Asianet News TeluguAsianet News Telugu

తెలిసినవి తెలుసుకోవడమే విద్య..?

ఒక విషయాన్ని గురించి ఎవరైనా మ్లాడుతున్నపుడు ఆ విషయమందు అంతకుపూర్వమే నిజంగా మనకు ఆసక్తి ఉంటే అప్పుడు మనస్సు లగ్నమవుతుంది.

astrology.. the intrest of education
Author
Hyderabad, First Published Oct 30, 2018, 2:58 PM IST

విద్య అంటే తెలుసుకోవడం. తెలుసుకోవడం అంటే ఇంతకుముందు తెలియనివి కొత్తగా తెలుసుకోవడం. తెలియనివి తెలుసుకుంటే అసలు లోపలికే వెళ్ళదు. మరి తెలిసింది తెలుసుకోవడం అంటే? వాస్తవానికి తనకు తెలిసినదేదో స్పష్టంగా తెలుసుకోవడమే విద్య. అందుకనే ఒక విషయాన్ని గురించి ఎవరైనా మ్లాడుతున్నపుడు ఆ విషయమందు అంతకుపూర్వమే నిజంగా మనకు ఆసక్తి ఉంటే అప్పుడు మనస్సు లగ్నమవుతుంది. అలా లగ్నమైనపుడు ఒకసారి వినగానే మనస్సుకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా లగ్నమైనపుడు ఒకసారి వినగానే మనస్సుకు స్పష్టంగా అర్థమవుతుంది.

ఉదాహరణకి మనం వార్తాపత్రికలు చదువుతున్నపుడు ఒకి రెండు వార్తలు బాగా గుర్తుంటాయి. ఈ గుర్తున్న ఒకి రెండు వార్తలను నాలుగుసార్లు వల్లించలేదు. తక్కిన వార్తలన్నీ చదివినా గుర్తులేకపోవడానికి ఈ రెండు వార్తలు మనస్సులో స్థిరపడడానికి కారణం ఏమి? తన మనసులో అంతకు పూర్వమున్న ఆసక్తికి సంబంధించిన విషయం కావడంవల్ల ఒకసారి  చదివితేనే గుర్తుంటుంది. 'ఏక సంతాగ్రాహి' అంటే అదే.

ఏ వ్యక్తి అయితే ఆసక్తితో విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చదవడం కాని, వినడం కాని చేస్తాడో అతడు ఆ విషయాన్ని మనసులో స్థిరపరుచుకో గలుగుతాడు. దీనికి కారణమేమి అంటే ఈ చదివిన లేక విన్న విషయము తరువాత అతని మనసులో చర్చించబడుతుంది. ఈ చర్చించబడటంలో విన్న లేక చదివిన వాక్యాన్ని సమర్థించేటటువిం కొన్ని అంశాలు, వ్యతిరేకించేటటువిం మరికొన్ని అంశాలు ఘర్షణ పడతాయి. దీనినే 'మననం' అని అంటారు. ఈ మననం ద్వారా ఆ విషయం స్పష్టపడుతుంది.

కనుక ఆ సశక్తి అనే దానివలననే విద్య మనసుకు పడుతుంది తప్ప చదవడం, మళ్ళీ మళ్ళీ చదవడం వల్లకాదు. రెండవసారి చదవడం వలన ఆసక్తి ఇంకా తగ్గుతుంది. కారణం ఏమి? ఒకసారి చదివేసిందే కదా అనే ధోరణి కలుగుతుంది. అందుకని చదివేటప్పుడు ఆసక్తితో చదవాలి, మొదిసారే చదవాలి, మొదిసారి ఆసక్తిగా ఉన్నపుడే చదవాలి, అలా చదివినపుడే మనసుకి పూర్తిగా ప్టాలి, పూర్తిగా అర్థంచేసుకున్నామా లేదా అని పరీక్షించుకోవాలి, దానిని మననం చేయాలి, ఆ వాక్యాన్ని స్థిరపరిచేటటువిం పాత వాసనలు, భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని దీనికి కలుపుకోవాలి. అపుడు ఆ విషయం సమగ్రమవుతుంది. ఇదే 'శ్రవణం' అంటే వినడం.

విన్న వెంటనే 'మననం' అంటే దానిని మరల మరల భావన చేయడం, దానిని సమర్థించేటటువిం ఆలోచనలు చేయడం, చేస్తే అది నిజమైన ఆసక్తిగా రూపొంది ఆ విషయం మనసులో స్థిరపడుతుంది. ఆ తరువాత అది పూర్తిగా మనదవుతుంది. ఆ ఆత్మీయమైన భావం ఏదైతే ఉందో అది జీవితాంతం మరిచిపోని పరిస్థితి ఏర్పడుతుంది.

ఒక విషయాన్ని ఒక పుస్తకంలో చదివాక రెండవ పుస్తకంలోకి వచ్చేటప్పికి అటువిం విషయాలే లేక మళ్ళీ మళ్ళీ పునరావృత్త మవుతుటాంయి. అలాటపుడు ఒక శాస్త్రానికి సంబంధించిన వేరువేరు గ్రంథాలను చదివితే, గ్రంథాలు వేరైనా విషయాలు అవే పునరావృతం అవుతుండటం వల్ల మనసు లగ్నంకాదు. తెలిసిన విషయాలను చదువుతున్నపుడు తెలిసిన విషయమే కదా అని మనసు మరోచోటికి వెళ్ళిపోతుంటుంది. దాని మూలంగా అనాసక్తి ఏర్పడుతుంది.

ఉదాహరణకి చూసిన సినిమా మళ్ళీ చూడగలమా? అలా చూసినపుడు అనాసక్తి వలన మనకు నిద్రరావచ్చు. అలాగ అనాసక్తితో ఆ పుస్తకం చదివినా, అనాసక్తితో చదివిన విషయం మళ్ళీ చదివినా అది ప్రయోజకారి కాదు. ఒక విషయానికి సంబంధంగా ఒక పుస్తకం చదివిన తరువాత, దానిని సమగ్రంగా ప్రతి అంశాన్ని మనస్సుకు పట్టేట్లు చదివాక, అదే విషయానికి సంబంధించిన మరో పుస్తకాన్ని చదివేటప్పుడు, మొత్తం పుస్తకం చదవడం అనే పని పెట్టుకోకూడదు.

ఆ క్రొత్త పుస్తకానికి సంబంధించిన విషయ సూచికను మొదట చదవాలి. అలా చదివి దానిలో మనకు తెలిసిన విషయాలను వదలి క్రొత్తగా కనిపించే శీర్షిక ఏది అని వెదకాలి. ఆ శీర్షికకోసం లోపల వెదకి చదవడం ప్రారంభిస్తే, అది ఒకటే చదువుతుండడం వలన మనసుకి బాగా పడుతుంది. బాగా గుర్తుంటుంది. అపుడు ఆ విషయం ఆ పుస్తకంలో ఫలానా పేజీలో ఉంది అన్నంత స్పష్టమైన గుర్తుంటుంది. అలాగ మనం క్రొత్త శీర్షికలను మాత్రమే చదవడంవలన ఏ పుస్తకంలో ఏది విశేషమో, ఏ పుస్తకంలో ఏది ప్రాణంవిందో అది బాగా గుర్తుండి మనం ఎక్కువ పుస్తకాలు చదివే అవకాశం కలుగుతుంది. దీనినే ఆసక్తితో కూడినటువిం విద్యా పఠన విధానం అని చెప్పుకోవచ్చు.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios