డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిరాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

 

 ఆదాయం - 8,   వ్యయం - 11             రాజపూజ్యం - 6,    అవమానం - 3

• జన్మరాశిలో ఉన్న గురుకేతువులు, సప్తమంలో ఉన్న రాహువు, ద్వితీయస్థానంలో ఉన్న శని కారణ ఫలితంగా 

• గత ఐదు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు నిధానంగా తొలగిపోతాయి.
 
• ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికంగా ఎదుగుతారు.

• పేరుప్రతిష్టలు పెరుగుతాయి.
 
• గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. 

• ఆర్థిక పురోగతి బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధిచేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు.
 
• నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

• మీ ద్వారా సహాయసహాకారాలు పొంది ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల నుంచి లబ్ది పొందుతారు.
 
• చిన్నపిల్లలు, వృద్దులు, మహిళలు, అనాథలు వారికి సంబంధించిన సేవాసంస్థలకు చెప్పుకోదగిన సహాయం చేస్తారు. 

•  మహిళల వల్ల మేలు జరుగుతుంది. అధికార స్థానంలో ఉన్నవారి వల్ల మరింత మేలు జరుగుతుంది.
 
• ఉద్యోగంలో స్థానచలనం తప్పదనుకుంటారు. కానీ చివరి క్షణంలో ఆ స్థాన చలనం ఆగిపోతుంది. 

• ప్రతి విషయంలోను స్త్రీల సహాయసహకారాలు మీకు లభిస్తాయి.
 
•  వ్యాపారం నిమిత్తం స్థలం కొనుగోలు చేస్తారు. నూతన అవకాశాలను ఉపయోగించుకుంటారు.  

•  న్యాయబద్దమైన కోరికలను వారు ఆమోదిస్తారు. సమాజంలో మీరంటో నిరూపించుకుంటారు.
 
•  గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

• అర్థాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. 
 
•  బాల్యంలో సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞానం ఉపకరిస్తుంది.

• రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు.
 
• మీ ఆద్వర్యంలో నడిచే వ్యాపారాలు లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమే. 

• బయట ఆహారానికి దూరంగా ఉండాలి. యోగ మొదలకు ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు.
 
• చండీ హోమం చేయండి మరిన్ని శుభాఫలాలు లభిస్తాయి.

• పోటి పరీక్షలలో విజయం సాధిస్తారు.
 
• విదేశాలలో ఉద్యోగం చేసే వారికి అనుకూలం, గ్రీన్ కార్డ్ లభిస్తుంది.

• పెద్దల, గురువుల మాట వినడం సర్వదా మీకు శ్రేయష్కరం.
 
మీ పుట్టినతేదీ ఆధారంగా వ్యక్తిగత జాతక చక్రాన్ని వేయించుకుని పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారాలు పాటించండి తప్పక శుభాలు కలుగుతాయి.