దీపావళి 2023: ఈ రోజు మీ రాశిచక్రం ప్రకారం.. ఈ వస్తువులను దానం చేస్తే సిరి సంపదలు పొందుతారు
Diwali 2023: ఈ రోజు దీపావళి కాబట్టి.. ఈ రోజున మీ రాశిచక్రం ప్రకారం కొన్ని వస్తువులను దానం చేస్తే మీ ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. ఇంతకీ ఎలాంటి వస్తువులను దానం చేయాలంటే?

Diwali 2023: ఐదు రోజుల దీపావళి పండుగ నవంబర్ 10 న అంటే ధనత్రయోదశి పండుగతో ప్రారంభమైంది. ఇది నవంబర్ 15 వరకు కొనసాగుతుంది. దీపావళి పండుగను దీపాల పండుగ అనికూడా అంటారు. ముఖ్యంగా కార్తీక మాసం దీపాలకు సంబంధించిన పండుగల నెల. దీపావళి రోజున సూర్య చంద్రుల శక్తి భూమిపై ఉండదు. అందుకే దీపాలను వెలిగిస్తాం. ఈ ఏడాది వివిధ రాశుల వారు దీపావళి రోజున వివిధ వస్తువులను దానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.
మేషరాశి: మేష రాశి వారు ఈ దీపావళి రోజున లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత పంచదార దానం చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ రాశి వారు ఈ రోజు ఎరుపు రంగు దుస్తులను ధరించాలి.
వృషభ రాశి: వృషభ రాశి జాతకులు లక్ష్మీదేవికి పూజ చేసిన తర్వాత పచ్చి పెసరపప్పు దానం చేయాలి. అలాగే వీరు ఈ రోజు తెలుపు రంగు దుస్తులు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మిథున రాశి: మిథున రాశి వారు దీపావళి నాడు బెల్లం దానం చేయడం శుభప్రదం. వీళ్లు ఈ రోజు క్రీమ్ కలర్ దుస్తులు వేసుకోవచ్చు.
కర్కాటకరాశి: కర్కాటక రాశి వారు దీపావళి పూజ తర్వాత బియ్యం దానం చేయాలి. వీరు ఈ రోజు టర్కోయిస్ కలర్ దుస్తులు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
సింహ రాశి: ఈ రాశివారు దీపావళి పర్వదినాన దుస్తులను దానం చేయడం మంచిది. ఈ రోజు వీళ్లు తెల్లని దుస్తులు ధరించొచ్చు.
కన్యా రాశి: దీపావళి రోజున లక్ష్మీపూజ తర్వాత కన్య రాశి వారు బ్రాహ్మణులకు మిఠాయిలు పంచి దక్షిణ ఇవ్వాలి. దీపావళి రోజున బూడిద రంగు దుస్తులు ధరించడం మంచిది.
తులా రాశి: తులా రాశి వారు దీపావళి నాడు ఒక పుస్తకాన్ని దానం చేయాలి. వీరు ఈ రోజు గులాబీ రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి.
వృశ్చిక రాశి: ఈ రాశివారు దీపావళి నాడు శనగపప్పు, బెల్లం దానం చేయడం శుభప్రదం. అలాగే వృశ్చిక రాశి వారు ఈ రోజు మెరూన్ రంగు దుస్తులు ధరించాలి.
ధనుస్సు రాశి: ధనుస్సు రాశి జాతకులు ఇనుముతో చేసిన వస్తువులను దానం చేయడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రోజు వీరు కాటన్ దుస్తులు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మకర రాశి: మకర రాశి వారు దీపావళి నాడు కొత్తిమీరను దానం చేయాలి.
కుంభ రాశి: కుంభ రాశి వారు ఈ రోజు దుర్గామాత ఆలయంలో ఎర్ర గులాబీలను సమర్పించాలి. అలాగే ఈ రాశి వారు దీపావళి నాడు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు.
మీన రాశి: మీన రాశి వారు పేదలకు దుప్పట్లు దానం చేయొచ్చు. ఈ రోజున మీరు వెండి రంగు దుస్తులు లేదా పట్టు వస్త్రాలను ధరించొచ్చు.