Asianet News TeluguAsianet News Telugu

పాపపుణ్యాలు, సుఖదుఖాలు అంటే ఏమిటి..?

మనం ఆనందంగా ఉన్నా, దుఃఖంతో ఉన్నా ప్రస్తుత పరిస్థితికి మనం గతంలో చేసిన పనులే కారణం. అయితే ఆ కర్మలు ఈ జన్మలోవి కావచ్చు ! గత జన్మలోవి కావచ్చు !

astrology.. what is good-bad, happy-unhappy
Author
Hyderabad, First Published Oct 24, 2018, 2:33 PM IST

'తేజోవృద్ధి కలిగించే పనుల వల్ల పొందే ఫలమే' - పుణ్యం.

తేజోహీనత కలిగించే పనుల వల్ల పొందే ఫలమే - పాపం

అలాగే

ఇష్ట ఫలితాన్ని అనుభవించడమే - సుఖం

అనిష్ట ఫలితాన్ని అనుభవించడమే - దుఃఖం

ఈ సుఖదుఃఖాలు ఏర్పడడానికి కారణం ఏమి?

ఏ జీవుడు గతంలో ఏయే పనులను ఏ రకంగా చేసి ఉన్నాడో ఆ యా కర్మల ఫలితాన్ని అదే విధంగా అనుభవిస్తాడు అని శాస్త్రం. (యేన యేన యథా యద్యత్‌ పురా కర్మ సునిశ్చితమ్‌ | తత్తదేక తరో భుంక్తే నిత్యం విహిత మాత్మనామ్‌ |)

మనం ఆనందంగా ఉన్నా, దుఃఖంతో ఉన్నా ప్రస్తుత పరిస్థితికి మనం గతంలో చేసిన పనులే కారణం. అయితే ఆ కర్మలు ఈ జన్మలోవి కావచ్చు ! గత జన్మలోవి కావచ్చు !

ఇక ఆ యా కర్మల ఫలితం ఎలా ఉంటుంది?

శుభ కర్మలచే సుఖం, పాప కర్మలచే దుఃఖం కలుగుతుంది. చేయని దాన్ని ఎవరూ అనుభవించరు. అంతా చేసిన కర్మమే ఫలిస్తుంది అంటుంది శాస్త్రం. దుఃఖాన్ని తొలగించుకోవాలన్న ఆరాటం, సుఖాన్ని మరింత పెంచుకోవాలన్న ఆశ జీవులకు ఏర్పడుతూ ఉంటుంది.

(చివరకు ఈ సుఖదుఃఖాలు రెండూ సమాహిత మనస్సులో లీనమౌతాయి) అయితే ఈ రెండింలో మనిషికి సుఖం పోతుందేమోనన్న భయం లేకపోతే సుఖంవల్ల ఇబ్బంది లేదు. సుఖం ఎంత పెరిగినా చివరకు అది సమాహిత స్థితిని చేరుకుని శాంతిని పొందుతుంది.

ఉన్న సమస్యంతా దుఃఖంతోనే !

కాబట్టి దుఃఖాన్ని కొంతవరకు విశ్లేషణ చేద్దాం !

దుఖం మూడు రకాలుగా వస్తుంది. వీటినే తాపత్రయం అంటారు.

1. ఆథ్యాత్మికం : మన వల్ల మనకు కలిగే దుఃఖాలు ఎ.శారీరకం, బి. మానసికం.

2. అదిభౌతికం : ఇతర ప్రాణులవల్ల మనకు కలిగే దుఃఖాలు.

3. అది దైవిక దుఃఖం : ప్రకృతి శక్తుల వల్ల మనకు కలిగే దుఃఖాలు.

ప్రపంచంలోని అన్ని దుఃఖాలు ఈ మూడింలోకే వస్తాయి.

''అశుభాగతయః ప్రాప్తాః కష్టామే పాపసేవనాత్‌'' అంటే పాప కార్యాలను చేయడం వల్ల అవి ఫలించే సమయం రాగానే అశుభాల రూపంలో కష్టాల రూపంలో దుఃఖం సంప్రాప్తమౌతుంది.

ఈ దుఃఖానికి కారణాలు గతంలో ఉంటాయి. ఆ కారణాలను బట్టి దుఃఖం ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయించబడుతుంది. ఇక్కడ మనం దుఃఖం అనుభవిస్తున్నాము అంటే పాప ఫలం తొలగి పవిత్రమౌతున్నామని అర్థం.

ఇలా కాకుండా కొన్ని శాంతిప్రక్రియల వల్ల కూడా ఆ దుఃఖానికి కారణమైన పాపాన్ని శమించునట్లు చేయవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఒక వేళ మనం ఎన్ని శాంతి ప్రక్రియలు చేసినా ఆ దుఃఖాన్ని అనుభవించామంటే మనను భవిష్యత్తులో మలుపు త్రిప్పే అతి పెద్ద శుభం కూడా ఆ దుఃఖ మార్గంలోనే ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

ఆ దుఃఖ సమయంలో సహనంతో వ్యవహరించి ఆ శుభాన్ని అంది పుచ్చుకోవాలి. ఒక్కొక్కసారి మనం కొన్ని శుభాలు పొందాలనుకుటాంము. అవి దగ్గరి దాకా వచ్చి తప్పిపోతుటాంయి. ఇలాటిం సందర్భాలలో ఆ శుభాలు జరగడానికి కావలసిన పుణ్యఫలం సరిపోవడం లేదన్నమాట ! ఈ సందర్భంలో ఆ పుణ్యం యొక్క బలాన్ని పెంచుకోవడానికి పౌష్టిక కర్మలను' చేయవలసి ఉంటుంది.

ఇక ఈపాపం ఎక్కడ నిలువ ఉంటుంది? అన్న విషయాన్ని కూడా శాస్త్రాలు వివరించాయి.

యత్వగస్థి కృతంపాపం దేహే తిష్ఠతి అంటే మనం చేసిన పాపాలు శరీరంలో నిలువ ఉంటాయి అని. ఎందుకంటే శరీరాలను ఉపాధిగా చేసుకున్న ఆత్మ నిత్య శుద్ధమైంది. ఆత్మకు ఎలాటిం పాప పుణ్యాలు అంటవు. ఆ యా పాప పుణ్య ఫలితాలు శరీరాలను మాత్రమే ఆశ్రయించి సమయం రాగానే ఫలిస్తూ ఉంటాయి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios