వీరికి పెద్దలవారి సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పరాక్రమవంతులుగా ఉంటారు. దగ్గరి ఆధ్యాత్మిక యాత్రలు అనగా చిన్న చిన్న తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ప్రచార, ప్రసార సాధనాలు వీరికి అనుకూలిస్తాయి. అనగా ప్రయాణాల్లో సంతోషం లభిస్తుంది. పరామర్శలు ఆనందకరంగా ఉంటాయి. చిత్త చాంచల్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధిస్తారు.

వీరికి సామాజిక అనుబంధాలు విస్తరిస్తాయి. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పదిమందిలో గుర్తింపు లభిస్తుంది. భాగస్వాముల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులు వృద్ధిలోకి వస్తారు. వ్యాపార మెళుకువలు తెలుస్తాయి. తాము ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా సమాజంలోని ప్రతి వ్యక్తికి గౌరవాన్ని అందిస్తారు. సమాజానికి తాను చేయాల్సినది చాలా ఉందని, అందులో తాను చాలా చిన్నవారిమని వీరు భావిస్తారు. ఆలోచనల్లో విస్తృతి ఉంటుంది.

చదువుకునే విద్యార్థులే కాకుండా పరిశోధకులకు కూడా వారు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరదృష్టి చాలా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. ప్రయాణాల్లో సంతోషం లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి సారిస్తారు. దైవచింతన పెంచుకునే ప్రయత్నం చేస్తారు. జ్ఞాన వృద్ధులతో వీరికి పరిచయం ఏర్పడుతుంది. గురువులు, మహర్షులు వారి దర్శనానికి వెళ్ళడం వారితో మ్లాడడం చేస్తారు. ప్రత్యక్ష గురువుల సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏ పని చేసినా అందులో సంతృప్తిని వెతుక్కుటారు. అది వీరికి లభిస్తుంది.

వీరు తమకోసం తాము కాకుండా ఇతరులకోసం ఖర్చు చేస్తారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. ఇతరులపై ఆధారపడతారు. వీరికి సమిష్టి ఆశయాల సాధన ఉంటుంది. అందరి బరవు బాధ్యతలు వీరు తీసుకుంటారు. కళాకారులకు అనుకూల సమయం ఉంటుంది. ఉపాసనను పెంచుకుంటారు. తమ చుట్టూ ఉండేవారి సుఖ సంతోశాలకోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. దానివల్ల సంతోషం, సంతృప్తి లభిస్తాయి.

కన్యారాశివారికి గురువు అనుకూలంగా ఉన్నాడు. అనుకూలంగా ఉన్న సమయంలో మంచి పనులు చేస్తూ వీరు తమను తాము వృద్ధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. గ్రహం అనుకూలంగా ఉన్న సమయంలో మంచి పనులు ఎక్కువగా చేస్తూ తమను తాము నిరూపించే ప్రయత్నం చేయాలి.

వీరు సహకారం తక్కువ తీసుకొని ఎక్కువ అందివ్వాలి. దానివల్ల తమకు సహకారం ఇచ్చేవారి సంఖ్య అధికంగా పెరుగుతుంది. ఆ సహకారాన్ని అత్యవసర సమయాల్లో మాత్రమే వినియోగించాలి.

పరస్పర సహకారం అందినప్పుడు దానిని అవసరమైన వినియోగించుకొని ఎదుటి వారి అవసరాన్ని గుర్తించి వారికి ఇవ్వాలి. దానివల్ల సమాజంలో గౌరవం, సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పదిమందిలో గౌరవం వస్తుంది.

పెద్దల ఆశీస్సులు వీరికి తొందరగా లభిస్తాయి. అంతే తొందరగా వ్యతిరేకతలు కూడా పెరుగుతాయి. ఆ వ్యతిరకతలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కావున అందరికి తలలో నాలుకలాగ ఉండాలి. పెద్దవారితో అనుకూలత వలన వీరికి కావలసిన పనులు సూనాయాసంగా నెరవేర్చుకోగలుగుతారు. ఎదుటి వారు వీరిని చూసి ఈర్షపడకుండా తమకు కావలసిన పనులే కాకుండా ఇతరుల పనులను కూడా వీరు నెరవేర్చాలి. అంతేకాని అహంకారానికి వెళ్లకూడదు. అహంకారం ఒకసారి వస్తే అది తమ పతనానికే అని గుర్తించుకోవాలి.

వీరు గురువారాలు ఉపవాసం ఉండడం, పాలకోవాతో చేసిన స్వ్స్‌ీ పంచడం, శనగలు గుడిలో నైవేద్యంగా పెట్టడం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