జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అవ్వడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అవ్వడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాగుంట టీడీపీ ని వీడి.. జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారనే ప్రచారం కూడా మొదలైంది. కాగా.. దీనిపై తాజాగా మాగుంట వివరణ ఇచ్చారు.
పవన్ తనకు మొదటి నుంచి మంచి మిత్రుడని మాగుంట చెప్పుకొచ్చారు. పవన్ తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. అందుకే పవన్ ని కలిసినట్లు చెప్పుకొచ్చారు. కేవలం ఒక మిత్రుడిగా మాత్రమే తనను కలిశానని... రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
కాగా.. గత కొంతకాలంగా మాగుంట పార్టీ మారతాడనే ప్రచారం జోరుగా సాగింది. మొదట వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరగగా.. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. తాజాగా.. పవన్ తో భేటీ కావడంతో ఈ సారి జనసేనలోకి అంటూ ప్రచారం ఊపందుకుంది. కాగా.. ఆ ప్రచారానికి కూడా మాగుంట తాళం వేశారు.
