Asianet News TeluguAsianet News Telugu

మిథునరాశిపై గురుగ్రహ అనుగ్రహం ఎలా ఉంది

పోటీల్లో గెలుపుకై తపన పడతారు. కాని అనుకున్నంత సులువుగా వీరు గెలుపు సాధించలేరు. శత్రువులపై విజయానికి కష్టపడాలి. విద్యార్థులు పోటీలతో గెలుపు సాధిస్తారు.

astrology.. gurugraha anugraham on midhuna rashi
Author
Hyderabad, First Published Nov 29, 2018, 2:59 PM IST

గురునికి బుధుడు సముడు అవుతాడు. వీరికి పోటీల్లో గెలవాలనె తపన బాగా ఉంటుంది. శత్రువులపై విజయం సాధించాలనుకుంటారు. సామాజిక అనుబంధాలపై దృష్టి ఉంటుంది. సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు సాధించుకోవాలనే ఆలోచన పెరుగుతుంది.

పోటీల్లో గెలుపుకై తపన పడతారు. కాని అనుకున్నంత సులువుగా వీరు గెలుపు సాధించలేరు. శత్రువులపై విజయానికి కష్టపడాలి. విద్యార్థులు పోటీలతో గెలుపు సాధిస్తారు. సోషల్‌ రిలేషన్స్‌లో కూడా పోలీలు పెంచుకుంటారు. ఏ పనినైనా పోటీ ఉంటే మాత్రమే సాధించగలుగుతారు. పోటీకోసం అందులో గెలుపుకోసం కష్టపడతారు. రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పోటీల్లో డబ్బుపోగొట్టుకుంటారు. అంటే బ్టెటింగ్స్‌ వాటి జోలికి పోకూడదు.

విశ్రాంతి తక్కువగా ఉంటుంది. అనవసర ఖర్చులు చేసే అవకాశం. ఇతరులపై ఆధారపడతారు. మానసిక ఒత్తిడిని పెంచుకుంటారు. సుఖం కోసం ఆలోచన పెరుగుతుంది.

మాటల్లో కొంచెం జాగ్రత్త అవసరం. ఎదుటివారు కొంతవరకు అపార్థం చేసుకునే అవకాశం. మధ్యవర్తిత్వాలు చేయకూడదు. కుటుంబంలో ఒత్తిడితో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. మాటల్లో కూడా పోటీతత్వం పెరుగుతుంది. ప్రతీ పనిలో కొంత ఘర్షణ ఉంటుంది. నిల్వ ధనాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త పడతారు.

చేసే ఉద్యోగంలో అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. పెద్దలందు గౌరవ మర్యాదలు పెంచుకునే ప్రయత్నం చేయాలి. రాజకీయ విషయాలపై ఆసక్తిని పెంచుకుంటారు విశ్రాంతి తక్కువవౌతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. పరాధీనత ఉంటుంది. అన్ని పనుల్లో ఆటంకాలు ఎదురౌతాయి. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. మానసిక ఒత్తిడి ఎక్కువౌవుతుంది. శత్రువుల వలన ఒత్తిడి పెరిగే సూచనలు కనబడతాయి.

పెద్దలు ఉన్నతులతో పోటీలకు కొంత దూరంగా ఉండడం మంచిది. పోటీల్లో గెలుపు కష్టం అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులు మాత్రం శ్రీ హయగ్రీవాయనమః జపం చేసుకోవడంమంచిది. దాచుకున్న ధనాన్ని అనవసర ఖర్చులు వినియోగించి ఏవో పోటీల ద్వారా తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి.

గౌరవాన్ని సంపాదించుకోవాలంటే ఏ స్వార్థమైన ఆలోచన లేకుండా సేవ చేస్తూ ఉండాలి. పోటీల్లో గెలుపుకై ఆర్థిక విషయాల జోలికి రాకూడదు. బ్టెటింగులు, ఫ్టింగ్స్‌ వాటి జోలికివెళ్ళకూడదు. అనవస ఇబ్బందులు కోరి తెచ్చుకోవచ్చు.

వీరికి విశ్రాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి విశ్రాంతికోసం ఆలోచించకూడదు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఉంటే కొంత మానసిక ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతత పడుతుంది.

గురువు అనగానే ఎంత ఇబ్బందిపెట్టేవాడైనా మంచినే చేస్తాడు. కాని ఆ చేసే ఉపకారం కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆ ఘర్షణను తగ్గించుకునే ప్రయత్నం వీరు చేస్తే వీరి జీవితం ఆనందంగా సాగుతుంది. దేవాలయాలకోసం ఖర్చులు చేయడం, పాడుబడిన దేవాలయాలకు కావలసిన ధన సహాయం చేయడం, హోమాలకు ఆవునెయ్యి, చెట్లు నాటించడం, ప్రత్యక్షమైన గురువులకు అంటే తమకు మంచి బోధించేవారు, మంత్రోపదేశం చేసినవారికి వీరు సన్మానాలు చేయడం, వారి అనుగ్రహానికి పాత్రులు కావడం చేసుకోవాలి.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios