డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

ఆదాయం - 2, వ్యయం - 11                 రాజపూజ్యం - 4, అవమానం - 7

•  దశమంలో ఉన్న రాహువు, చతుర్ధంలో ఉన్న గురు,కేతువులు, పంచమంలో ఉన్న శని ఫలితంగా 

• ఈ రాశివారికి ఈ సంవత్సరం నుంచి ఆర్థికాభివృద్ధి బాగుంది. 

• స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతం కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది.

• గోచార అర్దాష్టమ గురువు ఉన్న కారణంగా  స్త్రీ మూలకమైన ఇబ్బందులు లేదా అపవాదులు వచ్చే అవకాశాలు ఉంటాయి. 

•  స్త్రీ మూలక ఇబ్బందులు తప్ప అన్ని విధములుగా అనుకూలంగా ఉండబోతున్నది.

• వాహనయోగం, గృహాయోగం కలుగుతుంది. 

• బంధువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. 

• ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. 

•  సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. శుభకార్య నంబంధ విషయాలు సానుకూలపడతాయి. 

• తలపెట్టిన కార్యక్రమాలు మూడు వంతులు పూర్తవుతాయి. 

• రాజకీయ రంగం వారికి రాజకీయ పదవి లభిస్తుంది.

• వ్యాపార రంగంలోని వారికి అనుకూలంగా ఉంది. 

• వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి.

• ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు.

• ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరం అని భావిస్తారు. 

• అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. 

• మార్చురాని వ్యక్తులలో మార్చు తీసుకురావడానికి ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంటారు. అంతర్గత    రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. 

• ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను, చలనచిత్ర అంశాలను, రాజకీయాలను అనుకూలంగా మార్చుకోగలరు. 

• సివిల్‌, క్రిమినల్‌ కేసులలో తీర్పులు అనుకూలంగా వస్తాయి. 

• కులాంతర వివాహల ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులకు గురిచేస్తాయి.

• అప్పుగా ఇచ్చున డబ్బులు తిరిగిరాని బాకీలు వివాదస్పదం అవుతాయి.

మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.