మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక అనుబంధాలు చికాకు పెడతాయి. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పాదాల నొప్పులు ఉంటాయి. మాటల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. అపార్థం చేసుకునే అవకాశం ఉంది. బాహ్య మౌనం, అంతర మౌనాన్ని వీరు ప్రయత్నం చేయాలి. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సంబంధాలు విస్తరించే ప్రయత్నం చేసుకోవాలి.

లాభాలు రావాలంటే ఖర్చు పెట్టాలి. ఖర్చులు ఆధ్యాత్మికపరమైనవి అయి ఉండాలి. అప్పుడే వచ్చే లాభాలు సంతృప్తినిస్తాయి.  పెద్దల సహకారాలు లభిస్తాయి. పెద్దలతో కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు. ఎన్ని పనులు చేసినా లోపల ఏదో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది. జాగ్రత్త వహించాలి.

సామాజిక అనుబంధాల్లో ఒత్తిడి ఉంటుంది. నూతన పరిచయాలు అనుకూలించవు. కొత్తవారితో జాగ్రత్తగా ఉండాలి. అన్ని పనుల్లోకి వెళ్ళకూడదు. మార్చితర్వాత నుంచి అనారోగ్య సూచనలు ఉంటాయి. పోటీల్లో ఒత్తిడి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ప్రయత్నం చేస్తారు.
అనుకోని నిరాశ, నిస్పృహలు ఉంటాయి. చేసే పనుల్లో ఉత్సాహం తగ్గుతుంది. పనులు మొదలు పెట్టాలంటేనే ఆలోచన పెరుగుతుంది. అనవసర ఖర్చులు ఉంటాయి. శ్రమ, కాలం, ధనం వృథా అవుతాయి. వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. విశ్రాంతి కూడా లోపిస్తుంది.

వీరికి పోటీల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. శత్రువులు పెరిగే సూచనలు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. శారీరక బలం తగ్గేట్లు ఉంటుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. సెన్టెంబర్ తర్వాత నుంచి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సంతాన సమస్యలు పెరుగుతాయి. సృజనాత్మకతను పెంచుకునే ప్రయత్నం చేయాలి. చిత్త చాంచల్యం పెరుగుతుంది. జాగ్రత్త వహించాలి.

వీరు వాకింగ్‌ ప్రాణాయామాలు తప్పనిసరిగా చేయాలి. నిత్యవిధిగా అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని శ్రమ పెట్టవలసిందే.  15 రోజులకొకసారి ఒంటి కి నూనె పెట్టి మర్దన చేయాలి. శరీరాన్ని శ్రమపెట్టే విధంగా ప్రయత్నం చేయాలి. యోగాసనాలు వేయాలి. ధర్మ కార్యాలకు ప్రయత్నం చేయాలి. మినప సున్ని ఉండలు, ఇడ్లీ వడ దానం చేయాలి.