Asianet News TeluguAsianet News Telugu

జాతకం.. సంతానం ఎప్పుడు కలుగుతుంది?

మాకు పంపిన కొందరి జాతకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి

few people astrology problems and answers are here
Author
Hyderabad, First Published Apr 3, 2019, 3:43 PM IST

1.శివనాగ ప్రదీప్‌

వివాహం ఎప్పుడు అవుతుంది?

మీ జాతకంలో ఆలస్య వివాహం సూచన ఉన్నది. మీకు ప్రస్తుతం ఉన్న సమయం వివాహానికటి అనుకూలమైనది కాదు. 2021 సెప్టెంబరు తరువాత వివాహ సమయం వస్తుంది. అప్పుడు ప్రయత్నం చేయగలరు. మీరు చేసే దానాలు మీరు చేసుకునే జపాలు అధికంగా ఉంటే మంచి సమయం వచ్చినప్పుడు తొందరగా వివాహం అవుతుంది.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : 1. పశుపక్షాదులకు ఆహారం / నీరు, 2. అన్నదానం/ పాలు / పెరుగు, 3. నూనె / పల్లీలు, 4. గోధుమ పిండి, గోధుమ రవ్వ; 5. ఇడ్లీ / వడ

పై అంశాలలో ఒక్కో దానిలోంచి ఒక్కొకటి తప్పనిసరిగా దానం చేయాలి.

2. ప్రవీణ్‌ కుమార్‌

వివాహం ఎప్పుడు అవుతుంది ?

మీకు ప్రస్తుతం సమయం బాగానే ఉన్నది. జనవరి 2020 వరకు. ఈ లోగా మీరు ప్రయత్నాలు చేసుకోగలరు. తరువాత మళ్ళీ ఒక సంవత్సరం పాటు వివాహానికటి అంత అనుకూలమైన సమయం కాదు. ప్రస్తుతం చెపుతున్న జపాలు, దానాలు అధిక సంఖ్యలో చేసుకోండి. వివాహం తొందరగా అవుతుంది.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : నిమ్మకాయ పులిహోర / అలంకరణ వస్తువులు, 2. కందిపప్పు / కర్జూరాలు / దానిమ్మపళ్ళు, 3. ఇడ్లీ / వడ/ మినప సున్ని ఉండలు ఇవి నిరంతరం దానం చేయాలి.

పై అంశాలలో ఒక్కో దానిలోంచి ఒక్కొకటి తప్పనిసరిగా దానం చేయాలి.

3. లావణ్య

సంతానం ఎప్పుడు ?

సంతానం విషయంలో ఇద్దరి జాతకాలు తప్పనిసరిగా కావాలి. మీరు పంపిన జాతక వివరాల ప్రకారం మీకు ప్రస్తుతం సమయం బాగాలేదు. సంతాన సమస్యలు ఉండే సూచనలు కనబడుతున్నాయి. దానం కొద్ది బిడ్డలు అనే సామెత ఇక్కడ వర్తిస్తుంది. మీరు ఎంత ఎక్కువ వీలైతే అంత అధికంగా దానం చేయాలి.

జపం : దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే, దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః

శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపాలు నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానం : ఇడ్లీ / వడ/ మినప సున్ని ఉండలు, 2. ఆకుకూరలు / కాయగూరలు/ పచ్చని వస్త్రాలు, 3. అన్నదానం /  పాలు / పెరుగు, 4. దేవాలయాల్లో హోమానికటి ఆవునెయ్యి / చెట్లు నాించడం / విద్యార్థులకు పుస్తకాలు.

పై అంశాలలో ఒక్కో దానిలోంచి ఒక్కొకటి తప్పనిసరిగా దానం చేయాలి.

4.ఫణి కుమార్‌

ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?

మీరు ప్రయత్నం చేయండి వస్తుంది. జపం దానం అధికంగా చేసుకోవాలి.

దానం : 1. గోధుమపిండి / చపాతీలు, 2. అన్నదానం/ పాలు/ పెరుగు, 3. నిమ్మకాయ పులిహోర

జపం: శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం నిరంతరం చేస్తూ ఉండండి.

5. పవన్‌ కిశోర్‌

మంచి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

ప్రస్తుతం ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చినా అందులో జాయిన్‌ కావాలి. 2022 చివరలో మంచి ఉద్యోగం వస్తుంది. మీకు ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది జాగ్రత్తగా చేసుకోవాలి. నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి.

జపం : శ్రీరాజమాతంగ్యై నమః, శ్రీరామ జయరామ జయజయ రామరామ

దానం : ఆకుకూరలు / కాయగూరలు, 2. గోధుమపిండి / గోధుమరవ్వ/ చపాతీలు, 3. నిమ్మకాయ పులిహోర / అలంకరణ వస్తువులు, 4. ఇడ్లీ / వడ తప్పనిసరిగా దానం చేస్తూ ఉండాలి.

6. దేదీప్య మన్నే

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

ప్రస్తుతం సమయం బావుంది. 2022 సెప్టెంబరు వరకు అనుకూల సమయం. అన్ని పనులకు బావుంటుంది. కొన్ని దానాలు నిరంతం చేసుకోవాలి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ

దానం : ఆకుకూరలు / కాయగూరలు, 2. గోధుమపిండి / గోధుమ రవ్వ / చపాతీలు.

7. సాయి చక్రవర్తి

వివాహ ప్రయత్నాలు ఎప్పుడు చేయాలి?

మీ జాతకంలో ఆలస్య వివాహం సూచన కనబడుతుంది. మీకు ప్రస్తుతం వివాహానికటి 2021 వరకు జనవరి వరకు సమయం అనుకూలంగా లేదు. 2021 తర్వాత వివాహ ప్రయత్నాలు మొదలు పెడితే అప్పుడు తొందరగా కుదురుతుంది. ఈ లోగా జపం దానాలు చేసుకోవాలి. మీకు అనుకోని సమస్యలు ఒత్తిడులు అధికంగా ఉంాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుివారిని గౌరవించడం నేర్చుకోండి.

మీ జాతకంలో ఏదో ఒకరమైన ఇబ్బంది కనబడుతుంది. మీరు దానాలు అధికంగా చేసుకోకపోతే ధనం, కాలం, శ్రమ అన్నీ వృథా అవుతాయి.

జపం : కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే, శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానం : 1. ఇడ్లీ / వడ/ మినప సున్ని ఉండలు, 2. కూరగాయలు/ ఆకుకూరలు, 3. కందిపప్పు / దానిమ్మ పళ్ళు / కర్జూరాలు, 4. పళ్ళు / విద్యార్థులకు పుస్తకాలు / దేవాలయాల్లో హోమాలకు ఆవునెయ్యి / చెట్లు నాించడం, 5. అన్నదానం / పాలు / పెరుగు

పై అంశాలలో ఒక్కో దానిలోంచి ఒక్కొకటి తప్పనిసరిగా దానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios