స్టోర్ రూమ్ కి కూడా వాస్తు ముఖ్యమే..!
మనమంతా ఆ స్టోర్ రూమ్ లో మనకు అవసరం లేని వస్తువులు అన్నీ పెట్టేస్తూ ఉంటాం. కానీ, పొరపాటున కూడా కొన్ని వస్తువులను అందులో పెట్టకూడదట.
చాలా మంది ఇళ్లల్లో స్టోర్ రూమ్ ఉంటుంది. ఇంట్లో పనికి రాని వస్తువులు అన్నింటినీ తీసుకువెళ్లి ఆ స్టోర్ రూమ్ లో పడేస్తూ ఉంటారు. అయితే, వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉన్నవారు, ఆ స్టోర్ రూమ్ లో పెట్టే వస్తువుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిజానికి, చాలా మంది ఇంటి వాస్తు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, ఈ స్టోర్ రూమ్ విషయంలో మాత్రం పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ, వాస్తు ప్రకారం స్టోర్ రూమ్ లో కొన్ని వస్తువులు ఉంచకూడదట.అవేంటో ఓసారి చూద్దాం...
1.చిన్నదో, పెద్దదో దాదాపు అన్ని ఇళ్లకు స్టోర్ రూమ్ అవసరం అని చెప్పొచ్చు. మనమంతా ఆ స్టోర్ రూమ్ లో మనకు అవసరం లేని వస్తువులు అన్నీ పెట్టేస్తూ ఉంటాం. కానీ, పొరపాటున కూడా కొన్ని వస్తువులను అందులో పెట్టకూడదట.
2.స్టోర్ రూమ్ లో పనికిరానివి ఉంచొచ్చు. కానీ, ఖాళీవి మాత్రం ఉంచకూడదట. ఖాళీ డబ్బాలు, గిన్నెలు లాంటివి మాత్రం ఉంచకూడదట. వాటిలో మరేదైనా పెట్టి, ఒక దాంట్లో మరోటి పెట్టి అయినా ఉంచ్చొచ్చు. కానీ, ఖాళీగా మాత్రం ఉంచకూడదట.
3.ఇక, స్టోర్ రూమ్ లో ఉంచిన వస్తువులను సైతం పూర్తిగా కవర్ చేసి ఉంచాలి. అప్పుడు దుమ్ము, బూజు పడకుండా ఉంటాయి. అంతేకాకుండా, మనం రోజూ ఉపయోగించే వస్తువులను మాత్రం స్టోర్ రూమ్ లో ఉంచకూడదు.
4.ప్టోర్ రూమ్ లో అగ్నికి ఆజ్యం పోసే వస్తువులు ఏవీ ఉంచకూడదు. అంటే, నూనె, నెయ్యి లాంటివి ఏవీ ఉంచకపోవడమే ఉత్తమం. ఇలాంటివి ఉంచడం వల్ల, పొరపాటున ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
5.ఇక, ఇంటి స్టోర్ రూమ్ అన్ని గదుల కంటే, పైన ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా, గాలి కూడా బాగా తగిలేలా చూసుకోవాలి.
6.స్టోర్ రూమ్ గోడలకు ఉండే పెయింట్స్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. తెలుపు, పసుపు, నీలం రంగులను ఎంచుకోవడం ఉత్తమం.
7.స్టోర్ రూమ్ క్యాబినేట్ ఇంటికి ఆగ్నేయం మూలలో ఉండేలా చూసుకోవాలి.ఇక, ఈ శాన్యంలో బరువైన వస్తువులను ఉంచకూడదు.