ఈ వారం( అక్టోబర్5 నుంచి అక్టోబర్ 11 వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి
ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆరోగ్య లోపాలు ఉంటాయి. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సృజనాత్మకతను కోల్పోతారు. కళలపై ఆసక్తి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సామాజిక అనుకూలత ఏర్పడుతుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. పనుల్లో ప్రణాళికలు పెరుగుతాయి. సంతృప్తి లభిస్తుంది. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సహకారం వల్ల సంతోషం ఉంటుంది. సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయ పాలన మంచిది. సృజనాత్మకతను కోల్పోతారు. సంతాన ఆలోచనల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత పోతుంది. సృజనాత్మకత వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. పోటీల్లో గెలుపుకై ప్రయత్నిస్తారు. శత్రువులపై విజయం ఉంటుంది. ఋణ సంబంధ ఆలోచనల్లో సంతృప్తి లభిస్తుంది. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాతృవర్గీయుల సహకారం లభిస్తుంది. సహకారం వల్ల అనుకూలత పెంచుకుటాంరు. విద్యార్థులకు అనుకూల సమయం. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. ప్రచార ప్రసార సాధనాల్లో తృప్తి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారంలో సమయ పాలన అవసరం. సృజనాత్మకత లోపం ఉంటుంది. కళాకారులకు ఒత్తిడి సమయం. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీరక శ్రమ ఉంటుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాట విలువ తగ్గుతుంది. కుటంబంలో జాగ్రత్త అవసరం. నిల్వ ధనాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వాగ్దానాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. సహకారాలు అనుకూలిస్తాయి.మాతృవర్గీయులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రచార ప్రసార సాధనాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల్లో సంతృప్తి లభిస్తుంది. ఆహారంలో సమయపాలన అవసరం. గృహ సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శారీరక శ్రమ అధికం. అభిరుచులకు అనుగుణంగా ఆలోచనల్లో మార్పులు అవసరం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పట్టుదలతో కార్యసాధన అవసరం. మాట విలువ పెరుగుతుది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. మధ్యవర్తిత్వాలు ఉపయోగపడతాయి. సహకారం అనుకూలిస్తుంది. రచనలపై దృష్టి పెడతారు. విద్యార్థులకు అనుకూల సమయం. దగ్గరి ప్రయాణాలు చేస్తారు. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. చిత్త చాంచల్యం తగ్గుతుంది. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : రహస్య స్థావరాలపై దృష్టి పెడతారు. చిత్త చాంచల్యం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. అన్నిరకాల ఖర్చులు అధికం. సుఖంకోసం ఆలోచన పెరుగుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆలోచనలకు అనుగుణంగా పనుల్లో మార్పులు అవసరం. కార్యసాధనలో పట్టుదల ఉండాలి. సుఖ దుఃఖాలు సమానంగా ఉంటాయి. వాగ్దానాలు అనుకూలిస్తాయి. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఉంటుంది. అధికారులతో జాగ్రత్త. పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం చేస్తారు. లభిస్తాయి. కళాకారులకు అనుకూల సమయం. ఇతరులపై ఆధారపడతారు. రాజకీయ పార్టీలపై దృష్టి పెరుగుతుంది. విశ్రాంతి లోపం ఏర్పడుతంది. అన్నిరకాల ఖర్చులు చేస్తారు. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది. నిద్రాభంగం ఉంటుంది. పరాధీన ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఆలోచనల్లో మార్పులు అవసరం. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : నిత్యావసర ఖర్చులకై ప్రయత్నిస్తారు. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు ఉంటాయి. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. పెద్దల ఆశీస్సుల వల్ల అనుకూలత ఏర్పడుతుంది. సమిష్టి ఆశయాలపై దృష్టి పెడతారు. కళాకారులకు అనుకూల సమయం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. అధికారులతో అనుకూలత ఉంటుంది. అధికారిక ప్రయాణాలపై దృష్టి పెడతారు. సంఘంలో గౌరవం పేరుప్రతిష్టలు పెరచుకునే ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల సౌఖ్యాలు లభిస్తాయి. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన పెరుగుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. దూరదృష్టి ఉంటుంది. అనవసర ఇబ్బందులు పడతారు. వృత్తి ఉద్యోగాదుల్లో జాగ్రత్త అవసరం. తోటి అధికారులతో అనుకూలత. సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆదాయాలపై దృష్టి ఉంటుంది. కళాకారులకు అనుకూల సమయం ఉంటుంది. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య సూచనలు ఉంటాయి. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. పనుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో సమయపాలన అవసరం. ప్రయాణాలకు అవకాశం ఉంది. అధికారిక ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత. సంఘంలో గౌరవంకోసం ఆరాటం పెరుగుతుంది. నూతన పరిచయాలు అనుకూలిస్తాయి. ఊహించని ఇబ్బందులు వస్తాయి. అనుకోని ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. దూర దృష్టిపై ఆలోచన పెరుగుతుంది. సంతృప్తి లోపం ఏర్పడుతుంది. పరిశోధనల్లో ఒత్తిడి ఉంటుంది. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ ల్లో గెలుపు ఉంటుంది. ఋణ సంబంధ ఆలోచనల్లో అనుకూలత ఏర్పడుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. నూతన పరిచయస్తులో అనుకూలత ఉంటుంది. భాగస్వామ్య అనుబంధాల్లో సంతృప్తి లభిస్తుంది. అనుకోని ఇబ్బందులు వస్తాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. దుర్గా ఆరాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్సును కలిగిస్తాయి.
డా.ఎస్.ప్రతిభ
మరిన్ని వార్తలు..
ఏ రాశివారి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఏ మాసంలో పుట్టినవారు ఎలాంటి స్వభావం కలవారు
అక్టోబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి