Asianet News TeluguAsianet News Telugu

నాలుగు గ్రహాల స్థానాల్లో మార్పు ప్రపంచంలో 'కరోనా' తిరుగుబాట్లు

ఈ సమయంలో దేశ రాజకీయాల్లో, ప్రపంచంలోని రాజకీయాల్లో ఒడుదొడుకులు బయటపడే అవకాశాలుంటాయి. ఈ నాలుగు గ్రహాల వలన ఎలాంటి మార్పు జరగబోతుందో జ్యోతిషశాస్త్ర ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం.

astrology About Coronavirus
Author
hyderabad, First Published Nov 26, 2020, 8:58 AM IST

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

astrology About Coronavirus

శార్వరి నామ సంవత్సరం అంటే చీకటి సంవత్సరం అని గతంలో వివరించడం జరిగింది. అలాగే కరోనా మహమ్మారి, వరదలు, ఆకాల వర్షాలు మిడతల దండు మొదలైన విపత్తులను చవిచూసాము. ఈ డిసెంబర్లో నాలుగు పెద్ద గ్రహాలు రాశిచక్రాల మార్చు. గ్రహాల స్థానంలో భారీ పునర్నిర్మాణం జరిగింది, జరగబోతోంది.  వీటిలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఈ నాలుగు గ్రహాల స్థితిలో మార్పులు జరగనున్నాయి.

ఈ సంవత్సరం గ్రహాల స్థానంలో భారీ పునర్నిర్మాణం జరగడం వలన. జ్యోతిషశాస్త్ర ప్రకారం మొత్తం ప్రపంచంలో వినాశనానికి గురవుతున్న కరోనా మహమ్మారి బలీయమైన రూపాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చును. ఈ సమయంలో దేశ రాజకీయాల్లో, ప్రపంచంలోని రాజకీయాల్లో ఒడుదొడుకులు బయటపడే అవకాశాలుంటాయి. ఈ నాలుగు గ్రహాల వలన ఎలాంటి మార్పు జరగబోతుందో జ్యోతిషశాస్త్ర ప్రకారం ఇప్పుడు తెలుసుకుందాం.

డిసెంబరు వృశ్చికంలోకి శుక్రుడు:-  ప్రవేశిచడం వలన వైవాహిక జీవితం, ప్రేమ, సంబంధాలు, భౌతిక సౌకర్యాలు లాంటి ప్రధాననమైన పనులను నిర్వహించే రాక్షసుల గురువుగా పరిగణించబడే శుక్రుడు. వృశ్చికంలోకి ప్రవేశించనున్నాడు. రాశిచక్రాలకు ఇది చాలా శుభపరిణామం. కాబట్టి కొంతమంది ఇబ్బందుల్లో ఉండవచ్చు. శుక్రుడు సంతానోత్పత్తికి సంబంధించిందని కూడా నమ్ముతారు. ఇందులో గ్రహ స్థానంలో మార్పులు అనేక రాశిచక్రాల లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎవరి జాతక చక్రంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉందో వారు వైవాహిక, విలాసవంతమైన భొతిక సుఖాలకు దూరం అవుతారు.

​ధనస్సురాశిలోకి సూర్యుడు:- గ్రహ రాజైన సూర్యుడు. కెరీర్, శారీరక బలం, అధికారం, సమాజ గౌరవాన్ని ప్రభావితం చేస్తాడు. సూర్యుడు స్థానాన్ని మార్చడం వలన  మనందరి కెరీయార్ లో మార్పులను చవి చూస్తాము. రవి బలం గల జాతకులు తమ ఉద్యోగంలో కానీ వ్యవహారంలో కానీ పదోన్నతులు పొందుతారు. లేదా కొత్త మంచి ఉద్యోగాన్న పొందవచ్చు. సూర్యగ్రహం ప్రతికూలంగా ఉన్న జాతకులు ఈ మార్పు వలన తమపై చెడు ప్రభావాలను తొలగించడానికి వ్యక్తిగత జాతక ఆధారంగా రేమిడిస్ ఫాలో అవుతే శుభాలు కలుగుతాయి. ఆరోగ్యకరమైన శరీరంతో దీర్ఘాయువు పొందుతారు.

