mahashivratri 2023: బిల్వ పత్రాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందులోనూ మహాశివుడికి ఈ బిల్వ పత్రం అంటే ఎంతో ఇష్టమట. అందుకే పరమేశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా బిల్వ పత్రాన్ని సమర్పిస్తారు. అయితే ఈ బిల్వ పత్రాన్ని శివుడికి సమర్పించే ముందు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

mahashivratri 2023: ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోబోతున్నాం. ప్రతి సంవత్సరం ఫాల్గున మాసంలోని కృష్ణ పక్షం చతుర్ధశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాం. మహాశివరాత్రినాడు శివుడు, పార్వతిలు వివాహం చేసుకున్నారని ప్రతీతి. అయితే ఈ రోజున శివపార్వతులను పూజిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయట. అయితే శివారాధనలో బిల్వ పత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బిల్వ పత్రం లేకుండా శివారాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. మత విశ్వాసాల ప్రకారం.. శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించడం వల్ల దేవుడు సంతోషిస్తాడు. అయితే శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించడంలో కొన్ని నియమాలను పాటించాలి. లేదంటే మీపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. శివుడికి బిల్వ పత్రాన్ని ఎలా సమర్పించాలంటే..

  • శివలింగంపై ఎప్పుడూ కూడా మూడు బిల్వ పత్రాలనే సమర్పించాలి. ఈ ఆకులకు మరకలు ఉండకూడదు. 
  • చిరిగిపోయిన, ఎండిపోయిన బిల్వపత్రాలను శివలింగానికి ఎప్పుడూ కూడా సమర్పించకూడదు.
  • శివలింగానికి బిల్వపత్రాన్ని సమర్పించే ముందు ఆకులను బాగా కడిగి ఆకు మృదువైన భాగాన్ని మాత్రమే సమర్పించండి.
  • అయితే మీకు పూజా సమయంలో తాజా బిల్వపత్రాలు అందుబాటులో లేకపోతే ఇంతకు ముందు ఉన్న ఆకులను కడిగి మళ్లీ శివలింగానికి సమర్పించండి. 
  • శివలింగంపై మీరు కావాలనుకుంటే 11 లేదా 21 బిల్వపత్రాలను సమర్పించొచ్చు. 
  • చుతుర్థి, అష్టమి, నవమి, ప్రదోష వ్రతం, శివరాత్రి, అమావాస్య, సోమవారం నాడు బిల్వపత్రాలు తాజాగా ఉంటాయి. శివుడికి బిల్వపత్రాలను సమర్పించాలనుకుంటే ఈ తేదీలకు ఒక రోజు ముందు బిల్వ పత్రాలను చెట్టు నుంచి కోసుకురండి. 

శివలింగానికి బిల్వపత్రాలను సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • శివలింగానికి బిల్వపత్రాలను సమర్పించిన తర్వాత.. నీటిని సమర్పించేటప్పుడు ఓం నమ:శివాయ అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి.
  • శివపూజ సమయంలో స్త్రీలు శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పిస్తే వారికి అంతా శుభమే కలుగుతుంది. 
  • బిల్వపత్రంపై రాముడు లేదా ఓం నమ: శివాయ అని చందనంతో రాసి శివలింగానికి సమర్పించాలి. దీంతో మీ కోరకలన్నీ నెరవేరుతాయి.