కుజదోషం విషయంలో ప్రధానంగా చర్చించాల్సిన అంశమేమిటంటే అసలు ఈ దోషం వల్ల కలిగే ఇబ్బందులు ఏ రకంగా ఉంటాయి.

లగ్నంలో ఉంటే ఉద్వేగాన్ని, ద్వితీయంలో ఉంటే కుటుంబంపై దుష్ప్రభావాన్ని కలిగిస్తాడు. చతుర్థంలో ఉంటే అది సౌఖ్యస్థానం కావడం వలన సుఖాన్ని అధికంగా కోరుకుంటూ పొందలేక ఇబ్బందులు పడతారు. సప్తమంలో ఉంటే కళత్రంపై దాని ప్రభావం ఉండటం వల్ల కష్టాలకు శ్రీకారం చ్టుటినవారౌతారు. అష్టమంలో ఉంటే ఆకస్మిక నష్టాలకు గురౌతారు. 12లో ఉంటే శయ్యాసౌఖ్యాన్ని, నిద్రను కోల్పోతారు.

ఈ అంశాలన్నీ పరిశీలిస్తే కుజదోషం వల్ల వ్యక్తిలో నిగూఢంగా ఉండే కాముకాది అంశాలకు ప్రతీకగా కనిపిస్తుంది. కుజదోషం ఉన్న పురుషునికి అదే దోషం ఉన్న స్త్రీకి వివాహం చేయడం ఒకరకంగా ఒకేగణం వారికి వివాహం చేయడం విందే. దోషం ఇద్దరికీ ఉంటే పరిహారమవుతుంది అనే భావం ఇద్దరిలోనూ తీవ్ర స్వభావం, వ్యక్తిగతంలోనూ సాంసారిక జీవితంలో వారి అనుబంధాల్లో వారి తృప్తిపడడానికి అవకాశాన్ని ఇస్తాయి. ఒకరికి దోషం ఉండి మరొకరికి దోషం లేకపోతే వ్యక్తిగత సౌఖ్యహీనులై కుటుంబంలో ఇబ్బందులకు గురి అవుతారు. అవగాహనను కోల్పోవడం వల్ల నిద్రలేక నిరాశకు గురౌతారు. అందువల్ల కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారిని వివాహం చేసుకోవాలని సూచించడం జరిగి ఉండవచ్చు.

ఈ సూత్రాలన్నీ ఏర్పరిచిన కాలం మనం గమనిస్తే బాల్యవివాహాల కాలం. రజస్వలకు పూర్వమే వివాహం అయి వ్యక్తిగత జీవితంలో గాని సాంసారిక జీవితంలోగాని ఏమాత్రం అవగాహన లేని సమయంలో వివాహం అయితే ఈ సూత్రాలకు కొంత అర్థం ఏర్పడుతుంది. ఆ సమయంలో వారి ప్రాథమిక కలయికల్లో అవగాహనలోపం వల్ల వ్యక్తి ఆనందం పొందడంలోని లోపాన్ని చెప్పుకోలేక నిస్సారంగా జీవితాన్ని వెళ్ళదీయడం ఒక రకంగా మారకమనే చెప్పాలి. మరణం అని కొన్ని సూత్రాలలో ఇవ్వడం అంటే కేవలం ప్రాణం పోవడం ఒకటే కాదు వారికి ఏ వయస్సుల్లో ఏం కావాలో వాటిని మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా పొందలేకపోవడం తన ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేని జీవనాన్ని గడపడం కూడా ఒక రకంగా మారకమే అవుతుంది.

బాలారిష్టదోషం లాటిం దోషంగా కుజదోషాన్ని గుర్తించడమే మంచిది. ఆయా సమయాల్లో వారువారి భావాలు వ్యక్తీకరించుకోలేక సంసార జీవితంలో పాల్గొనవలసి రావడం వల్ల కలిగే మానసికక్షోభ దోషంగా పరిగణించవచ్చు.

ప్రస్తుతకాలంలో వివాహం ఒక వయస్సు వచ్చిన తర్వాతనే జరగడం, శరీరం పరిపూర్ణంగా ఎదిగిన తరువాత, వివాహ జీవన విషయంలో ఒక అవగాహనను ఏర్పరచుకున్నవారి మధ్యనే జరగడం వల్ల ఈ దోషానికి అంత ప్రాధాన్యత లేదు. ఇదిఅన్ని కూటములలాగే మరో కూటమిగా భావిస్తే చాలు. అంతేకాని ప్రత్యేకంగా కుజదోషం అని భయపెట్టడం గాని, కుజదోషం ఉండడం వల్ల వివాహానికి ఇబ్బంది అని గాని ఆలోచించాల్సిన అవసరం లేదు.

 ఏవో పరిహారాలు చేసినంత మాత్రాన అంతర్గతంగా ఉండే గ్రహప్రేరితమైన భావాలను తీసిపారవేయడం అంత సులభం కాదు. దానికి సమాజ జీవనం, సంస్కారం, ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించడం విం పనులు తెలిసి ఉండాలి. ఇది ఉంటే ఇతర దోషాల నుండి ఎప్పికీ విముక్తి పొందగలిగి ఆనందాన్నే పొందుతారు.

కాబట్టి కుజదోషం అంటూ ప్రస్తుత జాతకాలను వ్యతిరేకించడం అవసరం లేదు. నియమబద్ధమైన జీవితాన్ని కలిసి పంచుకునే ఏర్పాటు చేసుకుంటే అవగాహన ఏర్పరచుకుంటే ఈ దోషాలు ఏవీ ఇబ్బందిని  కలిగించేవి కావు.

డా.ఎస్.ప్రతిభ

ఏ రాశులవారిపై కుజదోషం ప్రభావం ఉంటుంది..?