డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

    ఆదాయం 8, వ్యయం - 11         రాజపూజ్యం - 6, అవమానం - 3


• కుంభరాశి వారికి గోచార ఏలిననాటి శని ప్రధమ భాగం నడుస్తున్నంది.

• పంచమంలో ఉన్న రాహువు, ఏకాదశంలో ఉన్న గురుకేతువులు వ్యయంలో ఉన్న శని ప్రభావ కారణంగా ఫలితాలు.

• శుక్ర, బుధ మహర్దశ నడుస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది.

• కేతు, శని మహర్దశ నడుస్తున్న వారాలకు కొంత ఎక్కువ శాతం చెడు ఫలితాలను చవిచూడాల్సి వస్తుది.

• మొత్తానికి ఈ సంవత్సరం నవంబర్ వరకు మధ్యస్త అనుకూలంగా ఫలితాలు ఉంటాయి.

• అన్ని అనుకూలంగా ఉన్ననూ మానసికంగా మాత్రం తృప్తిని పొందలేరు.

• ప్రభుత్వ కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది. అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు.

• నమ్ముకున్న వ్యక్తులు, మీవారు అనుకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో    ఉపయోగపడరు. 

• మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. అందులో అబద్దాలు ఉన్నాయని తెలిసినా డబ్బు సర్దుబాటు చేస్తారు.

• అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేయరు. ఆత్మీయవర్గం కూడా కొన్ని    సందర్భాలలో అపార్ధం చేసుకోవడం జరుగుతుంది. 

• మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటివాళ్ళు అధికంగా లాభం పొందుతారు. 

• అనుభవం లేని రంగాలలో కొత్తవారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు.  భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తెస్తారు. 

• అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగినవారు, సమాజంలో ప్రముఖులు వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం   చేస్తారు. 

• మీ మాటలు, సలహాలు, ప్రవర్తన అందరికి విశేషంగా ఆకట్టుకుంటాయి. 

• కొందరు మిమ్మల్ని నియమ నిబంధనలకు బాధించినా కొంతకాలం తర్వాత  ప్రయోజనాలు చేకూరుతాయి.  

• అవివాహితులకు వివాహ సమయం. అనుకూలమైన సంబంధం లభిస్తుంది. 

• మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరిచండి,  మీ మాటలకు వక్రార్ధాలు వచ్చే అవకాశం ఉంది.

• కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.

• ప్రభుత్వ పధకాల వలన లాభం చేకూరుతుంది.

•  విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి.

• రక్షా యంత్రం మీ పాకెట్లో ధరించడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది.

• మీరు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు మీద మీకు అధికారం లేకుండా పోతుంది.

• మీకు ఇష్టం లేకపోయినను రాజకీయ రంగ ప్రవేశ ఆస్కారం కలుగుతుంది.

• ప్రేమ వివాహాలు ప్రధాన చర్చాంశాలు అవుతాయి. ఆత్మీయులతో వాగ్వివాదం సంభవిస్తుంది.

• సంసార జీవితంలో భేదాభిప్రాయాలు ఉన్నా అవి పెద్దగా ప్రభావం చూపవు.

• కొందరు మీకు ఇష్టం లేని చేయడమే ప్రధాన పనిగా పెట్టుకుంటారు.

• చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నవారికి అనుకూలంగా ఉంది.

• మొత్తానికి ఈ సంవత్సరం మానసిక టెన్షన్ తప్ప అంతా సవ్యంగా సాగుతుంది.
 
మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.