Asianet News Telugu

జాతకం..నాకు మంచి ఉద్యోగం దొరుకుతుందా?

మాకు పంపిన కొందరి జాతకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి

did i get good job as per my astrology
Author
Hyderabad, First Published Feb 27, 2019, 3:21 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

1. శ్రవన్‌కుమార్‌

మీరు పంపించిన తేదీకి మీరు చెప్పిన నక్షత్రానికి సరిపోవడం లేదు. దయచేసి మీ వివరాలు సరిచూసుకొని పంపగలరు.

2. అనీల్‌

మీరు పంపిన  వివరాలు సరిగా లేవు. మీరు పుట్టిన సమయం ఇవ్వనందున జాతకం చెప్పడానికి కుదరదు.

3.శ్రీకాంత్‌

భవిష్యత్తు ఎలా ఉంటుంది?

మార్‌ 7 2019 నుంచి మీకు మంచి రోజులు వస్తాయి. అనేక రకాల ఉద్యోగాలు జీవితంలో మార్పు చేసుకుంటూ ఉంారు. లేదా ఒకేసారి 2, 3 బాధ్యలు గాని నిర్వహించడం జరుగుతుంది. మీరు మంచి ఆలోచనా పరులు. కాని వైవాహిక జీవితంలో మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో మీకు ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా  ఉన్నది. కనుక మీరు అధికమొత్తంలో దానధర్మాలు తప్పనిసరిగా చేయాలి. సాధారణ జీవితానికి ఇబ్బంది లేకపోయినప్పికీ దానధర్మాలు అధికంగా చేసుకోకపోవడం, జపం చేసుకోకపోవడం వల్ల పొందవలసిన ప్రగతి జీవితంలో పొందలేరు. కావున ఈ పనులు ఖచ్చితంగా చేసుకుని తీరాలి.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీదత్త శ్శరణం మమ

దానం : కందిపప్పు/ దానిమ్మపళ్ళు/ ఎరుపు వస్త్రాలు, 2. నూనె / పల్లీలు , 3. గోధుమపిండి/ గోధుమరవ్వ/ చపాతీలు/ 4. కూరగాయలు/ ఆకుకూరలు మొదలైనవి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ దానం చేయాలి.

4. దువ్వూరి కిరణ్‌ రెడ్డి

భవిష్యత్తు ఎలా ఉంది?

మీకు జాతకం ప్రస్తుతం అనుకూలంగానే ఉన్నది. 2019 ఆగస్టు నుంచి 2020 డిసెంబర్‌ వరకు అంత అనుకూలమైన సమయం కాదు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. అన్ని పనుల్లో. ఈ సమయంలో ఏ ప్రత్యేకమైన ఎదుగుదలను కోరుకోవద్దు.  2021 నుంచి మంచి రోజులు వస్తాయి. మీరు ఆధ్యాత్మిక జీవితంపై దృష్టి పెడితే మీ జాతకరీత్యా బాగా ఉపకరిస్తుంది.  కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్న కారణాన దానధర్మాలు అధికంగా చేసుకోవడం వలన కావలసిన ప్రగతిని పొందుతారు.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీ రామ జయరామ జయజయ రామరామ

దానాలు : అన్నదానం /పాలు / పెరుగు 2. ఇడ్లీ / వడ/ మినప సున్ని ఉండలు, 3. పశుపక్షాదులకు ఆహారం పెట్టడం, నీరు పెట్టడం మొదలైనవి చేయాలి.

5.  సాయి ప్రభాకర్‌

నాకు మంచి ఉద్యోగం దొరకడం లేదు. సెలెక్ట్‌ అయిన కంపెనీ జాయినింగ్‌ ఇవ్వడంలేదు. ఏమీ అనుకున్న పనులు కావడం లేదు ?

ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. 2019 మే 9 తర్వాత కొంత మంచికి అవకాశం ఉన్నప్పికీ 2020 మార్చ్‌ తర్వాత పూర్తి స్థాయిలో అనుకూలత మొదలౌతుంది. ప్రస్తుతం ఒత్తిడిని తగ్గించుకోవడానికి దానధర్మాలు అధికంగా చేయాలి. మీకు జీవితంలో ఖర్చులు చాలా అధికం ఉంాయి. కావున మీ జీతంలోంచి 30 మీరు దాన ధర్మాలకు ఖర్చు చేయాలి. ప్రస్తుతం ఉద్యోగం లేకపోతే కొంత దానం చేస్తూ ఉద్యోగం వచ్చిన తర్వాత అధిక శాతం దానం చేయాలి.

దానం : 5కిలోల బియ్యం, 1 కందిపప్పు, 1 కిలో నూనె, 1 కిలో రవ్వ, 1 పంచదార, కనీసం నెలకు 20 మందికి తక్కువ కాకుండా దానం చేయాలి.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః. శ్రీరామ జయరామ జయజయ రామ రామ

6. యదునంద కుమార్‌

మా జాతకం చెప్పండి?

మీ నక్షత్రం మూల, మీ రాశి ధనుస్సు.

ప్రస్తుతం ఆగస్టు వరకు మంచి రోజులు ఉన్నాయి. మీ వైవాహిక జీవితంలో ఆనందం దొరకకపోవచ్చు. 2020 తర్వాత మంచి రోజులు వస్తాయి. ప్రతీ పనిలో ఏదో ఒక ఒత్తిడి తప్పనిసరిగా ఉంటుంది.

జపం : హరహర శంకర, జయజయశంకర; శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

దానం : నూనె / పల్లీలు దానం చేసుకోవడం మంచిది.

మీరు పంపిన జనన వివరాలు సరిగా ఉన్నవో లేవో సరిచూసుకోండి? పుట్టిన తేదీ, పుట్టిన సమయం ఉదయమా మధ్యాహ్నమా, రాత్రినా ? పుట్టిన స్థలం మొదలైనవి సరిగా పంపాలి.

అడిగే ప్రశ్న సూిగా ఉండాలి. జాతకం చెప్పండి. భవిష్యత్తు చెప్పండి అని కాదు. ప్రస్తుతం ఏ సమస్య ఉంది దానిని స్పష్టంగా అడగాలి. ఉద్యోగం అయితే చేస్తున్నారా లేదా ? వ్యాపారం చేస్తున్నారా? మొదలు పెట్టాలా?  వివాహం అయ్యిందా కాలేదా సంబంధాలు చూస్తున్నారా లాటి వివరాలు సరిగా పంపి ప్రశ్న అడిగాలి.

Follow Us:
Download App:
  • android
  • ios