Astrology: ప్రతి శుక్రవారం ఇదొక్కటి చేస్తే చాలు.. ఇంట్లో డబ్బే డబ్బు!
డబ్బుల గురించి ఎవరు ఆలోచించరు చెప్పండి? ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. అది అవసరం కూడా. తగినంత సంపాదన ఉన్నప్పుడే లైఫ్ హ్యాపీగా సాగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏం చేస్తే ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుందో ఇక్కడ చూద్దాం.

ప్రతి ఒక్కరికి డబ్బు గురించి ఆలోచన ఉంటుంది. డబ్బు సంపాదించడం ఎలా? సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు, డబ్బు ఆదా చేసుకోవడం ఎలా, డబ్బు తక్కువ ఖర్చు చేయడం ఎలా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ ప్రశ్నలను డైరెక్ట్ గా ఎవరిని అడగకపోయినా ఒక్కసారైనా గూగుల్‌లో సెర్చ్ చేసి ఉంటారు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరూ కష్టపడేది ఆ డబ్బు కోసమే.
ఎవరికీ తల వంచకుండా రాయల్‌గా బతకాలంటే డబ్బు కచ్చితంగా సంపాదించాలి. సంపాదించిన దాన్ని ఆదా చేయాలి. అయితే లక్ష్మీదేవిని ఎప్పుడూ ఇంట్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.
శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేస్తే డబ్బే డబ్బు!
చాలామంది రోజు ఉదయం, సాయంత్రం దేవుడి ముందు నిలబడి మాకు మంచి సంపాదన కలగాలి అని కోరుకుంటూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 7 వారాల్లో లక్ష్మీదేవికి కేటాయించింది మంగళవారం, శుక్రవారం. వారాల్లో శ్రేష్టమైన వారం కూడా శుక్రవారం. ఎందుకంటే ఏ రోజు పూజ మిస్ అయినా.. శుక్రవారం మాత్రం ప్రతి ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. అయితే డబ్బు సంపాదించాలి, ఆదా చేయాలి, ఇంట్లో సిరిసంపదలు పెరగాలంటే ప్రతి శుక్రవారం తప్పకుండా, నిజాయితీగా పూజ చేస్తే కచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందట.
లక్ష్మీదేవికి ఎలా పూజ చేయాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ఇంట్లో ఈశాన్య మూలలో ఒక పీఠం మీద లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టాలి. పూజ చేసేటప్పుడు దేవతకు ఇష్టమైన పువ్వులు, పండ్లు వాడాలి. ఆ తర్వాత దేవీ కటాక్షం కోసం కొన్ని మంత్రాలు పఠించాలి. దేవికి ఇష్టమైన రంగులు అంటే తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు. వీటిని ధరించి పూజ చేస్తే మరింత మేలు జరుగుతుందట. అంతేకాదు ఇంటి మెయిన్ డోర్‌కి స్వస్తిక్ లేదా ఓం గుర్తును అతికించాలి.
ఇంటిని ఎప్పుడూ నీట్‌గా ఉంచుకోవాలి. ఇంట్లో ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ రాకుండా ధూపం, అగరబత్తి వెలిగించాలి. ఇవి చేసి పూజ మొదలుపెట్టాలి. ఇలా ప్రతి శుక్రవారం చేయడం ద్వారా ఇంట్లో సిరిసంపదలు తులతూగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.