లోకంలో అందరినీ గమనిస్తున్న సందర్భంలో వారి వారి వ్యక్తిగత, ఔద్యోగిక, సామాజిక జీవనాదుల్లో వచ్చే లోపాలను సాధారణంగా చెప్పడం జరుగుతుంది. ఆ యా లోపాలను మనం కొన్నింటిని చూసి వానిని అధిగమించే విధంగా, సరియైన ఆలోచనలు వచ్చే విధంగా ప్రోత్సహించాల్సి ఉంటుంది.

1. నాకు ధైర్యం లేదు  ఏ పనిని చేయలేక పోతున్నాను  శరీరం అందంగా లేదు  శరీరం దృఢంగా లేదు  ఆత్మవిశ్వాసం లేదు  భయంగా ఉంటుంది   మొదలైన శారీరక మానసిక బలహీనతలతో కూడుకున్న ప్రశ్నలు వస్తూటాంయి.

వీరికి శారీరక బలహీనతలు ఏర్పడడానికి మూలం పూర్వకర్మలలో మరొకరి దేహాన్ని నిందించడమో, అనవసరంగా చాలా మందిని భయపెట్టడమో, శరీర శక్తిని అతిగా చూపించి అధికారం చెలాయించడమో జరిగి ఉండాలి. వీనికి ప్రాయశ్చిత్తంగా వారి ఆలోచనా విధానాలను మార్చాల్సి ఉంటుంది.

తమ శరీరం పరిపూర్ణమైనదని భావిస్తూ శరీరం ద్వారా ఇతరులకు సహకరించడం, ఇతరులు అందంగా మారడానికి కావలసిన శారీరక, మానసిక, ఆర్థిక సహకారాలను అందించడం, మానసికమైన అందమే ముఖ్యమైనదని భావించడం, శరీర దృఢత్వం లేని ఇతరులకు సహకరించే ప్రయత్నం చేయడం వింవి చేయాల్సి ఉంటుంది.

తాము అనుకున్న అన్ని పనులు నెరవేర్చ గలమని, దేనినైనా సాధించగల శక్తి సామర్థ్యం ఉన్న వారమని, తమ వెనుక భగవంతుని అద్భుత శక్తి ఉన్నదని, తాము చాలా అందంగా ఉన్నామని, శరీర శక్తితో, మానసిక యుక్తితో వ్యవహరిస్తామనే భావనలతో వ్యతిరేక ఆలోచన నుండి అనుకూల ఆలోచనగా మార్చుకోవాలి.

2. నా మాటను ఎవరూ వినడం లేదు  మ్లాడితే అపార్థం చేసుకుంటున్నారు  దాచుకున్న ధనం ఉండడం లేదు  బంధువర్గం, కుటుంబంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి  దృష్టి సంబంధమైన ఇబ్బందులున్నాయి  స్పష్టంగా ఎదుటి వారికి ఏదీ చెప్పలేక పోతున్నాను వింవి కొన్ని ప్రశ్నలు.

ఆర్థిక బలహీనతలు ఏర్పడడానికి కారణం పూర్వకర్మలలో ఆ యా జాతకులు ధనాన్ని వ్యర్థంగా వినియోగించడం, దానధర్మాలు లేకపోవడం, సమాజాన్ని, ప్రకృతిని బాగా వినియోగించుకోవడమే. అదేవిధంగా ఎదుటి వారిలో పరమాత్మను గమనించకుండా ఇష్టం వచ్చినట్లుగా దూషించడం, అపార్థం చేసుకొని ఎదుటి వారిని ఇబ్బందులు పెట్టడం, వారిని చూసే దృష్టిలో లోపాలు, ఎదుటి వారిని తప్పు భావనతో చూడడం విం సమస్యలు పూర్వం చేసి ఉండే అవకాశం ఉంటుంది.

డా.ఎస్.ప్రతిభ

వీరు తమకు కావాలిసినంత మాత్రమే దాచుకుని మిగతా ధనాన్ని పుణ్య కార్యాలకు వినియోగించుకోవాలి. దాని వలన అభివృద్ధి ఉంటుంది. ధనం ప్రవాహశీలం కావాలి కాని దాచుకునే అంశం కాదని వివేచించుకోవాలి. అవసరానికి తగినంత లభిస్తూ మిగిలినది తమకు రావడం, పోవడం ఉంటే, ఆ ధనాన్ని లోకానికి, ప్రకృతికి వినియోగిస్తే పుణ్యబలం వల్ల ధన నిల్వలు పెరుగుతాయి. మాట విలువ పెరగడానికి భౌతికంగా, మానసికంగా మ్లాడడం తగ్గించాలి. ఎదుటి వారి మాటకు విలువ నిచ్చి, గౌరవించాలి. ప్రకృతిని, సమాజాన్ని, వ్యక్తులను ఆనందమయులుగా, పరమాత్మ స్వరూపాలుగా, చైతన్యమూర్తులుగా చూడడం అలవాటు చేసుకోవాలి. వీని వల్ల ప్రాయశ్చిత్తం జరిగి లోపాల నివారణకు అవకాశం కలిగి జీవితం ఆనందమయం అవుతుంది.

తమ చుట్టూ అపరిమితమైన సంపద గాలి, నీరు, వెలుతురుల రూపంలో ఉన్నదని, తమ శరీరం వెల కట్టలేనంత అత్యున్నతమైనదని, తమ మాటను అందరూ విని ఆనందమయులు అవుతున్నారనే భావనలను బాగా పెంచుకోవడం అవసరం.

ఈ ఆలోచనలన్నీ అందరికీ వచ్చేవే. ఇంకా కొన్ని కూడా ఉంటాయి. వాటి ని కూడా గమనిద్దాం.