హృదయ ప్రాధాన్య వ్యక్తులు ఎక్కువగా ప్రేమ కోరుకోవడం, ప్రేమ పంచడం చేస్తూ ఉంటారు. మనుషులతో ఎక్కువ బంధాన్ని పెంచుకున్నట్లుగానే వస్తువులతో తమ అలవాట్లతో కూడా అలాగే బంధం పెంచుకుటాంరు. వీరు వ్యవహరించే విషయంలో మనసు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వీరు పిల్లలుగా ఉన్నప్పుడు తల్లితండ్రులనూ, దగ్గరితనంగా భావించే వారిని అకస్మాత్తుగా వచ్చి కౌగిలించుకోవడం, అత్యంత ప్రేమగా వ్యవహరించడం చేస్తూ ఉంటారు. ఇలాటిం పిల్లలను కౌగిలించు కున్నప్పుడు పెద్దవారు కూడా తమ ఒంటరితనం తొలగిపోయినట్లుగా, హాయిగా రిలాక్స్‌గా ఫీల్‌ అవుతారు. (అనుభూతి చెందుతారు)

వీరు బుద్ధితో ఎక్కువ ఆలోచించకుండా మనస్సుకు నచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నతస్థితిలో ఉన్నప్పుడు మరోరకంగా ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది.

తక్కువస్థాయి వ్యక్తిత్వం ఉన్న హృదయ ప్రాధాన్య వ్యక్తులకు బద్ధకం ఏర్పడడం, హాస్యాన్ని పరిహాసంగా స్వీకరించడం, అతినిద్ర, ఆవేశం లేదా దుఃఖం, ఇతరులు (దగ్గరివారు) తనను అర్థం చేసుకోవడం లేదని బాధ పడడం, ప్రేమ రాహిత్యంతో బాధ పడడం, మానసికంగా అత్యుత్సాహం లేదా క్రుంగిపోవడం, ఇతరుల చేతుల్లో మోసపోవడం.. మొ||లైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

ఇక ఉన్నతస్థాయి వ్యక్తిత్వం ఉన్న హృదయ ప్రాధాన్య వ్యక్తులకు.. ఉత్సాహంగా ఉండడం, బేషరతుగా ప్రేమను పంచడం, అందరి హృదయాల్లోకి చొచ్చుకుపోయే టట్లుగా స్నేహభావంతో వ్యవహరించడం, తనను నమ్ముకున్న వ్యక్తులకు అది మంచా? చెడా? అని బుద్ధితో ఆలోచించకుండా బేషరతుగా సహాయాన్ని అందించడం, (ఆశ్రిత పక్షపాతం) నిరంతరం ఏవో పనులతో బిజీగా ఉండడం, సహజ నాయకత్వ గుణాలు కలిగి ఉండడం మొ||లైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.

ఉన్నత వ్యక్తిత్వం ఉన్న హృదయ ప్రాధాన్య వ్యక్తులతో పరిచయం ఉన్న ప్రతీ వ్యక్తి వారిని తనకు అత్యంత సన్నిహితులుగానే భావిస్తూ ఉంటాడు. సాధారణంగా హృదయ ప్రాధాన్య వ్యక్తులు బుద్ధితో ఆలోచించడానికి ఎక్కువ ఇష్టపడరు. కాబట్టి అలాటిం బుద్ధి ప్రాధాన్య వ్యక్తులను ఎవరినో ఒకరిని తోడుగా ఉంచుకుటాంరు.

హృదయ ప్రాధాన్య వ్యక్తులకు బుద్ధి ప్రాధాన్య వ్యక్తులను అర్థం చేసుకోవడం గానీ, మార్చడం గాని కష్టమౌతుంది. (సన్నిహితులని భావిస్తే విశ్వసిస్తారు అంతే)

హృదయ ప్రాధాన్య వ్యక్తిత్వం గల స్త్రీకి, బుద్ధి ప్రాధాన్య వ్యక్తి జీవిత భాగస్వామిగా లభిస్తే చక్కని అభివృద్ధి ఉంటుంది. కానీ, వారి మధ్య అర్థం చేసుకోవడంలో ఒక అంతరం ఏర్పడుతుంది.

ఆ అంతరం తొలగించుకోవాలని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా వృథాయే! అప్పుడు కేవలం ధర్మాన్ని ఆచరించడం లేదా సంపూర్ణంగా విశ్వసించడం వల్ల మాత్రమే వారి మధ్య అంతరం తొలగిపోతుంది. హృదయ ప్రాధాన్య వ్యక్తులు ఇతరులు తన పట్ల వ్యవహరించే విషయంలో బుద్ధితో లౌక్యంగా వ్యవహరించ కుండా హృదయ పూర్వకంగా వ్యవహరించాలని కోరుకుంటూ ఉంటారు.

కాని అభ్యాసం అంతగా లేకపోడం వల్ల బుద్ధిప్రాధాన్య వ్యక్తులు తమ తమ బాధ్యతలను నెరవేరుస్తారు కానీ, దగ్గర వ్యక్తులతో హృదయ పూర్వకంగా వ్యవహరించడం అంతగా సాధ్యం కాదు.

హృదయ ప్రాధాన్య వ్యక్తులు తన జీవిత భాగస్వామి తనతో ప్రేమగా మ్లాడాలనీ, తనకు మానసికంగా ఓదార్పును అందించాలని కోరుకుటాంరు. ఇతరులకు కష్టాలు ఎదురైనపుడు హృదయ ప్రాధాన్య వ్యక్తులు సహజంగా (తమ స్వభావ గుణంగా) వెళ్ళి సమాయం చేస్తూ ఉంటారు.

వీరు సహజంగా అబద్దాలు అడడం, ఆమట తప్పడం లాటింవి ఎక్కువగా చేయడానికి ఇష్టపడరు. అలాగే వీరు ఒంటరిగా ఉండడానికి కూడా అంతగా ఇష్టపడరు. హృదయ ప్రాధాన్య వ్యక్తులు తన సన్నిహితులు అని భావించిన వారిని పూర్తిగా విశ్వసిస్తారు.