userpic
user icon
0 Min read

Today Rasi Phalalu: ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.. నిరుద్యోగులకు ఉద్యోగం..!

Daily horoscope for April 9, 2025 mesha vrishabha mithuna karka simha kanya tula vrischika dhanussu makara kumbha meena in telugu KVG
Daily horoscope for April 9, 2025 mesha vrishabha mithuna karka simha kanya tula vrischika dhanussu makara kumbha meena

Synopsis

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 09.04.2025 బుధవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వాహన వ్యాపారులకు అంతంతమాత్రమే.

వృషభ రాశి ఫలాలు

చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో వివాదాలు వస్తాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు ఊహించని విధంగా చికాకులు పెరుగుతాయి.

మిథున రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారపరంగా తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి.

కర్కాటక రాశి ఫలాలు

ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి.

సింహ రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. బంధు మిత్రులతో స్వల్ప విభేదాలు వస్తాయి. కొన్ని వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం దక్కదు. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది.

కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక  కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు.

తుల రాశి ఫలాలు

సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. వాహనయోగం ఉంది. భాగస్వామ్య వ్యాపార విస్తరణలో పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

వృశ్చిక రాశి ఫలాలు

బంధు మిత్రుల నుంచి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కొన్ని పనులు మధ్యలో నిలిచిపోతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు అధికారులతో  విభేదాలు వస్తాయి.

ధనస్సు రాశి ఫలాలు

దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లో సోదరుల పెళ్లి ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు లాభదాయకం. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు.

మకర రాశి ఫలాలు

బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పనులు శ్రమతో గానీ పూర్తికావు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు తప్పవు. ఉద్యోగులకు అధికారులతో చర్చలు విఫలం అవుతాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

కుంభ రాశి ఫలాలు

చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. విలువైన వస్తువులు కొంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం ఉంది. వ్యాపారంలో తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి.

మీన రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలగవచ్చు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి ఉంటుంది.

 

Download App

Latest Videos