ఈ కాలంలో కేవలం కుజదోషం అనే పేరుతో ఎన్నో జాతకాలను వ్యతిరేకిస్తున్న వారున్నారు. అయితే కుజదోషాన్ని గుర్తించడం, దానివల్ల కలిగే ఇబ్బందులను ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం.

జాతకంలో లగ్నం నుంచి గాని చంద్రుని నుండిగాని శుక్రుని నుండి గాని 2,4,7,8,12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషంగా చెప్పబడుతుంది. ఈ మూడు గ్రహాలనుండి దాదాపు 18 స్థానాల్లో కుజుడు ఉండే ఈ దోషం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ కుజదోషం స్త్రీ పురుషులకు ఉన్నప్పుడు వారి వైవాహిక భాగస్వాములకు ఇబ్బందులుటాంయని చెప్పడం జరిగింది.

పురుషులకు 2,7 స్థానాల్లో స్త్రీలకు 4,8 స్థానాల్లో కుజుడుంటే దోషం అని చెప్పారు.

కుజదోషం ఏర్పడడానికి ఎంత అవకాశం ఉందో పరిహారానికి అంతే అవకాశం ఉంటుంది.

1. సింహ కర్కాటక రాశులవారికి కుజదోషం లేదు.

2. కుజునికి స్వక్షేత్రాలైన మేష, వృశ్చికరాశుల్లో ప్టుటినవారికి, ఉచ్చస్థానమైన మకరరాశిలో ప్టుటినవారికి, మిత్రరాశులైన గురు రవుల రాశులైన సింహ, ధనుస్సు మీన రాశుల్లో ప్టుటినవారికి కుజదోషం లదు.

3. వృషభం కాని సింహం కాని లగ్నమై లగ్నాత్తు 2లో అంటే మిథున, కన్య రాశిల్లో కుజుడుంటే దోషం లేదు.

4. మకరం గాని, సింహం గాని లగ్నమైన 4స్థానంలో అంటే మేషం, వృశ్చికాలలో కుజుడుంటే దోషం లేదు.

5. మకర రాశిలో జన్మించి సప్తమంలో కుజుడుంటే దోషం లేదు.

6. సింహంగాని, వృషభంగాని లగ్నమై లగ్తాత్తు 8 స్థానం అంటే ధనస్సు మీనాలలో కుజుడుంటే దోషం లేదు.

7. కుంభ, సింహ రాశి జాతకులకు కుజదోషంగూర్చి ఆలోచించాలిసన అవసరం లేదు.

8. అశ్విని, మృగశిర్ష, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనూరాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాల్లో ప్టుటినవారికి దోషం లేదు.

9. కుజుడు గురువుతో కలిసి ఉన్నా, గురుదృష్టి కుజునిపై ఉన్నా ఆ జాతకులకు దోషం లేదు.

10. సప్తమంలో పూర్ణచంద్రుడు, బుధుడు, గురుడు శుక్రులలో ఎవరైనా ఉన్నా లేక వీరి దృష్టి సప్తమంపై ఉన్నా దోషరహితం.

11. సప్తమ స్థానాధిపతితో పూర్ణచంద్రుడు, బుధుడు గురుడు లేక శుక్రులలో ఎవరైనా కలిసి ఉన్నా దోష రహితం.

12. సప్తమ స్థానాధిపతి పూర్ణచంద్ర, బుధ, గురు లేక శుక్రుల దృష్టి కలిగి ఉన్నా దోష రహితం.

13. 10వ స్థానంలో శుభగ్రహం ఉంటే కుజదోష ప్రభావం ఉండదు.

14. కుజుడు కేంద్ర కోణాల్లో ఉన్నా దోషం ఉండదు.

దోషాలను, పరిహారాలను ఇన్నటినీ గమనిస్తే వీటన్నింలోనూ పాక్షిక సత్యాలే తప్ప పూర్ణసత్యాలు లేవని అర్థమౌతుంది.

డా.ఎస్.ప్రతిభ