Asianet News TeluguAsianet News Telugu

రాశుల్లో రవి సంచారం.. ఏ రాశివారికి ఎలా ఉంది?

రవి మేషరాశిలో సంచారం 15.5.2019వరకు ఉన్నాడు. తరువాత వృషభరాశిలో సంచారం ఉంటుంది. రవి అధికారానికి  సంబంధించిన గ్రహం. శరీరంలో గుండెకు ప్రాధాన్యత వహిస్తాడు.

horoscope special artical over ravi snacharam
Author
Hyderabad, First Published Apr 18, 2019, 10:27 AM IST

రవి మేషరాశిలో సంచారం 15.5.2019వరకు ఉన్నాడు. తరువాత వృషభరాశిలో సంచారం ఉంటుంది. రవి అధికారానికి  సంబంధించిన గ్రహం. శరీరంలో గుండెకు ప్రాధాన్యత వహిస్తాడు. ప్రస్తుతం వేసవి కాలం కావడం వల్ల కూడా తమ శరీరంలో వేడి, బయట వేడి అధికంగా ఉంటుంది కావున అన్ని రాశుల వారు ప్రస్తుతం జల పదార్థాలు అధికంగా స్వీకరించాలి. నీకి  ని ఎక్కువగాత్రాగాలి. శరీరంలో వేడి అధికంగా పెరుగుతుంది. కాళ్ళు పగలడం లాటివి కూడా ఉండవచ్చు.

మేషం : శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. తమకు అవసరం లేని పనులు అన్నీ ఈ సమయంలో వచ్చి పడతాయి.   ఒకేసారి పది పనులు చేయాల్సి వస్తుంది. తరచు ప్రయాణాలు చేస్తూ ఉంట్రారు. ఉద్యోగస్తులు అయితే వేరే ప్రదేశాలకు ట్రాన్ఫర్స్‌ అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

వృషభం : విశ్రాంతికై ప్రయతిస్తారు. విశ్రాంతి తొందరగా లభించదు. అనవసర ఖర్చులు పెరుగుతాయి.  వైద్యశాలల సందర్శనం ఉంటుంది. రాత్రిళ్ళు నిద్ర తక్కువగా ఉంటుంది. ఆలోచనలు, ఆవేశాలు పెరుగుతాయి. అన్ని పనులు ఒత్తిడితో పూర్తి చేస్తారు. దానాలు చేయడం మంచిది.

మిథునం :  అధికారిక లాభాలు ఉంట్రాయి. అధికారులతో అనుకూలత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. పెద్దలు, అధికారుల అండ దండలు పెరుగుతాయి. వారి సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కమ్యూనికేషన్స్‌ విస్తరిస్తాయి.

కర్కాటకం : సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో నైపుణ్యం పెరుగుతుంది.  అధికారుల ఆదరణ ఉంటుంది. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. హోదా గౌరవం పెరిగిన దానిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. దాని వల్ల ఒత్తిడి అధికం అవుతుంది. శ్రీ రాజమాతంగ్యై నమః జపం మంచిది.

సింహం :పనుల ఒత్తిడి అధికంగా పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఉంట్రాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. కాని అనుకున్నంత సులువుగా ప్రయాణం చేయలేరు. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అధికారిక ప్రయాణాలు ఆచి, తూచి చేయాల్సి ఉంటుంది.

కన్య : అనారోగ్య సమస్యలుఉంట్రాయి. ఊహించని ఇబ్బందులు ఉంట్రాయి. అధికారులతో అప్రమత్తత అవసరం. అవనసవర ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనం వృథా అవుతుంది. ఏ పని చేసినా ఒకకి కి  రెండుసార్లు ఆలోచించి మరీ చేయండి.

తుల : సామాజిక అనుబంధాలు శ్రమతో సాధించాలి. సామాజిక ఒత్తిడి అధికమౌతుంది. భాగస్వామిక వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకూడదు. నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. పరిచయాలు పెంచుకోకపోవడం మంచిది.

వృశ్చికం : శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుపు ఉంటుంది. ఋణ సంబంధ ఆలోచనలు తీరుతాయి.  రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అన్ని ప్రదేశాల్లో విజయం సాధిస్తారు. కొంత అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. అహంకారం వల్ల అందరూ దూరమౌతారు. జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు : మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన సమస్యలు పెరిగే సూచనలు. సంతానంకోసం ఆలోచన అధికమౌతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. ఆలోచనల్లో అలజడి పెరుగుతుంది. ఏవో భయాలు మనసులో ఆందోళనకు గురిచేస్తాయి. ప్రశాంతంగా నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి.

మకరం : సౌకర్యాలపైదృష్టి పెరుగుతుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఉంటుంది. ఆహారం సమయానికి  అందకపోవచ్చు.  మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. గౌరవహాని జరగవచ్చు. గౌరవాదులకోసం ఎక్కువ ప్రాకులాడకూడదు. తమకు గౌరవం లేని చోట పక్కకు జరగడం మంచిది.

కుంభం : వీరికి  రవి తృతీయ సంచారం ఉంటుంది. కమ్యూనికేషన్స్‌ బాగా విస్తరిస్తాయి. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అన్ని పనుల్లో సంతోషం ఏర్పడుతుంది. విద్యార్థులు కష్టపడి విజయం సాధిస్తారు.

మీనం : మీనరాశికి  వారికి  ద్వితీయంలో రవి సంచారం ఉంటుంది. దీనివలన మాటల్లో కఠినత్వం ఉంటుంది. మ్లాడే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సంబంధాల వల్ల కొంత ఒత్తిడికకి  లోనవుతారు. ఆత్మీయులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక నిల్వల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకూడదు.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios