డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఆదాయం 11, వ్యయం - 5                 రాజపూజ్యం - 2, అవమానం - 6

• మకరరాశి వారికి షష్టమంలో ఉన్న రాహువు, వ్యయంలో ఉన్న గురు, కేతువులు, జన్మరాశిలో సంచరించు శని కారణంగా 

• ఏలినాటి శనిలో జన్మ శని నడుస్తున్నది. కొంచం ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

• కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులకు విదేశీయానం అవకాశాలు లభిస్తాయి. 

• నమ్మకద్రోహాన్ని, కృతఘ్నతను భరించలేరు.

• ఒకనాటి శత్రువులు, మిత్రులు కావటం వల్ల కొంత మనఃశాంతి లభిస్తుంది.

• ప్రతిష్ఠ పెరుగుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాలలో బుజువు అవుతుంది.

• ఆత్మవిశ్వాసం, అభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల గౌరవంగా ప్రవర్తించరు. 

• విదేశాలలో వారికి కీలక సమయంలో తగు సహాయం చేస్తారు. 

• కుటుంబంలో చిక్కులు, కొంత అపవాదులు, అంతర్గత శత్రుత్వాలు ఏర్పడతాయి. 

• ఎవరిని నమ్మాలో ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టతరం అవుతుంది. 

• ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. 

• వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు మొదలగునవి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.ఈ విషయాలకు సంబంధించిన వాటిలో కొంత ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తాయి.   

• బందు, కుటుంబ విషయాలు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల, రాజకీయ అంశాలలో కొన్ని చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు.

• సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభపడగలుగుతారు.

• వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. కొంత అనాలోచితమై వ్యవహారం నడుస్తుంది.

• ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

• పేరెంట్స్ ఆరోగ్య వ్యవహారాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.

• దేనిలోనూ, ఎవరితోనూ విభేదాలకు, ఆవేశాలకు ఎంతమాత్రం చాన్స్ ఇవ్వకూడదు.  

• సహనంగా ఉండడానికి ధ్యానం , యోగ ,మెడిటేషన్ లాంటివి చేయండి.

• కొన్ని ఉహలకు అందని పరిణామాలు కనిపించి క్షణికావేశం తెప్పిస్తుంది. అలాంటి సందర్భంలోనే సహనం అవసరం. 

• మధ్య వర్తిత్వాలు చేయకండి, అప్పులు ఇవ్వకండి. జమానత్తు సంతకాలు చేయవద్దు ఇబ్బందులపాలు అవుతారు. 

• జీవితభాగస్వామి, వ్యాపార భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు పాటించండి. 

• రోటింగా సాగుతున్న జీవితాన్ని కొంత కొత్తదనాన్ని కోరుకుంటారు.

• విద్యా ,ఉద్యోగ, సినిమా, టివి రంగంలో అనుకూలంగా ఉంటుంది.

• నవంబర్ వరకు అంతంత మాత్రం వ్యవహారం నడుస్తుంది. ఆ తరవాత అనుకూలమైన శుభాలు కలుగుతాయి.

• రాజకీయంగా రాణిస్తారు ... మీ జాతకానికి బలాన్ని చేకూర్చే రేమిడీస్ ఫాలోఅవ్వండి. 
 
మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.