డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

కృత్తికాకార్తె ఫలములు :- కృత్తికాకార్తె వైశాఖమాసం, బహుళ పక్షమి తేది 11-5-2020 సోమవారం రోజున ఉదయం 9 : 42 నిమిషాలకు రవి నిరయన కృత్తికా కార్తె ప్రవేశం ప్రవేశ సమయమునకు పూర్వాషాడ నక్షత్రం, మిధున లగ్నం, వరుణమండలం, పాదజలరాశి,పుం-స్త్రీయోగం, గజవాహనం,రావ్వాది గ్రహములు మహావాయు, సౌమ్య, అమృత, మహావాయు,రస, దహ, జల నాడీచారము మొదలగు శుభాశుభయోగాములచే ఫలితముగా ఈ కార్తెలో ఎండ, వేడి అధికంగా ఉండి అచ్చటచ్చట వర్షము, వడగండ్ల వానలు పడే సూచనలు ఉన్నాయి. తీర ప్రాంతాలలో వాయుచలనము మేఘగర్జనలు జల్లులు, పగలు ఎండ వేడి, రాత్రులందు చల్లని వాతావరణం గోచరిస్తున్నది.       
    
శని, శుక్రుడు, గురు గ్రహాలు వ్యతిరేక సంచారం:- మే నెలలో శని, శుక్రుడు, గురు గ్రహాలు వ్యతిరేక దిశలో సంచారం చేస్తున్నాయి. ఈ సంచారం వలన ఊహించని పరిణామా ఫలితాలు సూచిస్తున్నాయి. ఖగోళంలో ఇదో ప్రత్యేకమైన ఘటన. ఈ వ్యతిరేక సంచారం వలన  కలిగే మార్పులు, వాటి ప్రభావం ఏలా ఉంటుందో పరిశీలిద్దాం.

జోతిషశాస్త్రంలో గ్రహాల స్థితిగతులు, వాటి గమనాలు ఎంతో ముఖ్యం. వీటి ఆధారంగానే కాలక్రమంలో జరిగే మార్పులు, పరిస్థితులను అంచనా వేస్తారు. అయితే ఈ నెలలో మూడు గ్రహాలు వ్యతిరేక దిశలో తిరుగనున్నాయి. శని, శుక్రుడు, గురువు వ్యతిరేక దిశలో సంచరించనున్నాయి. విశ్వమండలంలో ఈ మూడు గ్రహాల ప్రత్యేకమైన చర్య వలన దేశంలో, ప్రపంచంలో ఉహించని సంఘటనలకు కారనభుతులౌతున్నాయి. ఇవి వ్యతిరేక దిశలో సంచరిస్తూ వాటి స్థితిని మార్చుచెందటంలేదు. కావున గ్రహాలలో ఈ అనిష్టమైన భ్రమణం ఎప్పుడు జరుగుతుంది. ఈ సమయంలో వీటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది గమనిద్దాం. 

శనిగ్రహం మే 11 న రాత్రి 9 : 27 గంటలకు శని మకరరాశిలో ఉంటుంది. తిరిగి శని గ్రహం తిరోగమనం సెప్టెంబర్ 29 తేదీన జరుగుతుంది. శుక్రుడు ఈ నెలలో 

శుక్రుడు రెండో సారి సంచరిస్తాడు. మే 13 న మధ్యాహ్నం 12:12 గంటలకు వృషభరాశిలో ఉండి. ఈ గమనం జూన్ 25 తేదీ వరకు ఉంటుంది. 

గురుగ్రహం మే 14 తేదీ రాత్రి 7:58 నిమిషాలకు మకరరాశిలో ఉండి. ఈ గ్రహం గమనం జూన్ 30 వరకు ఉంటుంది.

ఈ మూడు గ్రహాల వ్యతిరేక సంచార ఫలితంగా మరియు కృత్తికా కార్తె ప్రవేశ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. 

