Asianet News TeluguAsianet News Telugu

ఏ రాశివారి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఆయా జీవుల తత్త్వాలు ఆ సమయంలో పుట్టిన వారిలో కనిపించడం వల్ల ఆ పేర్లు స్థిరం చేసుకున్నారు.

astrology..qualities of persons horoscope
Author
Hyderabad, First Published Sep 29, 2018, 3:40 PM IST

మేషం అంటే గొర్రె అనీ, వృషభమంటే ఎద్దు అనీ మనం చదువుకుటాం. ఈ ఆకృతులుం ఆకాశంలో ఉన్న నక్షత్ర సమూహాలకు ఎందుకు పెట్టి ఉంటారో ఊహించడం కష్టం. అంతేకాకుండా మేషం అన్నప్పుడు మనం ఆకృతిని కొంతవరకు ఊహించాల్సిందే తప్ప అది గొర్రెలాగే ఉండే అవకాశమే లేదు. మనిషి తన చుట్టూ సంచరించే జీవజాతులను, వాటి తత్త్వాలను ఆధారం చేసుకొని రాశులపేర్లు పెట్టుకున్నాడు. ఆయా జీవుల తత్త్వాలు ఆ సమయంలో పుట్టిన వారిలో కనిపించడం వల్ల ఆ పేర్లు స్థిరం చేసుకున్నారు. ఆయా లక్షణాలను రాశి నామాలను బట్టి విశ్లేషించుకుంటే ఆ రాశిలో పుట్టి న వ్యక్తుల స్వభావాలను గమనించే అవకాశం ఉంది.

మేషం : మేషమంటే గొర్రె అని అర్థం. గొర్రె తాను వెళ్లే మార్గంలో తనకు పని చెప్పిన మార్గంలో ఆగకుండా ముందుకు వెళ్తుంది. అనుసరణ అనేది గొర్రెకున్న మరో తత్త్వం. కొండనైనా ఢీకొనే గాంభీర్యం గొర్రెకు సహజం. అందువల్ల ధైర్యానికి, ముందుకు అడుగు వేయడానికి, అనుసరించి నడవడానికి, వ్యవహార నిర్వహణకు ప్రతీకగా మేషాన్ని పోల్చడం సంప్రదాయం. ఈ రాశివారిలో ఈ తత్త్వమే మనకు కనిపిస్తుంది.

వృషభం : వృషభమంటే ఎద్దు. ఒంటెద్దు పోకడ అని ఒక సామెత ఉంది. ఎద్దులు రెండు ఉంటే అవి ఒక క్రమపద్ధతిలో వెళ్ళడం మనం గ్రహించవచ్చు. బండికి కట్టినా, నాగలికి కట్టినా రెండెద్దులుం ఉంటే సమమైన పోకడ ఉంటుంది. ఒంటెద్దు అయితే అసమత్వం, ఇష్టమొచ్చిన రీతిలో గమనం ఉంటాయి. ఈ రాశివారి ప్రవర్తనాదుల్లో ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు సూచించవలసి ఉంటుంది.

మిథునం : మిథునమంటే జంట అని అర్థం. ఏ అంశాన్నైనా రెండు విధాలుగా చర్చించుకోవడం, రెండు విధాలైన భావాలకు స్థానమివ్వడం, నిర్ణయశక్తి లోపిస్తూ అన్నింటిలోనూ ఊగిసలాడడం అనేవి ఈ రాశి నామానికున్న ప్రత్యేక లక్షణాలు.

కర్కాటకం : కర్కాటకమంటే ఎండ్రికాయ. నీళ్ళలో సంచరిస్తుంటుంది. అట్టడుగున ఉండే ఈ ఎండ్రికాయ నీళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి కనపడుతుంది. ఏ మాత్రం అలజడి అయినా అడుగుకు వెళ్ళిపోతుంది. చూడడానికి ఆకృతి భయంకరంగా ఉన్నప్పికీ ధైర్యం లేని తత్త్వం కర్కాటకానికి ప్రత్యేకం. గొడవలంటే ఇష్టపడకపోవడం, ఇంటి వ్యవహారాలలో ఎక్కువ శ్రద్ధ వహించడం ఈ రాశివారికి ప్రత్యేకం.

సింహం : గుహలలో సంచరించడం, అవసరానికి తగిన విధంగా ప్రవర్తించడం, శత్రువును సూటిగా దెబ్బతీయడం, ధైర్యంగా ముందుకు అడుగువేయడం, నిర్ణయాత్మకంగా వ్యవహరించడం మొదలైన అంశాలన్నీ సింహరాశికి వర్తిస్తాయి. ఈ అంశాలన్నిం అనువర్తిత రూపాలలో ఈ రాశివారు కనిపిస్తుంటా ంరు. హుందాగా ప్రవర్తించడం, న్యాయబద్ధమైన జీవనం, దోషాన్ని సహించకపోవడం, శత్రువును దెబ్బతీసే వ్యవహారం మొదలైనవి ఈ రాశివారిలో కనిపించే గుణాలుం.

