జుట్టు తెల్లబడటానికి కారణమేమిటో జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. కొన్ని గ్రహాల బలహీనత వల్ల వయసు మీద పడి తెల్లజుట్టు పెరుగుతుంది. మరి దీని పరిష్కరం ఏంటో ఓసారి చూద్దాం..
వయసు 40 దాటిన తర్వాత దాదాపు ఎవరికైనా తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఇది చాలా కామన్. కానీ ఇప్పుడు.. 20 ఏళ్లకే చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడటం అందాన్ని ప్రభావితం చేస్తుందని ప్రజలు నమ్ముతారు. అందరి ముందు యంగ్ గా కనిపించేందుకు చాలా మంది హెయిర్ డైయర్లు వాడటం మొదలుపెడుతున్నారు. కాగా.. జుట్టు తెల్లపడటానికి వైద్యుల ప్రకారం, మెలనిన్ లోపమే అని చెబుతున్నారు.
అయితే, జ్యోతిష్యంపై కొంచెం శ్రద్ధ వహించండి. జుట్టు గురించి జ్యోతిష్యశాస్త్రంలో చెప్పారు. జుట్టు తెల్లబడటానికి కారణమేమిటో జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు. కొన్ని గ్రహాల బలహీనత వల్ల వయసు మీద పడి తెల్లజుట్టు పెరుగుతుంది. మరి దీని పరిష్కరం ఏంటో ఓసారి చూద్దాం..
జుట్టు తెల్లబడటానికి ఇవే కారణాలు
జ్యోతిషశాస్త్రపరంగా, శుక్రుడిని అందానికి అనువైన గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం బలహీన స్థానం కారణంగా, జుట్టు అకాలంగా తెల్లగా మారుతుంది. శుక్రుడు కుజుడు, శని, రాహువు లేదా కేతువులతో రాశిలో ఉన్నప్పుడు తెల్లజుట్టు సమస్య రావచ్చు. అలాగే, శుక్రుడు జాతకంలో 6, 8 లేదా 12 వ ఇంట్లో ఉన్నప్పుడు అది జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది.
జుట్టు తెల్లబడటానికి ఒక కారణం బృహస్పతి బలపడటం కూడా. ఒక వ్యక్తి జాతకంలో బృహస్పతి బలమైన స్థానంలో ఉన్నప్పుడు వారి జుట్టు రంగు మారుతుంది. గురువు బలమైన స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి మనస్సు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. దీనివల్ల అతను తన శరీరం గురించి పట్టించుకోడు. దీని వల్ల అతని జుట్టు తెల్లబడుతుందని జ్యోతిష్యం చెబుతోంది.
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని వెంట్రుకల గ్రహంగా పరిగణిస్తారు. సూర్యుడు కూడా ప్రకాశవంతమైన గ్రహమే. గ్రహాల జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే, అంటే తుల, మకర లేదా కుంభంలో సూర్యుడు తెల్లగా ఉంటాడు. దీని వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య ప్రారంభమౌతుంది.
సూర్యుడు మాత్రమే కాకుండా చంద్రుని బలహీనమైన స్థానం కూడా తెల్ల జుట్టుకు కారణమవుతుంది. చంద్రుడు సూర్యుడు, కుజుడు, రాహువుతో ఉన్నప్పుడు, అతను బలహీనంగా ఉంటాడు. అప్పుడు జుట్టు రంగు మారుతుంది.
దోషాన్ని తొలగించి జుట్టును రక్షించండి
జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నివారణలు ఉన్నాయి. వీటిని అప్లై చేయడం ద్వారా మీ జుట్టు అందాన్ని కాపాడుకోవచ్చు.
జుట్టు రాలకుండా ఉండాలంటే రోజూ యోగా వ్యాయామం చేయాలి. రోజూ ఎండ తగలడం వల్ల.. జుట్టు తెల్లపడే సమస్య తగ్గుతుంది. జీవనశైలిలో మార్పు చాలా ముఖ్యం. భోజనం, నిద్ర ప్రతిరోజూ ఒకే సమయానికి అనుసరించాలి. జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే డైట్‌పై శ్రద్ధ పెట్టాలి.
