ఈ వారం( సెప్టెంబర్28 నుంచి అక్టోబర్ 1 వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
కన్య, తుల, వృశ్చిక రాశుల వారు తప్పనిసరిగా అన్నదానం, తెలుపు వస్త్ర దానం, ముత్యాలు దానం చేయడం తప్పనిసరి. అన్ని రాశులవారు నిరంతరం శ్రీరామజయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శారీరక శ్రమ అధికం. కార్యసాధనలో పట్టుదల అవసరం. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకుంటారు. చిత్త చాంచల్యం అధికం. శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన ఉంటుంది. మృష్టాన్న భోజనం గురించి ఆలోచిస్తారు. నిల్వధనాన్ని కోల్పోతారు. వాగ్దానాల వల్ల ఇబ్బందులు. మాట విలువ తగ్గుతుంది. కుంటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సౌకర్యాలకోసం దృష్టి పెడతారు. సౌకర్యాలు ఒత్తిడినిస్తాయి. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. మృష్టాన్న భోజనం లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. నిత్యావసర ఖర్చులకై ఆలోచన పెరుగుతుంది. సహాయ సహకారాలు పెరుగుతాయి. శారీరక శ్రమ అధికం. ఆలోచనల్లో ఆరాటం పెరుగుతుంది. ప్రణాళికా బద్ధతత ఏర్పరచుకోవాలి. పట్టుదలతో కార్యసాధన అవసరం. పనులకు అనుగుణంగా ఆలోచనల మార్పు అవసరం. వాగ్దానాల వల్ల ఇబ్బందులు వస్తాయి. మాట విలువ తగ్గుతుంది. కుంటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. నిల్వధనాన్ని కాపాడుకోవాలి. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : నిత్యావసర ఖర్చులకై ప్రయత్నిస్తారు. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. సుఖంకోసం ఆలోచిస్తారు. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. ఊహలలో విహరిస్తారు. కళాకారులకు అనుకూల సమయం. శ్రమలేని ఆదాయం పై దృష్టి ఉంటుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. శారీరక శ్రమ ఉంటుంది. కార్యసాధనలో పట్టుదల అవసరం. పనులలో ప్రణాళిక ఉంటుంది. నిత్య కృషి శీలన ఉంటుంది. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : కీర్తిప్రతిష్టలకై ఆలోచన పెరుగుతుంది. ఋణ సంబంధ ఆలోచనలు వృద్ధి చెందుతాయి. రాజకార్యాలపై దృష్టి. అధికారిక గృహాల్లో సౌకర్యాలు ఉంటాయి. అధికారిక ప్రయాణాలు చేస్తారు. విహార యాత్రలపై దృష్టి. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సృజనాత్మకత ఉంటుంది. సమిష్టి ఆదాయాలపై దృష్టి పెరుగుతుంది. నిత్యావసర ఖర్చులకై ప్రయత్నిస్తారు. విశ్రాంతిలోపం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు. నిద్రాభంగం ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. దేహసౌఖ్యం లోపిస్తుంది. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విద్యార్థులకు ఒత్తిడితో పైకి వస్తారు. దూరదృష్టి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అధికారులతో అనుకూల ఉంటుంది. రాజకార్య నిర్వహణ ఉంటుంది. అధికార గృహ సౌకర్యం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంనే ఆలోచనలు. గుర్తింపు లభిస్తుంది. సమిష్టి ఆదాయాలకై ప్రయత్నిస్తారు. కళాకారులకుం అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. క్రయ విక్రయాల్లో లోపాలు ఉంటాయి. ప్రయాణాల్లోజాగ్రత్తలు అవసరం. అధికారులతో అసౌకర్యం ఏర్పడుతుంది. వృత్తిఉద్యోగాదుల్లో అభివృద్ధి ఉంటుంది. అధికారిక ప్రయాణాలు ఉంటా యి. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దలంటే గౌరవం పెరుగుతుంది. రాజకీయ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం. దానాలు చేయడం తప్పనిసరి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. ఒత్తిడితో కార్యసాధన ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. క్రయ విక్రయాలపై దృష్టి ఉంటుంది. వైద్యశాలల సందర్శనం. అనారోగ్య భావన ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అనవసర ఆదాయాలు వచ్చే సూచనలు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల ద్వారా ఒత్తిడి ఉంటుంది. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం. అన్నదానం, వస్త్రదానం చేయడం తప్పనిసరి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : పట్టుదలతో కార్యసాధన చేస్తారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. ఒత్తిడితో కార్యసాధన ఉంటుంది. సామాజిక అనుబంధాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఊహించని ఇబ్బందులు ఉంటా యి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. ఊహించని ఇబ్బందులు వస్తాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. ప్రణాళికలు మార్పు చెందుతూ ఉంటా యి. చేసే అన్ని పనులలో జాగ్రత్త అవసరం. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. సంతాన సమస్యలు పెరుగుతాయి. పోటీల్లో గెలుపుకై ఆరాట పడతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనలు తగ్గుతాయి. సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పరిచయాలు సంతోషిస్తాయి. పదిమందిలో గౌరవం పెరుగుతుంది. భాగస్వామ్య అనుబంధాలు అనుకూలిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆహారంలో సమయ పాలన అవసరం. సౌకర్యాల వల్ల ఒత్తిడి అధికం అవుతుంది. విద్యార్థులు శ్రమతో పైకి వస్తారు. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం అధికం. గుర్తింపుకోసం ప్రయత్నిస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. పరువుకోసం ఆరాట పడతారు. అనారోగ్య భావన పెరుగుతుంది. పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఊహించని ఇబ్బందులు ఏర్పడతాయి. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటం పెరుగుతుంది. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సహకారాల వల్ల సంతృప్తి లభిస్తుంది. విద్యార్థులు శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి. గృహ సౌకర్యాల వల్ల కష్టం అధికం. ఆహారంలో సమయ పాలన ఉండాలి. మానసిక ఒత్తిడి ఉంటుంది. సృజనాత్మకతను కోల్పోతారు. పోటీ ల్లో గెలుపుకై ఆరాట పడతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనల్లో ప్రశాంతత లభిస్తుంది. గుర్తింపు ఉంటుంది. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. మాట విలువ తగ్గుతుంది. కుంటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. నిల్వ ధనం తగ్గే సూచనలు ఉంటాయి. సహాకారాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. విహార యాత్రలకై ప్రయత్నిస్తారు. ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. చిత్త చాంచల్యం ఉంటుంది. సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఆహారంలో సమయ పాలన అవసరం. మానసిక ఒత్తిడిఅధికం. సంతాన సమస్యలు వచ్చే సూచనలు. సృజనాత్మకత తగ్గుతుంది. లక్ష్మీపూజ, శివార్చన, నిరంతర జపం అవసరం.
డా.ఎస్. ప్రతిభ