కన్య : ఒంటరిగా ఉండే కన్య యొక్క మనసులో కలిగే హావభావాలకు ఈ రాశి ప్రతీక. అందరూ తనను గమనించేట్లుగా విద్యాత్మకంగానో, ప్రవర్తనాత్మకంగానో, వాచికంగానో, ఏదో రూపంలో కనిపిస్తుంటుంది. ప్రతిభా పాండిత్యాలుం అధికంగా ఉన్నప్పికీ వాటిని సద్వినియోగపరచడానికి అవసరమైన మార్కిటింగ్  టెక్నిక్స్‌ బాగా తెలిసిన వారు కన్యారాశికి చెందినవారౌతారు.

తుల : సమత్వానికి ప్రతీక ఈ తులారాశి. త్రాసులోని రెండు పళ్ళేలలాగా మంచి చెడులకు సంబంధించిన నిర్ణయాత్మక శక్తిని నిర్ణయించేటప్పుడు తులారాశి చక్కని నిర్ణేత అవుతుంది. వేరువేరు అంశాల మధ్యలో సామరస్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగే దిశలో తులారాశి అత్యున్నతమైన ప్రతిభను చూపిస్తుంది. తులారాశి జనితులలో కూడా ఈ సమత్వభావన అత్యధికంగా మనకు కనిపిస్తుంటుంది.

వృశ్చికం : శబ్దార్థం తేలు. తేలు స్వయంగా కావాలని మరొకరిని ఇబ్బంది పెట్టదు. తనను ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చాటుమాటున్నే తిరుగుతుంటుంది. తన తోకలో ఎప్పికీ విషం పెట్టుకుని తిరుగుతుంది. తనకు ఇబ్బంది ఎదురైతే మాత్రం తన ఆయుధాన్ని  వినియోగించి ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా తరువాతి తరానికి జన్మనిచ్చేటప్పుడు తన జీవితాన్ని చాలించుకునే ఉదాత్తత ఈ తేలుంలో ఉంది. ఈ రాశి జనితులలో కూడా ఈ భావనలుం మనకు కనిపిస్తుంటాయి. వీరు భావాన్ని వ్యక్తీకరించడం కన్నా పనిచేసి చూపించడంలో నైపుణ్యాన్ని చూపిస్తుంటారు.

ధనుస్సు : ఎక్కుపెట్టబడిన ధనుస్సు, లక్ష్యసాధనకు ప్రతీక. నిర్ణయించుకున్న లక్ష్యాలను అధిగమించడానికి తన శక్తిని, యుక్తిని ధారపోసి అనుకున్నది సాధించేంతవరకు కార్యసాధనే ధ్యేయంగా నిలవాలని ఉపదేశించేది ఆ ధనుస్సు. ఈ ధనుస్సు రాశివారిలో ఈ తత్త్వం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లక్ష్యాలను పెట్టుకొని వాటి సాధనా మార్గంలో జీవితాన్ని గడిపి పరిణతులుగా కనిపించడం ఈ రాశివారికే ప్రత్యేకం.

మకరం : మకరమంటే మొసలి. మొసళ్ళు సాధారణంగా నీటిలో ఎక్కువగా, బయట కూడా సంచరించేవి ఉన్నప్పటికీ నీటిలో సంచరించే మొసలికే అధికబలం ఉంటుందనేది మొట్టమొదినుండీ మనకున్న భావన.  మొండి పట్టుదలతో సేవాధర్మాన్ని కలిగి తాను చేసే పనిని ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బందికరమైనా చేసి చూపించే తత్త్వం ఈ మకరానిది. తన స్థానబలం నీటిలో అత్యంత అధికం కావడం వల్ల స్వంత ప్రదేశంలో వీరు అత్యధికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. లోకంలో అత్యంత ఉదాత్తమైన ధర్మం సేవాధర్మం. ఈ ధర్మానికి ప్రతీకగా కూడా ఈ రాశివారిని మనం చూడవచ్చు.

కుంభం : కుంభమంటే కుండ అని అర్థం. ఈ కుండలో ఉండేది ఏమిటో  తెలియకుండా ఉంటుంది. ఒకవేళ నీరే ఉంటే ఎంత ఉందో తెలియదు. కాబ్టి కుంభంలో ఏదో తెలియని విశేషాలుంటాయి. నిండుకుండగా కనిపిస్తున్నా దానిలో ఒక్కోసారి ఏమీ ఉండకపోవచ్చు. ఏమీ లేదనుకుంటే ఏదైనా దానిలో కొత్త విశేషం కనిపించవచ్చు.

మీనం : మీనమంటే చేప. రెండు చేపలు ఐదు అంట్లతో కనిపించే ఆకృతి మీనాకృతి. ఇక్కడ కూడా ఈ రెండు చేపలు రెండు భావాలకు ప్రతీకలుం. నిర్ణయశక్తి విషయంలో రెండు భావనలుం ఎప్పికప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఈ రెండు చేపలకు అంట్లుగా ఐదు నక్షత్రాలుండడం వల్ల వీరు అనుబంధాలకోసం ప్రాకులాడడం కనిపిస్తుంది. అందరితోనూ ఆత్మీయతను పంచుకోవాలనే తపన ఈ రాశివారిలో ఉంటుంది.

డా.ఎస్. ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios