Asianet News TeluguAsianet News Telugu

today astrology:02 జనవరి 2020 గురువారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పరామర్శలకు అవకాశం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టి పెడతారు. వ్యాపారస్తులకు గట్టి  పోటీ  ఎదురౌతుంది. విద్యార్థులకు కష్టకాలం. అనారోగ్య సూచనలు వస్తాయి. జాగ్రత్త అవసరం.

daily Rashi Phalalu 2nd january 2020
Author
Hyderabad, First Published Jan 2, 2020, 7:37 AM IST

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి కావడంలో ఆలస్యం అవుతుంది. తొందరపాటు పనికిరాదు. సామాజిక అనుబంధాలు అభివృద్ధి చెందే మార్గాలకై అన్వేషిస్తారు. వ్యాపారస్తులకు అప్రమత్తత అవసరం. అన్ని పనుల్లోనూ ఆచి, తూచి వ్యవహరించాలి. సంతృప్తి తక్కువగా ఉంటుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పరామర్శలకు అవకాశం. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. శ్రమలేని ఆదాయంపై దృష్టి పెడతారు. వ్యాపారస్తులకు గట్టి  పోటీ  ఎదురౌతుంది. విద్యార్థులకు కష్టకాలం. అనారోగ్య సూచనలు వస్తాయి. జాగ్రత్త అవసరం.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నూతన పరిచయస్తులతో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశం. సేవకులద్వారా అనుకూలత పెరుగుతుంది. సేవకజన సహకారం పెరుగుతుంది. సంతానంకోసం ఆలోచనలు పెరుగుతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎంత శ్రమ ఉన్నా పనులను లెక్కచేయరు. పోటీ లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. సౌకర్యాలపై దృష్టి పెరుగుతుంది. గృహ సంబంధ ఆలోచనలు పెరుగుతాయి.  ఆహారంలో సమయ పాలన పాిస్తారు. మాతృవర్గీయులతో అనుకూలతను పెరచుకుంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం. ప్రణాళికలను అనుకూలమైన సమయం లభించకపోవచ్చు. తాము ఆలోచించింది ఒకి జరిగేది ఒకి అవుతుంది. వ్యాపారస్తుల సహకారంకోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపార ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. ప్రచార, ప్రసార సాధనాలు లభించే అవకాశం.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : గృహ నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరుగవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరాదు. సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. మాతృవర్గీయులతో అనుబంధాల్లో జాగ్రత్త అవసరం.  వాక్‌చాతుర్యం పెరుగుతుంది. మధ్యవర్తిత్వాలు లాభిస్తాయి. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : మీడియా రంగం వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సేవకజన సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు చేస్తారు. పనుల్లో వేగం పెరుగుతుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : కుటుంబ సమస్యలు పెరుగుతాయి. మాటల వల్ల ఒత్తిడి పెరుగవచ్చు. మాట వల్ల అపార్థాలకు అవకాశం. మధ్యవర్తిత్వాల వల్ల ఇబ్బందులు వచ్చే సూచనలు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో సంతృప్తి లభిస్తుంది.విహార యాత్రలకై దృష్టి పెరుగుతుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ అధికం అవుతుంది. కొంత బద్ధకం ఎక్కువౌవుతుంది. ఆలోచనలకు అనుగుణంగా శరీరం కదల్చలేరు. తొందరపాటు పనికిరాదు. లాభాలు వచ్చినా సద్వినియోగం చేసుకోవడం కష్టం. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. వ్యాపార ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆధ్యాత్మిక యాత్రలకై పరితపిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు ఒత్తిడితో ఫలితాలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార అభివృద్ధి పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడంలో కొంత అసంతృప్తి ఏర్పడుతుంది. విజ్ఞాన, విహార యాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యవలన గౌరవం పెరుగుతుంది. చేసే అన్ని పనుల్లోనూ సంతృప్తి తక్కువగా ఉంటుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. చిత్త చాంచల్యం  పెరుగుతుంది. ఊహించని ఇబ్బందులు వస్తాయి. పరామర్శలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రమాదాలు జరిగే సూచనలు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెట్టకూడదు.

ఈరోజు అన్ని రాశుల వారికి కూడా ఏదో ఒకరమైన ఒత్తిడి పెరుగుతుంది. అవసరం లేదనుకుంటే ఈరోజు చేసే పనులు రేపటికి వాయిదా వేయటం మంచిది.

Follow Us:
Download App:
  • android
  • ios