Asianet News TeluguAsianet News Telugu

Brahmamudi Serial Today: రాహుల్ బుట్టలో పడిపోయిన రాజ్, డీఎన్ఏ టెస్ట్ చేయించాల్సిందే..!

నువు చెప్పే డైలాగులు మీ అక్క తప్పును కవర్ చేయలేవని, స్వప్నకు శీలపరీక్ష జరగాల్సిందేనని, దానికి డీఎన్ఏ టెస్టు చేయాల్సిందేనని  అంటుంది. మీ అక్క తప్పు చేసిందని భయటపడుతుందని నువ్వు టెన్షన్ పడుతున్నావని, అందుకే ఈ ఉద్యమం చేపడుతున్నావ్ కావ్య అంటుంది రుద్రాణి.

Brahma Mudi Serial Today 1st December 2023 Swapna Confronts Rudrani ram
Author
First Published Dec 1, 2023, 11:08 AM IST

Brahmamudi Serial Today: స్వప్న తనకు లంచ్, డిన్నర్ లోకి స్పెషల్స్ కావాలని చెప్పడంతో నిన్నటి ఎపిసోడ్ లో రుద్రాణి రచ్చ చేసిన విషయం తెలిసిందే, ఆ రచ్చ డీఎన్ఏ టెస్టు దాకా వెళ్తుంది. ఎన్ని వారాలకు చేపించాలి ఏంటి అనే రచ్చ మొదలౌతుంది. అయితే, ఆ మాటలు విని కావ్య కి మండిపోతుంది. అసలు ఇది ఇల్లునే, ప్రతిసారీ వంశం అని చెప్పుకుంటూ ఉంటారు. మీది వంశమేనా అని చీల్చిచెండాడేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లోనూ ఇదే కంటిన్యూ అవుతుంది. భార్యను భర్త నమ్మడానికి సాక్ష్యం కావాలా అంటూ కుటుంబం మొత్తాన్ని ప్రశ్నిస్తుంది. కావ్య మాటలు అందరినీ ఆలోచించేలా మాట్లాడుతుంది. కావ్య చెప్పింది అక్షరాలా నిజం అని సీతారామయ్య అంటాడు.  కానీ, సాక్షాత్తు శ్రీరాముడే లోకం కోసం సీతమ్మను శీలపరీక్ష కోరాడు కదా అని రామాయణ కథను ఉదాహరణగా చెబుతాడు.

Brahma Mudi Serial Today 1st December 2023 Swapna Confronts Rudrani ram

అయితే, దానికి కావ్య, ‘లోకం ఎక్కడో లేదు తాతయ్య ఇక్కడే ఉందని, లోకమంతా ఈ తల్లీ కొడుకులోనే ఉందని,వీళ్లలోనే లోపం మొత్తం ఉందని, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ అగ్ని పరీక్షలు, ఇంకా ఎంత కాలం ఆడది అగ్నిపరీక్షలు ఎదుర్కోవాలి ఆడదానికి ఆత్మవిశ్వాసం ఉండదా? మా అక్క తప్పు చేయలేదని నిరూపించడానికి అగ్ని పరీక్ష  చేయించాలి అనుకోడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను’ అని కావ్య చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. కానీ మధ్యలో రుద్రాణి జోక్యం చేసుకుంటుంది. డీఎన్ఏ టెస్టుకు తాను ఒప్పుకుంటున్నానని రుద్రాణి అందరి ముందు చెబుతుంది. నువు చెప్పే డైలాగులు మీ అక్క తప్పును కవర్ చేయలేవని, స్వప్నకు శీలపరీక్ష జరగాల్సిందేనని, దానికి డీఎన్ఏ టెస్టు చేయాల్సిందేనని  అంటుంది. మీ అక్క తప్పు చేసిందని భయటపడుతుందని నువ్వు టెన్షన్ పడుతున్నావని, అందుకే ఈ ఉద్యమం చేపడుతున్నావ్ కావ్య అంటుంది రుద్రాణి.

దానికి స్వప్న కరెక్ట్ సమాధానం ఇస్తుంది.‘ఆ భయం తన చెల్లిలో  ఉందేమో కానీ, నాకు లేదు. మీరు తెలివిగానో, తెలివి తక్కువగానో నా దారికి వచ్చారు. డీఎన్ఏ పరీక్ష నేను మొదటి నుంచి సిద్ధంగానే ఉన్నాను. నా బిడ్డను మీ రక్తం అని తేలితే ఏం చేస్తారు?’ అని స్వప్న అడుగుతుంది. దానికి రుద్రాణి‘ ఆ బిడ్డ నా కొడుకు బిడ్డ కాద ని తేలితే నువ్వు ఏం చేస్తావ్’ అని అడుగుతుంది. దానికి స్వప్న, తనది తప్పు అని తేలితే విడాకులు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అని చెబుతుంది. మరి మీరేం చేస్తారని స్వప్న నిలదీస్తుంది. ‘ నిన్ను నెత్తిన పెట్టుకుంటాను, నువ్వు పతివ్రతవని ఒప్పుకుంటాను. నిన్ను గౌరవంగా చూసుకుంటాను. ఈ నింద వేసినందుకు నా కొడుక్కి శిక్ష వేస్తాను’ అంటుంది. అయితే, కావ్య ఈ ఒప్పందాలు ఆపండి అని అడుగుతుంది. ఈ షరతులను కామ్ గా వింటూ ఆగిపోతున్నారని ఇంట్లో పెద్దలను కావ్య నిలదీస్తుంది. అయితే, తప్పక నోరుమూసుకొని ఉండాల్సి వస్తుందని చిట్టి కూడా అంగీకరిస్తుంది.తాము కూడా ప్రేక్షకుల్లా మిగిలిపోయామని చెబుతారు. ఇది మోయలేని ఆరోపణేనని, కానీ స్వప్న మోస్తానంటుందని, తన పతివ్రతను నిరూపించుకుంటానని అంటోంది కాబట్టి, తాము ఏమీ మాట్లాడటం లేదని చెబుతుంది. స్వప్న అంగీకరిస్తుంది కాబట్టి.. మనం కూడా అంగీకరిద్దాం అని చెబుతుంది. వాళ్ల నాన్నమ్మ చెప్పింది కాబట్టి, ఈ విషయంలో ఇంకెవరూ మారు మాట్లాడటానికి వీలు లేదని రాజ్ తేల్చి చెబుతాడు. డీఎన్ఏ టెస్టుకి నెల రోజుల సమయం ఉంది కాబట్టి, అప్పటి వరకు ఎవరూ గొడవ పడకూడదు అని రాజ్  చెప్పేస్తాడు. ఆ డీల్ కి రుద్రాణి కూడా ఒకే చెబుతుంది.

Brahma Mudi Serial Today 1st December 2023 Swapna Confronts Rudrani ram

లోపలికి వెళ్లిన తర్వాత ఎందుకు అంగీకరించావ్ అని రాహుల్ అడుగుతాడు. మరో దారి లేదు అని రుద్రాణి అంటుంది. అయితే, ఈ మాత్రం గ్యాప్ ఇస్తే కావ్య  సమస్యను పరిష్కరించి, స్వప్న తప్పుచేయలేదని నిరూపిస్తుందని అప్పుడు స్వప్న తన నెత్తిన ఎక్కిన కూర్చుంటుంది అని రాహుల్ భయపడతాడు. అప్పుడు రుద్రాణి, తాను ఆ డీల్ కి అంగీకరించకపోతే, కావ్య మాటలకు అందరూ పడిపోయేవారని, అప్పుడు స్వప్నను బయటకు గెంటనివ్వకుండా అందరూ మనల్ని ఒప్పించేవారు అని, అందుకే తాను డీల్ కి ఒప్పుకున్నాను అని రుద్రాని బదులిస్తుంది.ఒక నెల తర్వాత స్వప్నని వెళ్లగొడదాం అని రుద్రాణి అంటే, డీఎన్ఏ టెస్టులో దొరికపోతాం అని రాహుల్ భయపడతాడు. దానిని మనం ఆపేద్దాం అని రుద్రాణి మరో ప్లాన్ వేస్తుంది. స్వప్నను నెల రోజుల్లో ఇంట్లో నుంచి తాను పంపించేస్తాను అని  రుద్రాణి కొడుక్కి ధైర్యం చెబుతుంది.

