Asianet News TeluguAsianet News Telugu

జీవితంలో గ్రహాలు - ఫలితాలు

సూర్యోదయంతో నిద్రనుండి మేల్కొనని వారున్నప్పికి సూర్యుడు మాత్రం ఉదయిస్తున్నాడు.

astrology..effect of grahalua nd their results
Author
Hyderabad, First Published Oct 3, 2018, 4:27 PM IST

సూర్యోదయంతో విశ్వం మేల్కొంటుంది. సూర్యోదయంతో నిద్రనుండి మేల్కొనని వారున్నప్పికి సూర్యుడు మాత్రం ఉదయిస్తున్నాడు. అతను మనమీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. సూర్యోదయం మనమీద చూపించే ప్రతికూల లేక అనుకూల ప్రభావాలను జాతకచక్రంలోని చంద్రుని వలన మనం గ్రహించవచ్చును. సాధారణంగా సూర్యోదయమున సూర్యుడు ఉండే స్థానమే (గోచార సూర్యుడు) మన జాతకచక్రంలో మొది భావం అవుతుంది. అందుకనే సూర్యోదయంతో మనం నిద్రనుండి మేల్కొని భౌతిక కార్యక్రమాలను అనగా పళ్ళు శుభ్రపరచుట, స్నానం మొదలైన పనులను నిర్వహిస్తాము. సూర్యాస్తమయం సమయానికి సూర్యుడు ఏడవింకి (జాతకచక్రంలో) చేరుకొటాండు.

చంద్రుని కదలికలు నిత్యజీవితంలో మానవుని మనస్సుపై ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి నెలపొడుపు చంద్రుని ప్రభావము మానవజీవితంపైన, జీవిత లక్ష్యాలపైన ప్రభావాన్ని చూపుతుంది. చంద్రుడు శని ప్రభావానికి లోనైతే అనుకోని దిగులు, విచారం మనస్సును అలుముకుటాంయి. చంద్రుడు గురువు లేక శుక్రుని ప్రభావానికి గురైతే ఉత్సాహంగాను, ప్రోత్సాహంగాను జీవితం ఉంటుంది.

కుజుడు తన ప్రభావంతో మన శక్తి సామర్థ్యాలను కూడగ్టి పైకి తీసుకొని వెళ్ళగలడు. లేదా మన దురుసుతనం వల్ల పాతాళానికి నెట్టగలడు. కనుక గోచార కుజునిపై జాతకచక్రంలోని ఇతర గ్రహముల స్థానాన్ని అనుసరించి ప్రతికూల, అనుకూల ప్రతిఫలాలను సమీక్షించాలి. కుజ, చంద్రులకు ప్రతికూలదృష్టి ఏర్పడితే సంయమనాన్ని కోల్పోయే ప్రమాదముంది.

బుధుడు అనుకూల గోచారం వలన వ్యక్తిలో చురుకుదనం పెరుగుతుంది. తెలివిగా మ్లాడటమే కాదు, తెలివిగా కార్యక్రమాలను కూడ నెరవేర్చగలుగుతాడు. అన్నీ శుభ సూచకంగానే ఉంటాయి. ప్రతికూల బుధుడు అనుకోకుండా నరాల బలహీనతను ఏర్పరచి, సమస్యల బారినపడవేస్తాడు. అనుకూల బుధుడు మనను తారాస్థాయికి తీసుకొని వెళ్ళగలడు, అన్ని విజయాలను చేకూర్చగలడు.

అనుకూల గోచార గురువు వలన ద్రవ్యం వస్తుంది. రాని బాకీలు కూడా వసూలౌతాయి. ప్రజలు వాళ్ళ శక్తికిమించి మంచి కార్యక్రమములు చేయడానికి పూనుకుటాంరు. ప్రతికూల గురువు శని ప్రభావంతో మనలను దురుసు స్వభావానికి, దుడుకు ప్రయత్నాలకు ప్రోత్సహిస్తాడు. దీనివల్ల మనకున్నది పోగొట్టుకుటాంము.

అనుకూల శుక్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అతని చలనం వలన మనుషుల అనుభూతులు, ఆలోచనలు బయట పడతాయి. యువకులైనట్లైతే ప్రేమవ్యవహారాల జోరులతో ఉంటారు. యువకులు కానట్లైతే ఆహ్లాదకరమైన విహారాలకై ద్రవ్యాన్ని వినియోగించుకుటాంరు. గోచారరీత్యా ప్రతికూలమైన శుక్రుడు, కుజ, శని, రాహుల వలన తక్కువ స్థాయిలో ఫలితాన్నిస్తాడు. అప్పుడు వ్యక్తులు నిస్పృహలతోను, కుంభకోణాలతోను సతమతమవుతారు.

గోచారశని ప్రభావానికి ప్రజలు సాధారణంగా భయపడతారు. ఫలితంలేని కార్యక్రమాలలో మునిగి ఉంటారు. అత్యాశకు గురౌతారు. ద్రవ్యనష్టం, అనారోగ్యం, నిత్యవిచారం, చికాకు, నిరుత్సాహం మొదలైన వారితో కూడి ఉంటారు. అనుకూల శని పైనుదహరించిన వారికి వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తాడు.

రాహు, శనుల అనుకూలత వలన వ్యక్తులు వారి సహజ శక్తి సామర్థ్యాలను, ప్రణాళికలను ప్రదర్శించగలుగుతారు. రాహువు సాధారణంగా నిత్యజీవితంలో ముఖ్యమైన సంఘటనకు కారకుడవుతాడు. అనుకోకుండా ఒక్కసారిగా సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతాయి. పిల్లలపై రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాహువుకు చంద్రునితో ప్రతికూల పరిస్థితి ఏర్పడితే పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. శుక్రునికి సంబంధించినదైతే ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఏదైతే అనుకుటామో పరిస్థితులకు తగ్గట్టుగా అదే జరుగుతుంది. రాహువు మీ ప్రణాళికలను రహస్యంగా కోడిలా పొదుగుతాడు. రాహువు చాలా బలవంతుడు.

కేతువు ప్రభావాల వలన రోగములు బయటపడతాయి. ఆధ్యాత్మిక విషయాలలో కేతువు ప్రధానపాత్ర వహిస్తాడు. గ్రహముల విషయములో ఇవన్నీ సాధారణ విషయాలు. వారి వారి కారకత్వాలు, మిత్రత్వ, శత్రుత్వాలు మొదలైనవి పరిగణలోకి తీసుకొని ఫలితాలను నిత్యజీవితంలో అంచనా వేసుకొని ముందుకు నడవాలి. విశ్వమంతా గ్రహముల ప్రభావంతోనే ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ఆ విషయాలను సూచిస్తుంది. వారిని అన్వయించుకోవటం, అర్థం చేసుకోవటం, విశ్లేషించడం మానవుని విజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది.

డా.ఎస్ ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios