వీరికి గురువు అనుగ్రహం అంత అనుకూలంగా ఉండదు. గురువు ఈ రాశి అధిపతి అయినప్పిటికి వీరికి మంచి జరుగదు. మంచివారు తాము ఉన్నస్థానాన్ని బాగుచేస్తారు. తమ సొంత ఇంటి ని కూడా లెక్కచేయరు. తాము ఉన్న చోటులోనే తమకు అన్నీ ఉన్నాయని భావిస్తారు.

వీరికి ఈ సంవత్సరం సౌకర్యాలపై దృష్టి అధికంగా ఉంటుంది. సౌకర్యాలు పెంచుకోవాలనే ఆలోచన కూడా అధికంగా ఉంటుంది. కాని ఆ సౌకర్యాలు సమయానికి వీరికి అందవు. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తుటా ంరు. వీరికి ఈ సంవత్సరం కొంత అజీర్ణి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గ్యాస్‌ప్రాబ్లమ్స్‌, కడుపునొప్పి మొదలైనవి కూడా రావచ్చు. ఇంటి ని అందంగా తీర్చి దిద్దుకోవాలనే తమకు సొంత ఇల్లు ఉండాలని ఆలోచన బాగా ఉంటుంది. కాని సొంత ఇంటి కోసం చేసే ప్రయత్నాల వల్ల కొంత శ్రమ ఒత్తిడి వీరికి తప్పకపోవచ్చు. ఆ ఆలోచనల వల్ల కూడా సమయానికి ఆహారం తీసుకోకుండా ఉంటా రు. కాబ్టి జాగ్రత్త అవసరం.

పోటీల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. పెద్దవారితో పోటీ పడతారు. వారిపై కొంత వ్యతిరేకతను పెంచుకుటారు. శత్రువులు పెరిగే సూచన ఉంటుంది. ఆత్మీయంగానే ఉంటా రు కాని మనస్ఫూర్తిగా ఉండరు. తాము చేసే పనులే తమకు ఇబ్బందిని కలిగిస్తాయి. వాటి  ద్వారా ఒత్తిడి ఎక్కువౌవుతంది. రోగనిరోధకశక్తి పెంచుకునే ఆలోచన ఉంటుంది.

ఊహించని ఇబ్బందులు వస్తాయి. కొత్త కొత్త పనులు ప్రారంభించి తెలియకుండానే కష్టాలు తెచ్చుకుటా ంరు. ప్రయాణాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. కాని ప్రయాణాలు అంతగా సంతోషాన్ని ఇవ్వవు. పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు చేయాలనుకుటా ంరు. అక్కడ కూడా మనశ్శాంతి లభించదు. దాచుకున్న డబ్బులు పరులపాలు అయ్యే సూచనలు ఉన్నాయి.  ఎక్కువగా డబ్బులు దాచకుండా, స్థిరాస్తులపై దృష్టి పెట్టకూడదు. స్థిరాస్తుల వల్ల కూడా కొత్త కొత్త సమస్యలు ఎదురయ్యే సూచన కనబడుతుంది. చెడు సహవాసాల జోలికి పోకుండా జాగ్రత్త పడాలి.

వీరికి విశ్రాంతి అంతగా లభించదు. విశ్రాంతి లభించకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు ఉంటే దేనిపైన శ్రద్ధ చూపించలేరు. పాదాల నొప్పులు వచ్చే అవకాశం. వీరు అధికంగా లావు ఉన్నవారు దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అధికబరువు పాదాలపై పడి మోకాళ్ళ నొప్పులకు అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలు తమ ఆరోగ్య విషయంలో పాదాల విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.

వీరు తీసుకునే ఆహారంలో తొందరగా జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా ఉండాలి. ఎప్పుడూ కడుపునిండుగా తినకూడదు.   ఎదుటి వారికి ఉన్న ఇల్లును చూసి సంతోషపడాలి కాని తమకు అలాటి గృహం కావాలని ఆలోచన పెట్టుకోకూడదు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నా ఒకసారి కాకపోతే మరోసారైనా మనశ్శాంతి లభిస్తుంది. ఏవో ఊహలు పెట్టుకొని వెళ్ళకూడదు.

గురువులు పెద్దవారితో మ్లాడేటప్పుడు ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త అవసరం. తొందరపాటు పనికిరాదు.  నెమ్మదిగా ఒకికి రెండు సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. గురువులతో ఏ విషయంలో పోటీకి వెళ్ళకూడదు. మనస్సులో ఆ ఆలోచనలే రానివ్వకూడదు. శత్రుత్వాలను పెంచుకోకూడదు. తగ్గించుకోవాలి.

అనుకోని ఇబ్బందులు ఉంటా యని ముందే తెలుసుకుని వాటి  నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలి. వీరి దగ్గర డబ్బు అనవసరంగా ఖర్చైపోతుంది. కనుక వీరు పొదుపు చేయాలనే ఆలోచన నుంచి బయటపడాలి. వీరు దానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. దానాలు చేయడం వలన అనవసర ఖర్చునుండి తప్పించుకుటారు. దానాలు చేయడం అంటే హోమాలకు నెయ్యి, పేదవారికి కావలసిన సరుకు ఇవ్వడం వలన పుణ్యబలం పెరుగుతుంది. అనుకోకుండా డబ్బు పోతే బాధ అనిపిస్తుంది. కాని దానిని ముందే మంచి పనులకు వినియోగిస్తే ఆ డబ్బు పోయే అవసరం రాదు.

ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. మనశ్శాంతి ఉంట అన్నీ ఉన్నాయి. వీరు దక్షిణామూర్తి, సాయిబాబా, దత్తాత్రేయస్వామి దర్శనాలు కాని లేదా ప్రత్యక్షంగా గురు దర్శనం కాని చేసుకోవాలి. పసుపుపచ్చ బట్టలు దానం ఇవ్వాలి. హోమాలకు ఆవునెయ్యి దానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