ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తి ఉద్యోగాదులలో ఒత్తిడి ఉంటుంది. కొన్ని పనులలో నిరాక్తత ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వాగ్దానాల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం.పశుపక్షాదులకు నీరు పెట్టాలి, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : విద్యార్థులకు ఒత్తిడితో కూడిన సమయం. పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో ఒత్తిడి అధికం. అనవసర కష్టాలు ఉంటాయి. విదేశ వ్యవహారాలపై ఆలోచన ఉంటుంది. పశుపక్షాదులకు నీరు పెట్టాలి, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ప్రయాణాల వల్ల ఒత్తిడి ఉంటుంది. ప్రమాదాలకు అవకాశం. అనారోగ్య భావన ఉంటుంది. వైద్యశాలల సందర్శనం. వ్యాపారస్తులు అప్రమత్తత. విద్యార్థులకు ఒత్తిడి అధికం. క్లొటాటలపై ఆసక్తి పెరుగుతుంది. పరాధీనం అవుతారు. పకక్షులకు నీరు, ఆహారం పెట్టడం, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. పదిమందిలో గౌరవంకోసం ఎదురు చూపులు. గౌరవహాని. పనులలో ఒత్తిడి ఉంటుంది. పనులు ఆలస్యమయ్యే సూచన. పకక్షులకు నీరు, ఆహారం పెట్టడం, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. శతృవులపై విజయం. పోటీ ల్లో గెలుపు సాధిస్తారు. ఋణ ఆలోచనలు విముక్తి చేస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. పకక్షులకు నీరు, ఆహారం పెట్టడం, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ఒత్తిడి అధికం. సంతానం వల్ల సమస్యలు. సృజనాత్మకత తగ్గుతుంది. అనవసర భయాలు ఉంటాయి. కళాకారులకు ఒత్తిడితో కూడిన సమయం. విద్యార్థులకు అనవసర ఇబ్బందులు ఉంటాయి. సంతృప్తి లోపిస్తుంది. పరిపాలన సమర్ధత ఉంటుంది. సుబ్రహ్మణ్య జపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. గృహ సంబంధ లోపాలు ఉంటాయి. ప్రయాణాల్లో అనుకోని ఇబ్బందులు. ఇతరులతో ప్రవర్తించేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆహారంలో సమయ పాలన మంచిది. సాత్విక ఆహారం ఉత్తమం. పకక్షులకు నీరు, ఆహారం పెట్టడం, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సహోద్యోగులతో అనుకూలత. సోదర వర్గీయుల సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కమ్యూనికేషన్స్ అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం ఉంటుంది. ప్రచార, ప్రసార సాధనాలు లాభిస్తాయి.దగ్గరి ప్రయాణాలపైదృష్టి. పకక్షులకు నీరు, ఆహారం పెట్టడం, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దోరణిని మార్చుకోవాలి. మాటల్లో కాఠిన్యత కనబడుతుంది. వాగ్దానాల వల్ల ఇబ్బంది పడతారు. ఆవేశపడతారు. కుటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. నిల్వ ధనాన్ని కోల్పోయే పరిస్థితి. అనవసర ఇబ్బందులు వచ్చే సూచన జాగ్రత్త అవసరం. పకక్షులకు నీరు, ఆహారం పెట్టడం, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. పనుల్లో పట్టుదల అవసరం. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పులు అవసరం. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాట పడతారు. అనవసర ఒత్తిడి ఉంటుంది. పకక్షులకు నీరు, ఆహారం పెట్టడం, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు. శారీరక శ్రమ ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు.గొడవలకు పోరాదు. మానసికఒత్తిడి ఉంటుంది. పకక్షులకు నీరు, ఆహారం పెట్టడం, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. సమిష్టి ఆదాయాలు. ఆదర్శవంతమైన జీవితం. కళలపై ఆసక్తి ఉంటుంది. ఏపనినైనా పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. సాత్విక ఉపాసన ముఖ్యం. ఇతరులపై ఆధారపడతారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. పకక్షులకు నీరు, ఆహారం పెట్టడం, సుబ్రహ్మణ్యారాధన మంచిది.
డా.ఎస్. ప్రతిభ
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 1, 2018, 9:40 AM IST