గురుగ్రహ ప్రభావం అంత అనుకూలంగా ఉండదు. వీరు చేయాల్సిన పనులు తొందరగా పూర్తి చేయలేరు. తమకోసం తాము ఆలోచించుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆలోచన ఒకి ఉంటుంది. ఆచరణ ఇంకో రకంగా ఉంటుంది. 

సౌకర్యాలకోసం వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందని ద్రాక్షపళ్ళు పుల్లన అనే సామెత ప్రకారం వీరు అనుకున్న విధంగా వీరికి సౌకర్యాలు లభించకపోవచ్చు.  వాటికోసం ఆరాటం ఎక్కువగా ఉంటుంది. ఆహారం విషయంలో ఒత్తిడి ఉంటుంది. సమయానికి ఆహారం లభించకపోవచ్చు. దాని వల్ల అజీర్ణ సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి.

వీరికి సౌకర్యాలు లభించవని తెలుసుకున్నప్పుడు వాటికోసం ఆరాటపడకూడదు. కొద్ది వాటితో సర్దుకుపోయే తత్త్వాన్ని అలవాటు చేసుకోవాలి. అనవసర ఆర్భాలకు వెళ్ళకూడదు. తినే ఆహారం బాగా నమిలి తినాలి. కడుపు నిండడానికి కొంచెం తక్కువగానే ఆహారాన్ని తీసుకోవాలి. అది కూడా సమయానికి తీసుకోవాలి. ఎక్కువగా కారం, వేపుడు పదార్థాలు తినకపోవడం మంచిది. దానివల్ల కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తినే పదార్థాలు మెత్తగా పూర్తిగా ఉడికినవి, ఇంట్లో చేసిన పదార్థాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

తమ ఆలోచనలే తమను ఇబ్బందిపెట్టే అవకాశం ఏర్పడుతుంది. సృజనాత్మకత తగ్గుతుంది. సంతానం వల్ల సమస్యలు వచ్చే అవకాశం. మానసిక ఒత్తిడి అధికంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది.  ఊహించని ఇబ్బందులు వచ్చే సూచనలు. పరామర్శలు చేసే అవకాశం ఉంటుంది. సంప్రదింపుల్లో జాగ్రత్త అవసరం.

వీరు చేసే పనుల్లో పట్టుదల అవసరం. పట్టుదల లేకపోతే మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆపి వాటిని పూర్తిచేయకుండా వదిలిపెట్టే ప్రమాదం ఉంది. ఒక క్రొత్త పనిని ప్రారంభించే ముందు తన మిత్రులతోను, గురువులతోను చర్చించి తరువాత ఆ పనిని ప్రారంభించడం మంచిది.

పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు కాబట్టి సంతాన సమస్యలు తగ్గించుకోవడానికి వీరు దానాలు ఎక్కువగా చేయాలి. లేకపోతే సంతానం మాట వినకపోవచ్చు. సంతానం అంటే తమకు పుట్టిన పిల్లలే కాదు. తమలోంచి పుట్టిన ఆలోచన కూడా సంతానమే. ఆ ఆలోచనల వల్ల కూడా చాలామందికి ఒత్తిడిని పెంచకుండా ఉండాలి. విద్యార్థులు శ్రీ హయగ్రీవాయ నమః జపం నిరంతరం చేసుకోవడం మంచిది.

వీరికి ఊహించని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తమ దగ్గరనుంచి ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తమ దగ్గర ఉన్న వస్తువులుకాని డబ్బు కాని ఆలోచనలు గాని వ్యర్థంగా పోకుండా జాగ్రత్త పడాలి. వీరు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం మంచిది.

చేసే వృత్తి ఉద్యోగాదుల్లో అధికారులతో ఒత్తిడి ఉంటుంది. పెద్దవారితో జాగ్రత్తగా మెలగాలి. తొందరపాటు పనికిరాదు.  సంఘంలో గౌరవం పెంచుకునే ఆలోచనల్లో అధిక శ్రమ పడతారు. హోదా కీర్తి ప్రతిష్టలకై దృష్టి అధికంగా ఉంటుంది. పదిమందిలో గౌరవాన్ని కాపాడుకోవాలి.

విశ్రాంతి తక్కువగా ఉంటుంది. నిద్ర సరిగా ఉండదు. పాదాల నొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. శారీరక శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల ఖర్చులు చేస్తారు. అనవసరం కాకుండా జాగ్రత్త పడాలి.

సింహరాశివారికి అనుకున్న పనులు అన్నీ జరుగుతున్నట్లుగా అనిపిస్తాయి కాని జరగడం లేదని ఆలోచిస్తూ ఉంటారు. ఆ పనులు కూడా అంత సాఫీగా సాగవు. కొంచెం ఒత్తిడి శ్రమానంతరం తాము అనుకున్న పనులు సాధిస్తారు. వీరు ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి గురు గ్రహ అనుగ్రహాన్ని పెంచుకోవడానికి శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం, సాయిబాబా దేవాలయాలకు ప్రతి గురువారం వెళ్ళడం, అందరికీ శనగలు ప్రసాదంగా పెట్టడం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