వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు సెంట్రల్ జైలుకి తరలించారు. శనివారం ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయనకు 14రోజుల రిమాండ్ విధించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం పోలీసులు ఆయనను సెట్రల్‌ జైలుకు తరలించారు.

పోలీస్ స్టేషన్ లో అధికారులను బెదరించారనే ఆరోపణలతో కోటంరెడ్డిని అరెస్టు చేశారు. కాగా.. తాను కేవలం తాను ప్రశ్నించేందుకు వెళితే.. తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొంటున్నారు. పోలీసులంటే నాకు గౌరవం ఉందని ఆయన అన్నారు. కాగా... త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై పోలీస్ కేసు నమోదు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉండగా.. ఆయన అరెస్టుని నిరసిస్తూ.. కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.  పోలీసుల తీరుని నిరసిస్తూ.. రోడ్డు పై బైఠాయించారు. అయితే.. ఈ ఉద్రిక్తత కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగినన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలు చోట్ల బందోబస్తు  ఏర్పాటు చేశారు.