Asianet News TeluguAsianet News Telugu

శాంతిప్రక్రియలు ఫలించాలంటే ఉండవలసిన కొన్ని ప్రాథమిక అంశాలు

ఒకవేళ ఆ ప్రాథమిక అంశాలే చాలా బలంగా ఉంటే శాంతి ప్రక్రియలు కూడా అవసరం లేనంతగా తేజస్సు పెరగుతుంది

astrology.. main key points of shanthi prakriya
Author
Hyderabad, First Published Sep 22, 2018, 1:58 PM IST

పునాది సరిగ్గా లేకుంటే భవనం నిలబడనట్లుగా, పెద్ద రంధ్రం కలిగిన బస్తాలో ధాన్యం నింపితే నిలువనట్లుగా కొన్ని ప్రాథమిక అంశాలు సరిగ్గా లేకుంటే కూడా శాంతి ప్రక్రియలు అంతగా ఫలించవు.

ఒకవేళ ఆ ప్రాథమిక అంశాలే చాలా బలంగా ఉంటే శాంతి ప్రక్రియలు కూడా అవసరం లేనంతగా తేజస్సు పెరగుతుంది.

మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి ఇవి ప్రాథమిక అంశాలు. తండ్రిన ప్రసన్నం చేసే కర్మలతో ప్రజాపతి ప్రసన్నుడౌతాడు. తల్లిని పూజిస్తే ఈ సమస్త భూమిని పూజించిన పుణ్యం, అలాగే గురువును సంతోషపరిస్తే బ్రహ్మను పూజించిన ఫలం లభిస్తుందని, తల్లిని, తండ్రిని, గురువును ఆదరిస్తే సకల ధర్మాలు ఆచరించిన ఫలం కలుగుతుందని శాస్త్రం.

ఒకవేళ ఆ ముగ్గురిని నిరాదరణ చేసి నిందిస్తూ ఉంటే ఆచరించిన అన్ని కర్మలు వ్యర్థమౌతాయని శాస్త్రం చెబుతుంది.

అంతేకాదు వారిని నిందించి అవమానించడం వల్ల వచ్చిన దోషం జన్మ పరంపరగా మరియు వంశపారంపర్యంగా కూడా వెన్నంటుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక కుండలిలో కూడా ఈ దోషాలు కనిపిస్తూ ఉంాయి.

 అతిథిని అవమానిస్తే ఆ యజమాని వేలకొలది మోపుల సమిధలతో వందల కొలది కుండల నేతితో చేసిన యజ్ఞయాగాదులు కూడా నిరర్ధకమౌతాయని పరాశరస్మృతి చెబుతుంది.

తేలికగా తీసిపారేసినా దీని ప్రభావం సూక్ష్మంగా పరిశీలించే వారికే అర్థమౌతుంది.

తల్లిని, తండ్రిని, గురువును, గోమాతను, వేదాన్ని, బ్రాహ్మణులను, మహాత్ములను, ఇంికి వచ్చిన అతిథిని అవమానపరిస్తే శాంతి పౌష్టిక కర్మల వల్ల లభించిన పుణ్యం కంటే పదింతల పుణ్యం ఖర్చవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

విశేషపుణ్యఫలం వల్ల ఇంద్రపదవిని పొందిన నహుషుడు ఋషులతో  పల్లకిని మోయించుకుని అవమానించడం వల్ల చిన్నపాి వేదనింద వల్ల ఒక్క క్షణంలోనే పుణ్యం అంతా ఖర్చు చేయబడి వేయి సంవత్సరాలు కొండచిలువగా పడి ఉన్న వృత్తాంతం మనకు పరాణేతిహాసాలలో కనిపిస్తుంది.

అలాగే భక్తితో తల్లిదండ్రులకు సేవ చేయడం వల్లనే జ్ఞానాన్నీ, దివ్యదృష్టిని పొందిన ధర్మవ్యాధుని కథ కూడా మహాభారతంలో కనిపిస్తుంది.

అలాగే 'యథాభర్త్రా శ్రయోధర్మః' అంటే స్త్రీలకు అన్ని ధర్మాలు భర్తనే ఆశ్రయించి ఉంాయని శాస్త్రం. కాబ్టి భర్తను అవమాన పరుస్తూ, నిందిస్తూ ఉండే వారికి కూడా పునస్కారాల వల్ల, శాంతిప్రక్రియలు.. మొదలైన వాి వల్ల వచ్చిన పుణ్యమే కాక పూర్వపుణ్యం కూడా ఖర్చుకావడం వల్ల క్రమేణా అశాంతి ఏర్పడుతుంది.

ఒకవేళ వారి ప్రవర్తన నచ్చకున్నా సరే మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ మానసికంగా భక్తిని కలిగి ఉండడం మంచిది. కాని వారిని నిందించడం వల్ల మాత్రం తేజస్సు విశేషంగా ఖర్చు అవుతుందని గుర్తించాలి. నిందించడంవల్ల సమస్యలు పరిష్కారం కావు అన్న విషయాన్ని కూడా గుర్తించాలి.

ఒకవేళ తెలిసి తెలియక వ్యతిరేకంగా ప్రవర్తించినా తరువాత పశ్చాత్తాపం కలిగితే కొన్ని ప్రాయశ్చిత్త శాంతి కర్మలు చేయడం మంచిది.

ఒక ఉపాధ్యాయునికి ఇచ్చు గౌరవం కన్న 10 రెట్లు ఆచార్యునిపట్ల గౌరవం చూపాలి. ఆచార్యునికి ఇచ్చే గౌరవం కన్నా 100రెట్లు గౌరవం తండ్రికి, తండ్రికచ్చే గౌరవం కన్న 1000 రెట్లు గౌరవం తల్లికి చూపాలని.

అందుకే వేదం కూడా మాతృదేవోభవ ! పితృదేవోభవ ! ఆచార్య దేవోభవ ! అతిథి దేవో భవ ! అనే వరుస క్రమాన్ని చెప్పింది.

సన్యాసి వద్దకు తండ్రి వచ్చినపుడు, ఆ సన్యాసికే తండ్రి నమస్కరించాలని శాస్త్రం. కాని తల్లి వచ్చినపుడు మాత్రం సన్యాసి రూపంలో ఉన్న కొడుకే నమస్కరించాలి. దీన్ని బట్టే వారి వారి ప్రాథాన్యత క్రమం అర్థమౌతుంది. తల్లి దండ్రి గురువుల మంచి చెడ్డలను విచారించే హక్కు మనకు లేదు. అది వారి వారి కర్మఫలం ఈ జన్మను ప్రసాదించినందుకు తల్లితండ్రులనూ జ్ఞానాన్ని ప్రసాదించినందుకు గురువును గౌరవించాల్సిన ధర్మం మనపై ఉంది. ఈ ధర్మాన్ని ఆచరించినపుడు శ్రేయోమార్గం వైపు ప్రయాణించి జన్మను సాఫల్యం చేసుకుాంము.

ఈ ప్రాధమిక విషయాలనే ఆచరించని వ్యక్తి పొందవలసిన శ్రేయస్సును పొందక పోవడమే కాక పూర్వ పుణ్యం కూడా ఖర్చు చేయబడుతూ అశాంతివైపు ప్రయాణిస్తాడు.

ఇక్కడ మనకో సందేహం రావచ్చు ! తల్లిదండ్రి గురువులు కూడా ధర్మం పట్ల పొరపాటు పడి ధర్మవిరుద్ధమైన పనులు చెబితే చేయాలా? అని

ఇక్కడ వారిని పూజించడం, భక్తితో ప్రవర్తించడం వేరు. కాని చేసే పనుల విషయంలో మాత్రం వేదమే ప్రయాణం.

తల్లిదండ్రి గురువులు చెప్పిన పనులు శాస్త్రసమ్మతమైతే తప్పనిసరి ఆచరించాలి. ఒకవేళ వేదవిరుద్ధమైతే మాత్రం ఉదాసీనంగా ఉండాలి. కాని వారిపట్ల భక్తి విషయంలో ప్రవర్తన విషయంలో తగిన విధంగానే వ్యవహరించాలి.

దీనికి భాగవత పురాణాంతర్గతమైన ప్రహ్లాద చరిత్రే తార్కాణం.

''హిరణ్యకశ్యపుడు ఎన్ని రకాల హింసించినా ప్రహ్లాదుని పితృభక్తి మారలేదట| అలాగని వేద ధర్మం పట్ల నిష్టను కూడా కోల్పోలేదు.''

కాబ్టి ఎన్ని రకాల కారణాలున్నా సరే తల్లి దండ్రి గురువుల పట్ల భక్తిని చూపించవల్సిందే! మానసికంగా కలిగి ఉన్నంత మాత్రాన సరిపోదు. ప్రవర్తనలో కూడా చూపించాలి.

వారిపట్ల భక్తిని ప్రదర్శించడం వారి మేలుకోసం కాదు. దానివల్ల మన తేజస్సు మరింత పెరిగి శాంతితో కూడిన అభివృద్ధి జరుగుతుంది.

కాబ్టి ఎంత శ్రమించినా... ఎన్ని రకాల శాంతి ప్రక్రియలు, పూజలు, వ్రతాలు చేసినా అభివృద్ధి సాధించడం లేదు అంటే ఒకసారి ప్రాథమిక అంశాలు సరియైన విధంగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.

Follow Us:
Download App:
  • android
  • ios