అమరావతి: గుంటూరుపశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆమోదించారు. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనను కలచివేస్తున్నాయంటూ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారు. 

అందులో భాగంగా మంగళవారం తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మోదుగుల రాజీనామాను స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు బుధవారం ఆమోదించారు. 

ఇకపోతే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మార్చి 9న వైసీపీలో చేరబోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ లేదా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.