మరోవైపు కనకం ఇంట్లో కాలుకాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. స్వప్న కడుపు విషయం మూర్తికి చెప్పి, ఆ వంకతో దుగ్గిరాల ఇంటికి వెళ్లాలని ప్లాన్ వేస్తుంది. ఇంతలో ఇంటికి వచ్చిన మూర్తికి భోజనం వడ్డిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా స్వప్న కడుపు విషయం చెబుతుంది. మూర్తి కూడా ఈ విషయం నమ్మడు. కానీ, నిజంగానే కడుపు వచ్చిందని కనకం చెబుతుంది.  ఎంత చెప్పినా మూర్తి మాత్రం ఆ విషయం నమ్మడు.  అయితే, కావ్య చెప్పింది అనేసరికి నమ్ముతాడు.  తర్వాత స్వప్నకు తినాలని ఉండేవన్నీ చేసి తీసుకొని వెళదాం అని అడుగుతుంది. మూర్తి మాత్రం ఆ ఇంటికి వెళ్లడానికి వీళ్లేదు అని తేల్చి చెప్పేస్తాడు.

Brahma Mudi Serial Today 1st December 2023 Swapna Confronts Rudrani ram

మరోవైపు స్వప్న దగ్గరకు  కావ్య వస్తుంది.  తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు డీఎన్ఏ టెస్టుకు అంగీకరించావు అని సముదాయిస్తుంది. తప్పక ఇంకేం చేయాలి అని, ఆ పేద పుట్టింటికి వెళ్లి, అవస్థలు పడలేను అని చెబుతుంది. కానీ కావ్య మాత్రం స్వప్న తీసుకున్న నిర్ణయం తప్పు అని మళ్లీ భారీ డైలాగులు కొడుతుంది. స్వప్న మాత్రం అమాయకంగా, తాను తప్పుచేయలేదని తనకు తెలుసని, ప్రూవ్ చేసుకోక తప్పడం లేదని, రుజువు చేసి తీరతాను అని అంటుంది. తర్వాత అరుణ్ దొరికాడా అని అడుగుతుంది. అయితే, తప్పించుకు తిరుగుతున్నాడని, వాడి కోసమే ప్రయత్నిస్తున్నాను అని కావ్య చెబుతుంది.  కాస్త గట్టిగా వాడి కోసం ప్రయత్నించూ అని కావ్యకు ఆర్డర్స్ వేస్తూ ఉంటుంది. ఇక్కడ సీన్ చూస్తే, స్వప్న ఎంత అమాయకురాలో స్పష్టంగా అర్థమౌతుంది.

మరోవైపు రాజ్ ఇంట్లో ఆలోచిస్తూ ఉంటాడు. రాజ్ ని చూసి స్వప్నతో పాటు కావ్యను కూడా ఇంట్లో నుంచి గెంటేలా చేస్తాను అని మనసులో అనుంకుంటాడు. తర్వాత వెళ్లి రాజ్ పక్కన కూర్చుంటాడు. బాధగా కూర్చుంటాడు. ఏమైంది అని రాజ్ అడిగితే, నాటకం మొదలుపెడతాడు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని, తనకు వచ్చిందంటాడు. చచ్చిపోవాలని అనిపిస్తోందంటాడు. రాజ్ అలా అనుకోవద్దు అని  సర్దిచెప్పబోతాడు. అయితే, రాహుల్ తాను మాత్రం సాక్ష్యం లేకుండా స్వప్నపై నిందలు వేయడం లేదని అంటాడు. కానీ, రాహుల్ మాత్రం స్వప్న గురించి రాజ్ దగ్గర చాలా దారుణంగా మాట్లాడతాడు. రాజ్ తనకు పూర్తిగా సపోర్ట్ ఇచ్చేలా, తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసేలా రాహుల్ మాట్లాడతాడు. రాజ్ కూడా పూర్తిగా రాహుల్ కి సపోర్ట్ గా మారిపోతాడు. ఇంతా కావ్య  పై నుంచి వినేస్తుంది. తర్వాత మాస్టర్ ప్లాన్ వేస్తుంది.

బెడ్రూమ్ లోకి వస్తున్న రాజ్ ని చాలా సీరియస్ గా చూస్తుంది. ఎందుకలా చూస్తున్నావ్ అంటే.. మీ గురించి నాకు నిజం తెలిసిపోయింది అంటుంది.  నా కళ్లు గప్పి, మీరు తప్పుడు పని చేశారు అని కావ్య ఆరోపిస్తుంది. ఆఫీసులో పనిచేసే శ్రుతితో ఎఫైర్ పెట్టుకున్నారు అని ఆరోపిస్తుంది. కమింగప్ లో కావ్య ఇదే విషయంలో రాజ్ ని ఇరికించి, స్వప్న టాపిక్ తీసుకువస్తుంది. మరి రాజ్ ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకొని కావ్యకు సహాయం చేస్తాడో లేదో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios