Asianet News TeluguAsianet News Telugu

మొక్కతో అదృష్టం.... ఏ రాశివారు ఏ మొక్క పెంచితే మంచిదో తెలుసా?

గ్రంథాలలో మొక్కలను, చెట్లను భగవంతునితో పోల్చారు. ప్రతి ఒక్కరూ ఆనందం కోసం ఒక మొక్కను పెంచాలని శాస్త్రాలలో చెప్పబడింది.
 

Astro  and vastu tips for Planting
Author
First Published Dec 7, 2022, 2:11 PM IST


పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పర్యావరణ ప్రేమికులకే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలో కూడా మొక్కలు, చెట్లను పెంచడం గురించి చాలా సమాచారం ఉంది. గ్రంథాలలో మొక్కలను, చెట్లను భగవంతునితో పోల్చారు. ప్రతి ఒక్కరూ ఆనందం కోసం ఒక మొక్కను పెంచాలని శాస్త్రాలలో చెప్పబడింది.

రాశి ప్రకారం చెట్లను నాటడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. దీని నుండి గ్రహ సమస్యలు పరిష్కరించగలరు. ఇది జీవితంలో కొత్త విజయానికి సహాయపడుతుంది. 2022 ముగుస్తోంది.  కొత్త సంవత్సరంలోకి అడుగుపెడడుతున్నాం. కొత్త సంవత్సరంలో పురోభివృద్ధి సాధించాలని, సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు రావాలని కోరుకునే వారు 2023లో తమ రాశిని బట్టి మొక్కలు పెంచుకోండి.. ఏ రాశి వారు ఏ మొక్కను నాటాలో తెలియజేస్తాం.

మేషరాశి: మేషరాశి వారు సుఖసంతోషాలు, ఐశ్వర్యం కావాలంటే జామకాయ మొక్కలను నాటాలి. ఎరుపు రంగు పూలు లేదా పండ్లతో ఒక మొక్కను నాటండి. ఇది గ్రహ దోషాన్ని తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

వృషభం: 2023లో వృషభరాశి వారు తెల్లటి పూలు, ఫలాలను ఇచ్చే మొక్కను పెంచాలి. ఊదా పండు మొక్కను పెంచడం కూడా శ్రేయస్కరం.

మిథునరాశి : మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఈ రాశి వారు వెదురు మొక్క  నాటడం మంచిది. మీరు తులసి మొక్కను కూడా పెంచుకోవచ్చు. ఇది మీ జీవిత విధిని మారుస్తుంది.

కర్కాటక రాశి: కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఈ రాశి వారు తులసి, వేప, జామకాయ వంటి ఔషధ మొక్కలను నాటడం శ్రేయస్కరం. మొక్క వాడిపోకుండా సంరక్షించాలి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.

సింహరాశి : 2023లో సింహరాశి వారు మర్రి మొక్క, చెరుకు మొక్క, అంజూర మొక్క నాటితే చాలా శుభప్రదం. సింహ రాశికి అధిపతి సూర్యుడు కావున ఈ మొక్కను సాగు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

కన్య: కన్యారాశి వారు మల్లె, మర్రి, వెదురు, తీగ మొక్కలు నాటడం మంచిది. దీనివల్ల ఇంట్లో సంపద, ధాన్యం పెరుగుతాయి.

తులారాశి : తులారాశి వారు పలాశ మొక్కను పెంచాలి. దీని వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

వృశ్చికం: వృశ్చిక రాశికి అంగారకుడు అధిపతి. వృశ్చిక రాశి వారు కుజుడు మంచి ఫలితాలను ఇవ్వాలి కాబట్టి ఎర్రటి పూలు, పండ్లతో మొక్కలు పెంచాలి.

ధనుస్సు: ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. ఈ రాశి వారు రెసిన్, జునిపర్ మొక్కలు నాటాలి. ఇది ధనుస్సు రాశికి మంచి ఫలితాలను ఇవ్వడానికి సహాయపడుతుంది.

మకరం: మకర రాశికి అధిపతి శని. మకరరాశి వారు శనిదేవుని అనుగ్రహం పొందడానికి 2023లో శమీ, చెరకు మొక్కలను పెంచడం మంచిది.

కుంభం : మకర రాశిలాగే కుంభ రాశిని శని పరిపాలిస్తుంది. కాబట్టి కుంభరాశి వారు మందార, కదంబ మొదలైన మొక్కలను నాటాలి.అప్పుడే మీకు శని అనుగ్రహం లభిస్తుంది.


మీనం: మీనరాశి వారు పసుపు రంగులో ఉండే పండ్లు, పూలు ఇచ్చే మొక్కలను పెంచాలి. మీరు మామిడి చెట్టును పెంచుకోవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios