగ్గించుకుని నిదానించి వ్యవహరించవలెను. శిరస్సుకు సంబంధిత అనారోగ్యాలు ఏర్పడగలవు. వైవాహిక జీవితంలో ప్రతికూలత వాతావరణం. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగును. విద్యార్థినీ విద్యార్థులు చదువుపైదృష్టి పెట్టవలెను. సమాజములో అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. అనవసరమైన పనులు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. భూ గృహ క్రయవిక్రయాలు లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైన పూర్తి కాగలవు. ప్రభుత్వ సంబంధిత పనులు సానుకూలంగానుండును. మాసాంతంలో నూతన అభివృద్ధి కార్యక్రమాలలో బృందమిత్రుల  సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగమునందు చికాకుల తొలగి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఈ మాసం ఈ రాశి వారు గణపతి స్తోత్రం సూర్యారాధన చేయండి శుభ ఫలితాలు పొందండి.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
అనుకూలమైన తేదీలు      ॥ 2-3-6-7
వ్యాపారంలో పెట్టుబడి విషయంలో పెద్దవారి  ఆలోచనలు తో పెట్టుబడులు పెట్టాలి. ఉద్యోగంలో ప్రతికూలంగా ఉంటుంది. చేసే పనుల్లో కోపావేశాలు తగ్గించుకొని చేయవలెను. శరీరమునందు ఉష్ణ సంబంధిత వ్యాధులు బాధ పెట్టను. సమస్యలు మనసులో ఆందోళనకరంగా మారును. శారీరక శ్రమ పెరిగి తొందరగా అలసిపోతారు. బంధుమిత్రులతోటి కలహాలు ఏర్పడవచ్చు. గృహములో  చికాకులు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి తో ఆకారణ మాట పట్టింపులు మనస్పర్ధలు ఏర్పడగలవు. ప్రభుత్వ సంబంధిత పనులు  పూర్తికాక చికాకు పుట్టించును. ఉద్యోగములో అధికారఅధికారుల ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. సమాజములో కోపం మాట దురుసుతనం తగ్గించుకుని వ్యవహరించవలెను. గృహ నిర్మాణ పనులు ఆలోచనలు వాయిదా వేయడం మంచిది. మాసాంతంలో వ్యాపారాల్లో ధనం ప్రాప్తించగలవు. తలచిన పనులన్నీ పూర్తి చేసుకోగలరు. కొన్ని విషయాలు అనుభవంలోకి వస్తాయి. ఈ మాసం ఈరాశి వారు శివారాధన , సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేయండి శుభ ఫలితాలు పొందండి.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
అనుకూలమైన తేదీలు      ॥ 6-7-9-12
వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం కష్టముగా నుండను. అకారణంగా బంధు వర్గం తోటి విరోధాలు ఏర్పడతాయి. మనసు నందు ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగమునందు స్థాన చలనం లేదా అధికారుల  ఆగ్రహానికి గురవుతారు. మిత్రులే శత్రువులయ్యే ప్రమాదం. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు ఆలోచించి మాట్లాడవలెను. చెల్లించాల్సిన ధన విషయంలో వివాదాస్పదం అవుతాయి. వీలైనంతవరకు వివాదాలకు చర్చలకు కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకొనవలెను. లేదా అధికంగా ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. సమాజము నందు అభినందనలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మధ్యవర్తిత్వం వహించడం లాంటి విషయాలలో దూరంగా ఉండటం మంచిది. మీ మనస్తత్వానికి ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. మాసాంతంలో దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కుటుంబ వృద్ధి కుడుంబ సౌఖ్యం లభిస్తుంది. ‌ ఈ మాసం ఈ రాశి వారు లక్ష్మీనారాయణ అర్చన మరియు మహాలక్ష్మి స్తోత్రం పారాయణం చేయండి శుభ ఫలితాలు పొందండి.

Follow Us:
Download App:
  • android
  • ios