మేషరాశి వారికి :- ఈ మూడు గ్రహాల వ్యతికేక గమనం వల్ల మేషరాశిపై ఎంతో ప్రభావం ఉంది. ఈ సమయంలో మీరు చేస్తున్న పనిలోనే ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఓర్పును కోల్పోకోకుండా అంటే సహనంగా ఉండాలి. మీరు అనుకున్న నిర్ణయంపై స్థిరంగా ఉండాలి. అంటే ఉద్యోగం మారే ఆలోచనలో ఉంటే ఆ ఆలోచన మార్చుకోవడం మంచిది. తమ ఆదాయాన్ని ఖర్చు పెట్టకుండా పొదుపు చేయడం అలవరచుకోవాలి. లేదంటే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

​వృషభరాశి వారికి :- గ్రహాల వ్యతిరేక గమనం వల్ల వృషభరాశి వారు మీలో కొత్త నైపుణ్యాలను పెంచుకోడానికి సరైన సమయం ఇది. భవిష్యత్తులో మంచి పునాది పడటానికి ఈ నైపుణ్యం ఉపయోగపడుతుంది. మీ కుటుంబ సభ్యులు, భాగస్వామి, మెంటర్లతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇదే సరైన సమయం. పని విషయంలో ఆత్మవిశ్వాసం లోపించే అవకాశముంది. దీని వల్ల సమస్యలు రావచ్చు. అంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కొన్ని ప్రాజెక్టులు అమలు పరిచే సమయంలో అవరోధాలు ఎదురువుతాయి. ఇలాంటి సమయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

​​మిథునరాశి వారికి :- ఈ సమయంలో మిథునంరాశివారు పెండింగ్ పనులను ప్రారంభించే సమయంలో ఏకాగ్రతతో ఉండాలి. దూర ప్రయాణాలు చేయాలనుకునేవాళ్లు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ దీనిపై దృష్టి సారించాలి. ఆందోళనకు గురవడం, అభద్రతా లోనుకావడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా పని ప్రదేశాల్లో పదే పదే సవాళ్లను, అవరోధాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై ప్రతి కూల ప్రభావం పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

​కర్కాటకరాశి వారికి :- ఈ రాశి వారికి ఆత్మపరిశీలన చేసుకుంటూ జీవితంపై ఆశాజనకంగా ఉండాలి. దీని వల్ల సంబంధాల్లో సామరస్యత వస్తుంది. ఒకానొక సమయంలో జీవితంలో కోల్పోయినవి ఇప్పుడు పొందే అవకాశముంది. వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారంలో భాగస్వాములతో పొసగక కొన్ని విభేదాలు రావచ్చు. కావున వీలైనంత వరకు ఓపికగా ఉండాల్సిన అవసరముంది. పాత స్నేహితుడి సహాయంతో కొత్త ఆదాయ వనరులు సృష్టించుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

​సింహరాశి వారికి :- గ్రహాల వ్యతిరేక భ్రమణం వల్ల పనిప్రదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వారు శత్రువులుగా మారే అవకాశముంది. దీని వల్ల వృత్తిలో వృద్ధి సాధించడంలో ఆటంకం ఏర్పడుతుంది. కావున ఈ సమయంలలో ఉద్యోగం పట్ల మీకున్న శ్రద్ధ, పట్టుదలను పరీక్షించుకోవాలి. ఈ సమయంలోనే పనిని అంకితాభావంతో చేయాలి. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా పొట్టకు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది. అంతేకాకుండా ఈ సమయంలో అప్పులు, రుణగ్రహీతలు పెరుగుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

​కన్యరాశి వారికి :-  కుటుంబ విషయాలపై తండ్రితో విభేదాలు కూడా తరిగిపోతాయి. మీరు వారితో మంచి సంబంధాన్ని పెంచుకుంటారు. ఈ సమయంలో సాధ్యమైనంతవరకు ప్రయాణించడం మానుకోండి. ఈ సమయంలో పురాణగాథాలను, రామయణ, మహాభారత గ్రంథాలను చదవడం అలవాటు చేసుకోవాలి. పని ప్రదేశాల్లో మీ ఆలోచనలను అమలు పరిచే సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీని వల్ల మీ ఉత్పాధకత, సమర్థత తగ్గుతాయి. మీ పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన మార్పులు అవర్చుకోవాలి. ఏదిఏమైనప్పటికీ గ్రహాల కదలిక సంబంధాలకు మంచిది. వ్యక్తిగత సమస్యలు మరియు ఆటంకాలను సరిచేయడానికి సహాయపడతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

