అనారోగ్య సూచనలు ఉన్నాయి. కడుపుకు సంబంధించిన లోపాలు ఏర్పడతాయి. వీరు తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. తొందరపాటు పనికిరాదు. ఆహారంలో ద్రవపదార్థాలు చాలా ఎక్కువగా ఉండాలి. త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. సౌకర్యాల వల్ల అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉంటాయి. అనుకున్న సమయానికి సౌకర్యాలు లభించవు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. మాతృవర్గీయులతో జాగ్రత్తగా ఉండాలి.  ఇల్లు చాలా విశాలంగా ఉండాలని కోరుకుంటారు. కాని ఆ ఇల్లువీరికి ఉపయోగపడదు. ఇల్లు కూడా అధిక వ్యయ ప్రయాసలకు ఓర్చి సంపాదించుకుంటారు.

AlsoRead leo: 2020లో సింహరాశి ఫలితాలు...

వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ హాని ఉండవచ్చు. అధికారులతో అప్రమత్తత అవసరం. తోటి ఉద్యోగుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

సంతాన సమస్యలు వచ్చే సూచనలు. సంతానం విషయంలో నిరాశ, నిస్పృహలు ఉంటాయి. వారు చేసే పనులు వీరికి అంత సంతృప్తికరంగా ఉండవు. సంతానం వల్ల మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. సౌకర్యాలు అంత అనుకూలించవు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సౌకర్యాలపై దృష్టి తగ్గించుకోవాలి.

ఈ రాశివారు బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజూ యోగా, ప్రాణాయామాలు, లేదా వాకింగ్‌ చేయడం తప్పనిసరి. దుర్గా స్తోత్ర పారాయణలు, మినప సున్ని ఉండలు, ఇడ్లీ, వడలు దానం చేయాలి. పశు పక్షాదులకు ఆహారాన్ని పెట్టాలి. పసుపు రంగు వస్త్రాలను, నీలిరంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.

ఈ రాశివారికి మొత్తంమీద అనుకూలత తక్కువగా ఉంటుంది. అన్ని గ్రహాలకు సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా శ్రద్ధతో చేసుకోవాలి.