Asianet News TeluguAsianet News Telugu

గ్రహాల ప్రభావంతో.. వ్యాధులు

ఒకవేళ గ్రహాలలో ఎతు లేదా వంతగా ఉన్నచో లేదా ఎంతు మరియు వంతగా ఉన్నచో మాత్రమే  అంటే ఎగుడు దిగుడుగా మాత్రమే ఉంటే ఈ క్రింది వ్యాధులు వచ్చు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

graha effect on people
Author
Hyderabad, First Published Jul 24, 2019, 1:16 PM IST

ఏ ఏ గ్రహాలకు ఏ ఏ  వ్యాధులు వస్తాయో. తెలుసుకుందాం. ఆ గ్రహ పర్వం లావుగా ఉన్న లేదా సన్నగా లేదా అన్‌ ఈక్వల్‌గా ఉన్న చేతిని చూసి ఏ వ్యాధులు వస్తాయో తెలియజేయవచ్చు.

గ్రహాలు - వ్యాధులు : ఒకవేళ గ్రహాలలో ఎతు లేదా వంతగా ఉన్నచో లేదా ఎంతు మరియు వంతగా ఉన్నచో మాత్రమే  అంటే ఎగుడు దిగుడుగా మాత్రమే ఉంటే ఈ క్రింది వ్యాధులు వచ్చు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాని సమతలంగా ఉన్నచో ఆరోగ్య నియమాలు సరిగాపాటిస్తే ఆరోగ్యానికి ఎలాటి లోపం ఉండదు. ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటారు. దీనికి నిశిత పరిశీలన అవసరం.

గురువు : కాలేయం, మధుమేహం, రక్తనాళాలు, కుడిచెవి, తొడలు, నితంబములు, అతిమూత్రవ్యాధి, బి.పి. (రక్తవికారం) హృదయరోగం, నడుము, కాళ్ళనొప్పులు, పక్షవాతం, సన్నిపాతం, మాట పడిపోవడం, వంటి వ్యాధులు లేదా వాటికి సంబంధించిన వ్యాధులు రావచ్చు.

శని : కీళ్ళు, మోకాళ్ళు, దంతాలు, ఎముకలు, చర్మవ్యాధులుటాంయి. నరాల బలహీనత, బోన్స్‌ వీక్‌నెస్‌, వాత సంబంధ గ్యాస్‌ (వాయు) వికారాలు, దీర్ఘ వ్యాధులు, పక్షవాతం, అంగములు, కాళ్ళు, చేతులు పీలబడుట, కాళ్ళు ఉబ్బుట, మచ్చలు లేచుట వంటి వ్యాధులకు గురి కావచ్చు. వీరికి ప్రమాదాలు (యాక్సిడెంట్లు) ఎక్కువగా అవుతాయి. మానసిక పైత్య, ఉదర (అజీర్తి) వ్యాధులు కూడా ఉంటాయి.

రవి : ఎముకలు, తల, నేత్రములు, గుండె, రక్తప్రసరణ, ఊపిరితిత్తులు, చేతులు, దంత, కంఠ, ఎడమ కన్ను వ్యాధులుటాంయి. అర్షమొలలు, తలనొప్పులు, బోన్స్‌ వీక్‌నెస్‌, పిత్యాధిక్యత, పిరికితనం ఉంటాయి. అగ్ని, విద్యుత్తు, శస్త్ర చికిత్సలెక్కువ. చర్మ సంబంధ వ్యాధులుటాంయి.

బుధ : నరములు, ఊపిరితిత్తులు, చేతులు, దంత, నాలుక, కంఠం, దురద, నోటికి సంబంధించినవి. మూర్ఛ, ఫిట్స్ వంటి రుగ్మతలు, గాయాలు, చర్మవ్యాధులు, సన్నిపాతం, జ్వరం, దేనిక్రిందనైనా పడి నలగడం వంటివి ఉండవచ్చు. చేతులకు భుజాలకు ప్రమాదాలెక్కువ, అస్పష్టవాక్కు.

కుజ : నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, జననేంద్రియాలు, అర్శమొలలు, రక్తస్రారం, గాయాలు, వేడివల్ల వచ్చే అనారోగ్యాలు, అగ్ని, విద్యుత్తు ప్రమాదాలు, అస్త్ర, శస్త్ర భయం, చర్మవ్యాధులు, క్యాన్సర్‌ పుండు, యాక్సిడెంట్లు, కండరాల నొప్పులు, బి.పి. అతిదాహం, పిత్తాధిక్యం, అజీర్తి, నిద్రలేమి, రక్తహీనత ఉంటాయి.

శుక్ర : జననేంద్రియ వ్యాధులు, కఫం, వీర్యం, అతిమూత్రవ్యాధి, గుప్తరోగాలు, జలగండాలు, ముక్కు,  చెవులు, శిరస్సు సంబంధించిన వ్యాధులు, కంఠ సంబంధ వ్యాధి ఏదో ఒకి తప్పక ఉంటుంది. శరీర ఆయాసం, నీరసముంటుంది. స్త్రీలైన ప్రసవవేదన, ఋతుదోషం లేదా మరే ఇతర స్త్రీ సంబంధ వ్యాధులుండవచ్చు.

చంద్ర : దగ్గు, దమ్ము, ఆస్త్మా, పైత్యం, ఉదరవ్యాధులు, ద్రవసంబంధవ్యాధులు, ఇస్నోఫీలియా, కఫరోగం, నేత్రవ్యాధులు, మస్తిష్కవ్యాధులు, మూర్ఛలు, ఉన్మాదం, షుగరు, స్వప్నదోష వ్యాధులు, యక్ష్మ, వీర్యం, టాన్సిల్స్‌, గండమాల, ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాసరోగం, మర్మావయం, క్షయ, నీటిగండం, జలదరింపులు, భూత ప్రేత భయాలు, మూఢ విశ్వాసాలు, నస, గులుగుడు, ఏకాంతం, శాడిజం ఉంటాయి.

రాహు : నేత్రవ్యాధులు, మశూచి వంటి చర్మవ్యాధులు, అపస్మారకం వంటి మానసిక వ్యాధులు, హృదయరోగాలుటాంయి.

కేతువు : చర్మ, ఉదర, పైత్య, హృదయ సంబంధ వ్యాధులుంటాయి. వీరికి చెమట విపరీతంగా ఉంటుంది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios