ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 10.03.2025 సోమవారానికి సంబంధించినవి.
మేష రాశి ఫలాలు
పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములతో మనస్పర్థలు వస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగంలో ట్రాన్స్ ఫర్ అవకాశాలు ఉన్నాయి.
వృషభ రాశి ఫలాలు
వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి దక్కుతుంది. సన్నిహితులతో సఖ్యంగా ఉంటారు. విలువైన సమాచారం తెలుసుకుంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వస్తువులు కొంటారు.
మిధున రాశి ఫలాలు
ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విందువినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి ఫలాలు
బందువులతో గొడవలు తప్పవు. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో గంధరగోళ వాతావరణం ఉంటుంది.
సింహ రాశి ఫలాలు
ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటాబయట సమస్యలు వస్తాయి. వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణా సూచనలు ఉన్నాయి.
కన్య రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి.
తుల రాశి ఫలాలు
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో నిరాశ ఎదురవుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనపడదు. వ్యాపార, ఉద్యోగాల్లో చికాకు తప్పదు.
వృశ్చిక రాశి ఫలాలు
కొత్త పరిచయాలతో లాభం చేకూరుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనయోగం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. పిల్లల చదువు విషయాల్లో శుభవార్తలు వింటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
ధనస్సు రాశి ఫలాలు
వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ఆర్థిక ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్నిఉపయోగించుకోవడంలో విఫలం అవుతారు.
మకర రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి. రుణ ప్రయత్నాలు అనుకూలం. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన సమాచారం అందుకుంటారు.
కుంభ రాశి ఫలాలు
ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మీన రాశి ఫలాలు
ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశకు లోనుచేస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.