​ధనస్సురాశిలో బుధుడు:- డిసెంబరు17వ తేదీన ధనస్సు రాశిలో ప్రవేశం. బుధుడిని జ్యోతిష పరిభాషలో గ్రహాల యువరాజుగా పిలుస్తారు. బుధుడు అందరికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. వ్యక్తి యొక్క పరివర్తన దిశను నిర్ణయిస్తాడు. బుధుడు శుభ దృష్టి వలాన తెలివితేటల పెరుగుదలకు దారితీస్తుంది. బుధుడి వలన  హానికరమైన ప్రభావాలను తొలగించడానికి వ్యక్తిగత జాతక ఆధారంగా రేమిడిస్ ఫాలో అవుతే శుభాలు కలుగుతాయి. 

​డిసెంబరులో కుజుడు మేషరాశిలోకి ప్రవేశం:- కుజుడు స్వభావరీత్యా ఉగ్ర తత్వతం. కుజ గ్రహాన్ని జ్యోతిష శాస్త్రంలో మండుతున్న గ్రహంగా పరిగణిస్తారు. మీనం నుండి మేషంలోకి తన సొంత రాశిలో సంచారం. అక్టోబరు 4న కుజుడు మేషం నుండి మీనంలోకి తిరోగమనం చెందాడు. రెండున్నర నెలల తర్వాత కుజుడు తిరిగి మేషంలోకి ప్రవేశం. కుజుడిలో మార్పు వచ్చినప్పుడల్లా ప్రపంచంలో చాలా తిరుగుబాట్లు జరుగుతాయని జ్యోతిష పరంగా అంచనాలు వేసుకోవడం జరిగుతుంది.

ముఖ్య సూచన:- ఇప్పుడు వచ్చే గాలులు విషపు గాలులు ఇవి  "ఈశాన్యపవనం" అంటే కరోనా విస్తృతంగా ఉండే ప్రదేశాలను చుట్టుకుని వస్తుంది. మన భారత దేశంలో ప్రస్తుతం రెండో దశ ప్రారంభం అయినది. దానికి తోడుగా ఈ విషపు గాలులు కరోనాకు మరింత సహకరిస్తాయి. కరోనా నివారణకు వ్యాక్సిన్ 'మందు' ఇప్పుడప్పుడే రాదు. వచ్చిన శాశ్వత నివారణ ఫలితాలను ఇవ్వవు కాబట్టి వ్యక్తిగత శ్రద్ధ అవసరం. ప్రతి ఒక్కరు తమ శారీరక రోగనిరోధక శక్తిని పెంపోదించే ఆహారపదార్ధాలను తీసుకోవాలి. సామజిక భౌతిక దూరాన్ని పాటించాలి. ప్రభుత్వ సూచనలు పాటించాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించండి. కరోనా పాజిటివ్ వస్తే బయపడవద్దు నివారణ మార్గాలు పాటించండి. కరోనా వస్తే మనిషిని చావడు, కేవలం అజ్ఞానతో వ్యవహరిస్తేనే ప్రాణహాని జరుగుతుంది. 

జన సమూహాలకు దూరంగా ఉండాలి. మాస్కులు తప్పక ధరించాలి. తరచూ శానిటైజర్ ఉపయోగించాలి. సబ్బుతో చేతులు కడుక్కోవాలి. అన్ని పాటించిన భౌతిక దూరం తప్పక పాటించాలి. నీ ఆరోగ్యాన్ని నీవే కాపాడుకోవాలి. అజ్ఞానంతో వెళ్లి మృత్వువును కౌగిలించుకోవద్దు. డబ్బుతో దేన్నైనా కొనవచ్చేమో కానీ ప్రాణాన్ని, ఆత్మీయమైన అనుబంధాలను కొనలేము. నీ ఆరోగ్యం నీకోసమే కాదు నీ ఆత్మీయులకు, నీ భార్య పిల్లలకొరకు అని మరవవద్దు. నీ కుటుంబానికి నీవు ఎంతో ఆవసరమన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. షోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మవద్దు ప్రభుత్వ సమాచాలను, వార్తా పత్రికలను మాత్రమే  నమ్మండి. అనవసరంగా బయపడవద్దు జాగ్రత్తగా ఉంటే చాలు "సర్వే జనా: శిఖినోభవంతు" ... జై శ్రీమన్నారాయణ.  

Follow Us:
Download App:
  • android
  • ios