​తులరాశి వారికి :- గ్రహాల వ్యతిరేక గమనాల వల్ల మీ సామర్థ్యం, నైపుణ్యంపై సందేహం కలక వచ్చు. ఈ అనుమానం ప్రతికూల ఆలోచనలకు దారి తీస్తుంది. కావున దీన్ని దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా ఆలోచించేందుకు ప్రయత్నించాలి. ఈ కాలంలో మీ ఇంటికి మరమ్మతులు చేయించాలని మీరు భావించవచ్చు. అయితే ఖర్చుపై నిఘా ఉంచండి. ఎందుకంటే మీరు అనుకున్న బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉండొచ్చు మించి ఉండవచ్చు. ఇదే సమయంలో తల్లి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. మీకిష్టమైన వ్యక్తికి మీ ప్రేమానురాగాలు పంచడానికి ఇదే సరైన సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

​వృశ్చికరాశి వారికి :- ఈ రాశి వారు మీ అభిప్రాయాన్ని వారితో స్పష్టంగా తెలియజేయకపోవచ్చు. దీని ప్రభావం మీ సమర్థతపైన పడే అవకాశముంది. కావున వీలైనంత వరకు మీ పని మీరు చేసుకుంటూ పోతూ మీరు అనుకున్న పని సరైన సమయానికి పూర్తి చేయండి.  వారు తమ అన్న దమ్ములు, తోబుట్టువులతో ఉన్న విభేదాలను సరిచేసుకోవడానికి ఇదే సరైన సమయం. పని ప్రదేశాల్లో మీ పై వారితో మాట్లాడేందుకు మీరు సంకొచించవచ్చు. కుటుంబ బాధ్యతలను మీ జీవిత భాగస్వామి కాకుండా మీరు తీసుకుంటే ఇంకా మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

​ధనస్సురాశి వారికి :- ధనుస్సు వారికి  మీ సీనియర్ అధికారులతో మీకున్న విభేదాలను తొలగించుకోడానికి ఇది మంచి సమయం. కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ జీవనశైలిని మార్చండి. యోగా మరియు ధ్యానంతో మీ దినచర్యను ప్రారంభించండి. ఆర్థిక స్థితిలో అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టాలి. పొదుపు కోసం కొత్త బ్యాంకు ఖాతా తెరవండి లేదా దీర్ఘకాలిక వెంచర్లలో పెట్టుబడి పెట్టండి. ఇది మీ కుటుంబ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

​మకరరాశి వారికి :- ఈ సమయంలో మకర రాశి వారు కుంగిపోయేందుకు ఆస్కారముంది. అంటే తాము చీకట్లో ఉన్నామని, నిరాశతో తమ సామర్థ్యంపై సందేహంతో ఉన్నట్లు అనిపించే అవకాశముంది. వీటి వల్ల జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా మీ బాధ్యతల పట్ల మీరు సిగ్గు పడొచ్చు. కావున ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం. పిల్లలు, కుటుంబంతో గడిపేందుకు ఇదే సరైన సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

​కుంభరాశి వారికి :- ఈ కాలంలో ఈ సమయంలో సాధ్యమైనంతవరకు ప్రయాణాలకు దూరంగా ఉండండి. అనివార్యమైతే తప్ప ప్రయాణాలు చేయండి. మీరు తగిన ఆరోగ్య సంరక్షణ తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి. ఆరోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరగడానికి దారితీస్తుంది. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఖర్చులను నియంత్రించుకోవచ్చు. రియల్ ఎస్టేటు వ్యాపారం చేయాలని అనుకుంటుంటే ఇదే తగిన సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

​మీనరాశి వారికి :- ఈ సమయంలో మీ పాత స్నేహితులు సన్నిహితులు, పరిచయస్తులతో తిరిగి కలిసే అవకాశముంటుంది. దీని వల్ల మరిన్ని అవకాశాలు దక్కేందుకు ఆస్కారముంటుంది. కవులకు, రచయితలు, ప్రచురణకర్తలకు ఇది మంచి సమయం. ఎందుకంటే రాసిన వాటిని సవరించడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొన్ని తప్పులను సరిదిద్దుకోవచ్చు. దీని వల్ల కొన్ని ప్రతిపాదనలు వచ్చే అవకాశముంది. అయితే ఈ కాలం కొంతమందికి సంతృప్తికరంగా ఉండకపోవచ్చును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను, దాన ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.