మేషం : వీరికి సౌకర్యాల వలన ఒత్తిడి ఏర్పడుతుంది. సౌకర్యాలు కావాలనే ఆలోచన బాగా పెరుగుతుంది. దానికోసమై తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమకు లోనవుతారు. ప్రయాణాల్లో అనుకున్నంత సంతృప్తి లభించదు. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సులువుగా ఉండదు. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. గృహ నిర్మాణ పనుల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది.

వృషభం : వీరికి వ్యాపారస్తుల సహకారం కొంత లభిస్తుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. కళాకారులు సంతోషకరమైన వార్తలు వింరు. సోదర వర్గీయుల సహకారాలు లభిస్తాయి. కమ్యూనికేషన్స్‌ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. విద్యార్థులు మధ్యమమైన ఫలితాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితాలు ఆశించినంతగా రావు.

మిథునం : మధ్యవర్తిత్వాల విషయంలో కొంత ఒత్తిడికి లోనవుతారు. కొన్ని సార్లు పరుషంగా మ్లాడుతారు. ఆ విషయాన్ని ఆలోచించుకోవాలి. తర్వాత బాధపడకూడదు. మాట్లాడే ముందు కొంతసేపు ఆలోచించి అవసరమైతేనే మాట్లాడాలి. లేకపోతే మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. ఆర్థిక నిల్వలు కోల్పోయే సూచనలు. దానధర్మాలు అవసరం.

కర్కాటకం : చేసే అన్ని పనుల్లో కూడా కొంత అసందిగ్ధత ఏర్పడుతుంది. పనులు పూర్తి చేయడంలో ఆలస్యం అవుతుంది. ఆలోచనలకు అనుగుణంగా పనులు పూర్తి కావు. అప్పజెప్పిన పనిని సమయానికి అందించడానికి అధికంగా శ్రమ పడతారు. శరీరం తొందరగా అలసటకు గురి అవుతుంది. పనులు జేసేటప్పుడు నిరంతరం జపం చేయడం మంచిది.

సింహం : అనవసర ఖర్చులు ఎక్కువౌతాయి. ప్రయాణాల్లో సంతృప్తి లభించదు. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ఖర్చు చేసే ప్రతివిషయంలో ఘర్షణకు లోనౌతారు. ఒకికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడం మంచిది. వైద్యశాలలకు ఖర్చులు ఉంటాయి. పరామర్శలు చేస్తారు. కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఏర్పడవచ్చు. అన్నికీ సిద్ధంగా ఉండడం మంచిది.

కన్య : పెద్దల ఆశీస్సులకై పరితపిస్తారు. కాని అవి తొందరగా లభించవు. లాభాలు తొందరగా రావు. వచ్చిన లాభాలు సద్వినియోగం కావు. అనవసర ఒత్తిడి పెరుగుతుంది. ఆత్మీయులు దూరమౌతారు. లాభాలను సద్వినియోగం చేసే అలవాటు చేసుకోవాలి. కళాకారులు ఒత్తిడికి లోనవుతారు. శ్రీ రామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

తుల : అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులు ఆచి, తూచి వ్యవహరించాలి. పనుల ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. సమయం చాలా వేస్ట్‌ అవుతుంది. తమకు తెలియకుండానే ఒత్తిడి వచ్చి పడుతుంది. సంఘంలోగౌరవం కోసం పరితపిస్తుటాంరు. అధికారిక ప్రయాణాల్లో సౌకర్యాలు అంతగా లభించవు. అడ్జస్ట్‌ కావాల్సి వస్తుంది. శ్రీమాత్రేనమ

వృశ్చికం : పరిశోధకులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. చేసిన పరిశోధనలకు కావాలసిన ఫలితం లభించదు. విద్యార్థులు అధిక శ్రమకు గురి అవుతారు. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన బాగా పెరుగుతుంది. కాని అనుకున్న పనులు అంత సులువుగా పూర్తి చేయలేరు. అన్ని పనుల్లో సంతృప్తి తక్కువగా ఉంటుంది. సంతృప్తికై వెతుకులాట ఉంటుంది.

ధనుస్సు : లాభాలు ఊహించని విధంగా వస్తూ ఉంటాయి. వాిని సద్వినియోగం చేయకపోతే లాటరీలు, శేర్‌ మార్కెటంగ్‌లో పెడితే వచ్చిన లాభాలు లోపల దాచుకున్న డబ్బు అన్నీ పోతాయి. శ్రమలేని సంపాదన వస్తుంది. దానిని సద్వినియోగం చేయాలి. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు. క్రీం అచ్యుతానంత గోవింద జపం మంచిది.

మకరం  : సామాజిక అనుబంధాల్లో కొంత ఒత్తిడికి లోనవుతారు. భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని ప్లోటాటలు వచ్చే సూచనలు. ఏ విషయంలోనూ తొందరపడ కూడదు. నూతన పరిచయాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.  జీవిత భాగస్వాములతో అనుకూలత ఏర్పరచుకోవాలి. శ్రీమాత్రేనమః

కుంభం : పోటీల్లో గెలుపు సాధించాలంటే ఎక్కువ శ్రమ అవసరం. పట్టుదలతో కార్యసాదన చేస్తారు. కాని శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. ఋణబాధలు ఏదో ఒకరకంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆగస్టు తర్వాతకొంత సర్దుమనిగే సూచనలు. అనార్యో సమస్యలు వచ్చే సూచనలు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మీనం : సంతాన సమస్యలు అధికం అవుతాయి. సంతాన విషయంలో చాలా కన్‌ఫ్యూజన్‌ ఉంటుంది. ఏ విషయంలో ఒక క్లారిటీ అనిపించదు. క్రియేివిటీ వచ్చినట్లే వచ్చి పోతుంది. దానికోసం బాగాతాపత్రయ పడతారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. శ్రీమాత్రేనమఃమంచిది.